Saturday, September 29, 2007

నా ప్రపంచం

  • నా ప్రపంచం వసుధైక కుటుంబం.
ఇందులో ప్రకృతి, మనిషి కలసిమెలసి పెరుగుతారు. ప్రతీ ఒక్కరూ తమ
individual brilliance తో వెలుగుతారు. ప్రతీ కుటుంబం లో కనీసం
రెండు చెట్లు సభ్యులుగా ఉంటాయి. Apartments ఉండవు. పల్లె, పట్నం
అని differentiate చెయ్యలేము. అన్నీ సౌకర్యంగా, పచ్చగా ఉంటాయి.
  • ఇక్కడ 'conditioned' relationships ఉండవు.
Relationships grow naturally without any conditioning
by the society. They enjoy full freedom. చట్టం ప్రకారం,
'పేరెంట్స్' అన్న సంబంధం ఉంటుంది. నిర్ణీత వయసు దాటిన
యువతీ, యువకులు మాత్రమే పిల్లల్ని కనగలరు. ఒకసారి పిల్లల్ని
కన్నాక, పిల్లలకి 15 ఏళ్లు వచ్చేవరకు విధిగా parenting చెయ్యాలి.
  • ఇంక చదువు విషయానికి వస్తే,
Education essentially teaches how to lead a happy life.
In my world, Education is not seen as a means of
employement. It first teaches values (like Truth,
Individuality, Dignity of labour, equality) and
then upon it knowledge. It helps free the mind to be its
creative, sensitive and entrepreneurial best.
ధనిక, పేద, జాతి, కుల, మత,వర్గ విభేధాలు పిల్లల మనసుల్లోకి రాకుండా
5th standard నుంచీ 10th standard వరకూ అందరూ ఒకే చోట
కలసి పెరిగే గురుకుల విధ్య.
ఇక్కడ ఏ కోర్స్ కైనా certificates గానీ, మార్కులు గానీ ఉండవు.
ఇవి లేకుండా ఉద్యోగాల్లోకి ఎవరిని, ఎలా తీసుకోవాలి అన్నది పూర్తిగా
recruiters బాధ్యతే. Education is free of cost and run only
by government.
  • నా ప్రపంచంలో Large Scale Industries ఉండవు.
అన్నీ కుటీర పరిశ్రమలే. ఆర్ధిక తారతమ్యాలు చాలా తక్కువగా ఉంటాయి.
muncipalities, corporations ఉండవు. Only grama panchayats,
state governments and central government.
Local governance ( like graama panchayats) will be given
top priiority and will be more autonomous. ప్రతీ గ్రామ పంచాయతీ
తమ పరిధిలోని నిధులను, tax లా ద్వారా వచ్చే ఆదాయాన్ని తామే collect
చేసుకుంటారు. ఇందులో 80% నిధులు local governance కి, మిగిలిన
20% నిధులు state and central governments కి వెళ్తాయి.

Friday, September 21, 2007

నేనూ, నా frustration, మా మురిపాలు...

ఈ రోజు ప్రశాంతంగా ఉందామని office కి సెలవు పెట్టాను.
కానీ ఎక్కడ ప్రశాంతత? 'అందరూ ఏదో ఉపయోగపడే పని చేసేస్తున్నారు.
నేనే ఖాళీగా ఉండిపోయాను.' అన్న పురుగు లాంటి ఫీలింగ్ రెగ్యులర్
గా నన్ను interrupt చేస్తూ ఉంది. పోనీ ఆఫీషు కి వెళ్తే బాగుంటామా
అంటే అదీ లేదు. ఆఫీషు లోకి అడుగు పెడుతూనే keyboard చప్పుళ్లు,
బిజినెస్ మాటలూ స్వాగతిస్తాయి. మనిషి చప్పుళ్లు ఉండవు. ఎవ్వరూ
గట్టిగా నవ్వరు కూడానూ. అసలు ఆఫీషే ఒక పెద్ద computer లా
అనిపిస్తుంది. అందులో bugs లేని program ఒకటి రొటీన్ గా run
అవుతున్నట్లు గా ఉంది. ఆ ప్రదేశం కి వచ్చిన ఒక కుక్కని నేను.
మనిషి వాసన కోసము వెదుకుతున్నాను. ఎక్కడా రాదాయె. ఇంక
కూర్చొని పని మొదలుపెడుతూనే, నా లోని social psychologist
లేస్తాడు. 'అసలు ఈ technology జనాలకి ఏ విధంగా
ఉపయోగపడుతుందో చెప్పు?' అంటూ క్లాస్ మొదలుపెడతాడు. ఇంక
'apartment culture, మనిషి మరీ narrow అయిపోవడమూ, ఉమ్మడి
కుటుంబాలు లేకపోయే కనీసం పిల్లలకి నానమ్మలూ, తాతయ్యాలూ
కరువు అవ్వడం, tv లు వచ్చి మనకీ పక్కింటికీ మధ్య దూరాలు
పెంచడము, pollution, ... ' ఇలా పక్క రూమ్ లో మేకులు కొడుతున్న
కార్పంటర్ లా నా మెదడు లోని ఒక compartment లో గొడవ చేస్తుంటాడు.
ఇంతలో 'నా ఆశయాలు' అన్న board మెడలో వేసుకొని ఇంకొకడు వస్తాడు.
'అసలు నువ్వు ఏమనుకున్నావు? ఏమి చేస్తున్నావు? ఏ మణిరత్నమో,
రామ్‌గోపాల్ వర్మనో లేదా సమాజాన్ని ఉద్దరించే ఏ గొప్ప వ్యక్తి గానో
అవుదామనుకున్న నువ్వు ఇప్పుడు ఎక్కడ వున్నావు?...' ఇలా సాగుతోంది
వాడి మృదంగం. వీరిద్దరి orchestra మెల్లగా పెరిగి పెద్దది అవుతుంది. ఆది
'ఆఫీషు పని' అన్న singer voice ని dominate చేసేసి కాసేపటికి
వినిపించకుండాచేస్తుంది. అప్పటికి సాయంత్రం అయిదవుతున్ది. ఇంకొక
గంట మెల్లగా timepass చేస్తాను. ఆరయ్యేసరికి హనుమంతుడిలా ఒక్క
అంగలో bus stop కి వెళ్లిపోదామనుకుంటాను. కానీ 'Be professional' అని
సర్ది చెప్పుకొని చాలా professional గా నడుచుకుంటూ పోతాను. నాతో
పాటు 'మ్యానేజర్ ఏమనుకుంటాడు?', 'company ని మోసం చేస్తున్నాను'
లాంటి ఫీలింగులూ బస్సెక్కుతాయి. ఇంటికి వచ్చాక ఈ వెర్రికి రాత్రంతా tv కి
అంకితం చేస్తాను.

ప్రొద్దున లేస్తాను. కొంచం ఫ్రెష్ గా అనిపిస్తుంది. bathroom లో కూర్చున్నాక
the most creative and positive part of my brain starts
functioning. మంచి మంచి ideas వస్తాయి. ఈ రోజు నుంచీ ఇలా చెయ్యాలి,
అలా ఉండాలి, వీకెండ్స్ లో theatre group లో జాయిన్ అవ్వాలి, ఏదన్నా
music నేర్చుకోవాలి అని బోలెడు స్కెచ్ లు గీస్తాను. తయారయి ఆఫీషు కి వెళ్తాను.
ఇంక షరా మామూలే.

(దయచేసి ఇందులోని negative feelings ని గ్రహించకండి. సరదాగా చదివి
నవ్వుకోండి. love you all.)

Sunday, September 16, 2007

భావుకతా !...

నా అభౌతిక ప్రపంచం లోకి నువ్వు అనుకోని అతిధివి.
నీ స్పర్శ తో భావస్పందన లేని నా మనసు శిల సరససామ్రాజ్ని మోహిని గా మారింది.
ఇప్పుడు తనకి ఎంతటి సున్నితత్వము, ఎన్ని కేరింతలు, ఏమి లావణ్యము!...

నీ కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను. తను నవ్వింది.
నువ్వు నా హృదయతంత్రి ని మీటావు.నా గుండె రాగాలు పలికింది.
స్నేహం విత్తు మొక్క అయ్యింది. ఆ మొక్కకి 'ప్రేమ' అనే భావం మొగ్గ తొడిగింది.
తన స్పర్శ కి నువ్వు అర్థాలు చెప్పావు.
పెదవుల ఆట గురించి అడిగితే 'తనకు నువ్వంటే పిచ్చి ఇష్టం' అన్నావు.
కౌగిలి దిగ్బంధనాన్ని 'నువ్వు లేకుండా నేనుండలేను' అని తర్జుమా చెప్పావు.
ప్రేమ నా హృదయగిరిని దట్టమైన మేఘంలా కమ్మేసింది.
ఆ అనుభూతి వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను.

కొన్నాళ్ళకి కాలం నా వెర్రితనాన్ని ఆవిష్కరించింది.
'Be spontaneous yaar' అంటూ తను నన్ను విడిచిపోయింది.
నా పల్లెటూరి ప్రేమని తన పట్నం ప్రేమ ఎగతాళి చేసిపోయింది.
మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను మోసం చేశావు. భయంకరంగా దెబ్బ తీశావు.
కక్షతో నిన్ను నా మనసు నుంచి వెలివేద్డామనుకున్నాను.
కానీ నువ్వు దుఖంలో కూడా దాగివున్న అందాన్ని చూపించావు.
నేను మరింత పరిణితి పొందాను.
నిన్ను మరింతగా గుండెలకి హత్తుకున్నాను.

Saturday, September 8, 2007

సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ call చేశాడు. వేరే
company కి jump కొట్టాడు అట. Package చాలా బాగుంది. ఆది వినేసరికి,
మనస్సు ఒక్కసారి jealousy, inferiority లాంటి వాటితో నిండిపోయింది.
నేను సాధారణం గా డబ్బు కి అంత ప్రాధాన్యం ఇవ్వను. కానీ అప్పుడప్పుడు
society conditioning నా మీద పని చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేశాను.
తలుపు దగ్గరికి వస్తూనే, "శీను మామ!!" అంటూ పిల్లలు నన్ను
చుట్టుముట్టేసారు. మా ఇంటికి అక్కలూ, వారి పిల్లలూ వచ్చారు. పిల్లల్ని
బయటకు తీసుకు వెళ్ళి, నచ్చినవి కొనిపెట్టి, మేడ మీదకు తీసుకు వెళ్ళి,
వాళ్ళని ఆడిపించటం మొదలుపెట్టాను. మెల్లగా నేనూ వాళ్ళతో
కలిసిపోయాను... చిన్న పిల్లాడినైపోయి... ఈ తొక్కలో ఇగోలన్నీ వదిలేసి.. అలా
చాలా సేపు ఆడుకొని, అలసిపోయాము. అప్పుడు నాకు నేను చాలా తేలికగా,
స్వచ్ఛంగా, స్నానం చేసి మురికిని వదిలించుకొని తాజాగా ఉన్నట్లుగా
అనిపించింది. అప్రయత్నంగా నా ఫ్రెండు, వాడి package గుర్తుకు వచ్చాయి.
మనసు దానిని ఏదో సామాన్య వార్తలా చదివి పక్కన పడేసింది.
నేను నిండుగా నవ్వుకున్నాను.


ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ ఒత్తిడి తో గుండు
చేయించుకున్నాను. అసలుకే, చాలా ఎకరాలు పోయాయి. జుత్తు
ఉన్నప్పుడు ఏదోలాగా కొంత కవర్ చేసే వాళ్ళము. ఇప్పుడు జుత్తు
లేకపోయేసరికి, బట్టతల clear గా కనపడుతోంది. ఇంక చిరాకేసి, అద్దము
చూసుకోవడం మానేశాను. ఈ రోజు బస్ లో వస్తున్నప్పుడు నా పక్కన ఓ
ప్రేమ జంట. ఇద్దరూ చిలిపి గా గుసగుసలాడుకొంటున్నారు. వారి కళ్ళలోంచి
ప్రేమ భావము, లేలేత కాంక్షలు ఒలుకుతున్నాయి. రాత్రి పడుకోబోయే
ముందు ఎందుకో ఆ జంట గుర్తుకు వచ్చింది. ఆలోచనలు మనసుని ఎక్కడికో
తీసుకెళ్లాయి. లేచి, diary అందుకొన్నాను. ఏవో కవితలూ ('కవితలు' అని
నేను ఫీల్ అవుతూ ఉంటాను.), పిచ్చపాటీ రాసుకున్నాను. రాయటం
పూర్తయ్యాక ఒకసారి రాసింది చదువుకున్నాను. బాగా అనిపించింది. తృప్తిగా
లేచి ఇటు,అటు పచార్లు చేస్తున్నాను. మనసులో ఇంకా ఆగని భావ పరంపర,
ఏవేవో వూహలు. అలా నడుస్తూ యాదృఛ్ఛికం గా అద్దము వైపు చూశాను.
ఆశ్చర్యం!!. నేను అందం గా కనిపించాను.

Monday, September 3, 2007

నా టింగ్ టింగ్స్

ఈ టింగ్-టింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.. టింగ్-టింగ్ అంటే 'గుండెల్లో బెల్
మోగించిన అమ్మాయి' అన్న మాట.

నా first టింగ్ టింగ్ పేరు - 'మీన'. నేను అప్పుడు 5th క్లాస్. నేను, ఆమె కలిసి
ఆడుకొనేవాళ్ళము. ఒక రోజు స్కూల్ ముందు ఇసక మీదెక్కి ఆడుకుంటున్నాము.
sudden గా తను తూలబోతూ ఉంటే, నేను పట్టుకొని, నేను కూడా బ్యాలెన్స్
కోల్పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుకుంటూ పడిపోయాము. ఆ వయసు లోనే
నాకు ఏదో సినిమా లో హీరొ, హీరొయిన్లు ఇలా slow motion లో పడటం
గుర్తుకు వచ్చింది. ఇంక అంతే! మోగింది బెల్. అప్పటి నుంచి తనని ఒక
హీరొయిన్ లా నేనొక హీరొ లా ఫీల్ అవుతూ చూసేవాడిని. 6th class లో మా
ఇద్దరి స్కూల్స్ మారిపోయాయి. మేము అలా విడిపోయాము.

ఆ అమ్మాయి పేరు 'మంజుల'. నేను 10th class. కొత్తగా tution లో join
అయ్యాను. ఆ రోజు first day. పొద్దున్నే త్వరగా వచ్చేశాను. చలి కాలం.
ఇంక ఎవరూ రాలేదు. అంతలో చిన్నగా కాళ్ళ పట్టీ ల తాలూక మువ్వల
చప్పుడు. చాలా rhythemic గా దగ్గరకు వస్తున్నాయి. అందమైన పాదాలు..
సన్నని నడుమును పట్టెసుకున్న మిడ్దీ
(మెరూన్ color top, black color skirt) .. తల స్నానం చేసి అలానే
వదిలేసిన కురులు.. ముఖం మీద పడిన కురులను గాలి ఎగరవేస్తుంటే,
మబ్బులను వీడిన చందమామ లా ఉంది ముఖం.. ఇంక ఒక్క బెల్ ఏమిటి...
saxophone, violin, piano ఇలా అన్నీ కలిసి లోపల ఆర్కెస్ట్రా వాయించేశాయి.
ఇంక రోజూ తనని దొంగతనం గా follow అవ్వడం.. ఇంటి వరకు డ్రాప్
చెయ్యడం.. సెలవులు వస్తే సైకిల్ మీద వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు..
ఇలా సాగేది యవ్వారం. ఒక రోజు తను గుర్తుకు వచ్చి భావావేశం పట్టలేక
'మంజుల, మంజుల' అంటూ రామకోటి లా నోట్‌బుక్ లో ఒక 4 పేజీలు
నింపాను. ఆది మా పెద్దక్క కంట పడింది. అప్పుడు నన్నుమేడ మీదకి తీసుకెళ్లి
కర్ర ఇచ్చుకొని బాదిన్ది కదా ఆది మామూలు బాదుడు కాదు. అయినా అంతా
మామూలే. కుక్క తోక వంకర కదా. 10th అయ్యాక నా టింగ్ టింగ్ వాళ్ళు వేరే
వూరెల్ళిపోయారు. నా one-side love story అలా ముగిసింది.

Engg. admissions ఇంకొక 2 months లో ఉన్నాయి. మాకు తెలిసిన వారిది
computer centre ఉంటే games ఆడుకోవటానికి వెళ్ళేవాడిని. ఓ రోజు
sudden గా ఒక అమ్మాయిని కంప్యూటర్ సెంటర్ క్లాస్ లో చూశాను.
next day class లో నేను కూడా 'present sir' అన్నాను. ఆ అమ్మాయి పేరు
'షర్మిల'. ఒకసారి lab లో ఏదో program కి నా logic work అయినప్పుడు తను
shake hand ఇచ్చింది. shot అక్కడ freeze అయ్యింది. Background లో
saxophone music ( నా ఒక్కడికే). తను ఇచ్చిన dairy milk chocolates,
తన బుగ్గల మీద సొట్ట, నవ్వితే మెరిసే కళ్ళూ ఇవన్నీ ఊహలకి catalystలు
అయ్యాయి. ఇంతలో admissions start అయ్యాయి. ఇద్దరివీ వేర్వేరు ఊళ్ళలో
college లు. తను వెళ్లే ముందు నా ఫీలింగ్స్ గురించి చెప్పెద్దామని చాలా బలంగా
అనిపించింది. కానీ అప్పటికే కొంచం పరిణితి వచ్చిందనుకుంటా. కొంచెం ఆగి
చూద్దాం అనుకున్నా. కొన్నాళ్ళకి 'ప్రేమ' అనే అద్దెకు తెచ్చుకున్న feeling
కరిగిపొయినా అందమైన స్నేహం మాత్రం మిగిలిపోయింది. మేమిద్దరం ఇప్పటికీ
మంచి స్నేహితులము.

ఇంక చివరి టింగ్ టింగ్ కధ చాలా emotional గాధ. ఇప్పట్లో చెప్పను. ఇంకెప్పుడైనా...