Skip to main content

నేనూ, నా frustration, మా మురిపాలు...

ఈ రోజు ప్రశాంతంగా ఉందామని office కి సెలవు పెట్టాను.
కానీ ఎక్కడ ప్రశాంతత? 'అందరూ ఏదో ఉపయోగపడే పని చేసేస్తున్నారు.
నేనే ఖాళీగా ఉండిపోయాను.' అన్న పురుగు లాంటి ఫీలింగ్ రెగ్యులర్
గా నన్ను interrupt చేస్తూ ఉంది. పోనీ ఆఫీషు కి వెళ్తే బాగుంటామా
అంటే అదీ లేదు. ఆఫీషు లోకి అడుగు పెడుతూనే keyboard చప్పుళ్లు,
బిజినెస్ మాటలూ స్వాగతిస్తాయి. మనిషి చప్పుళ్లు ఉండవు. ఎవ్వరూ
గట్టిగా నవ్వరు కూడానూ. అసలు ఆఫీషే ఒక పెద్ద computer లా
అనిపిస్తుంది. అందులో bugs లేని program ఒకటి రొటీన్ గా run
అవుతున్నట్లు గా ఉంది. ఆ ప్రదేశం కి వచ్చిన ఒక కుక్కని నేను.
మనిషి వాసన కోసము వెదుకుతున్నాను. ఎక్కడా రాదాయె. ఇంక
కూర్చొని పని మొదలుపెడుతూనే, నా లోని social psychologist
లేస్తాడు. 'అసలు ఈ technology జనాలకి ఏ విధంగా
ఉపయోగపడుతుందో చెప్పు?' అంటూ క్లాస్ మొదలుపెడతాడు. ఇంక
'apartment culture, మనిషి మరీ narrow అయిపోవడమూ, ఉమ్మడి
కుటుంబాలు లేకపోయే కనీసం పిల్లలకి నానమ్మలూ, తాతయ్యాలూ
కరువు అవ్వడం, tv లు వచ్చి మనకీ పక్కింటికీ మధ్య దూరాలు
పెంచడము, pollution, ... ' ఇలా పక్క రూమ్ లో మేకులు కొడుతున్న
కార్పంటర్ లా నా మెదడు లోని ఒక compartment లో గొడవ చేస్తుంటాడు.
ఇంతలో 'నా ఆశయాలు' అన్న board మెడలో వేసుకొని ఇంకొకడు వస్తాడు.
'అసలు నువ్వు ఏమనుకున్నావు? ఏమి చేస్తున్నావు? ఏ మణిరత్నమో,
రామ్‌గోపాల్ వర్మనో లేదా సమాజాన్ని ఉద్దరించే ఏ గొప్ప వ్యక్తి గానో
అవుదామనుకున్న నువ్వు ఇప్పుడు ఎక్కడ వున్నావు?...' ఇలా సాగుతోంది
వాడి మృదంగం. వీరిద్దరి orchestra మెల్లగా పెరిగి పెద్దది అవుతుంది. ఆది
'ఆఫీషు పని' అన్న singer voice ని dominate చేసేసి కాసేపటికి
వినిపించకుండాచేస్తుంది. అప్పటికి సాయంత్రం అయిదవుతున్ది. ఇంకొక
గంట మెల్లగా timepass చేస్తాను. ఆరయ్యేసరికి హనుమంతుడిలా ఒక్క
అంగలో bus stop కి వెళ్లిపోదామనుకుంటాను. కానీ 'Be professional' అని
సర్ది చెప్పుకొని చాలా professional గా నడుచుకుంటూ పోతాను. నాతో
పాటు 'మ్యానేజర్ ఏమనుకుంటాడు?', 'company ని మోసం చేస్తున్నాను'
లాంటి ఫీలింగులూ బస్సెక్కుతాయి. ఇంటికి వచ్చాక ఈ వెర్రికి రాత్రంతా tv కి
అంకితం చేస్తాను.

ప్రొద్దున లేస్తాను. కొంచం ఫ్రెష్ గా అనిపిస్తుంది. bathroom లో కూర్చున్నాక
the most creative and positive part of my brain starts
functioning. మంచి మంచి ideas వస్తాయి. ఈ రోజు నుంచీ ఇలా చెయ్యాలి,
అలా ఉండాలి, వీకెండ్స్ లో theatre group లో జాయిన్ అవ్వాలి, ఏదన్నా
music నేర్చుకోవాలి అని బోలెడు స్కెచ్ లు గీస్తాను. తయారయి ఆఫీషు కి వెళ్తాను.
ఇంక షరా మామూలే.

(దయచేసి ఇందులోని negative feelings ని గ్రహించకండి. సరదాగా చదివి
నవ్వుకోండి. love you all.)

Comments

Unknown said…
మనిషి చప్పుళ్లు ఉండవు.
నేను ఆ చప్పుళ్ళ కోసమే వెతుకుతూ ఉన్నా ...
కామ్రేడ్‌!.. స్వాగతం.