Saturday 28 July 2007

వేకువ రాగం

అంతా చీకటి. చుట్టూ ఏమీ లేదు సముద్ర ఘోష తప్ప. చంద్రుడు లేని ఆకాశం నల్లని చీర కట్టుకొని, పెద్దగా ఉన్న చీర కొంగుని అలాగే గాలికి వదిలేసి సముద్రపు ఒడ్డున తన ప్రియుని కోసం ఎదురు చూస్తున్న పడుచు లా ఉంది. అక్కడక్కడ మెరుస్తున్న నక్షత్రాలు ఆ చీర కొంగుకు అద్దిన చమ్కీల్లా ఉన్నాయి. తన ప్రియుడు రాబోతున్నాడని ఏ మేఘమో కబురంపినట్లు గా ఉంది దూరం గా తూర్పున ఒక చిన్న వెలుగురేఖ ఆశ లా విచ్చుకొంటోంది. వస్తూనే నన్ను ఎలా చుట్టెస్తాడా అన్న ఊహ వచ్చి బుగ్గలు ఎర్రబడినట్లు ఉన్నాయి. వెలుగురేఖ ఎర్ర నారింజ రంగు లోకి మారింది. ఆ ఊహల్లో ఉంటూండగానే చూసింది - దూరంగా అశ్వారూఢూడై వస్తున్నాడు సఖుడు. అరె! ఆకాశానికి ఎంత హర్షాతిరేకం!!. ఆనందంతో ఎన్ని రంగులు మార్చుకొంటోందో... ఎన్ని హోయలు వొలకబొస్తోందో... అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఏదో ఆహ్లాదమైన రాగాన్ని అందుకున్నట్లు గా ఉంది. నక్షత్రాలు బారులు తీరిన వయొలిన్ విద్వాంసుల్లా ప్రకృతి ఆలాపనకి వాయులీన సహకారం అందిస్తున్నారు. పిల్ళగాలి గాడు ఆ tunes కి అనుగుణంగా ఊగుతున్నాడు. ఆ రాగం.. ఒక క్రొత్త స్వాగతం లా... ఒక నూతన ఒరవడి లా... నిన్నటి బాధల నుంచి నేటి ఆనందాలకి నడిపించే దృక్పధం లా ఉంది.

సముద్ర గర్భం నుంచి భానుడు క్రొద్దిగా బయటకు వచ్చాడు అప్పటి వరకు అమ్మ ఒడిలోనే దాక్కొని పడుకొన్న చoటి బాబు ముఖం మీద దుప్పటి ని తొలగించి బయటకి చూస్తుంటే, అమ్మమ్మ వచ్చి "ఓయ్!! కన్నాలూ.. లెగిసిపోయావా!!" అని అడిగితే సమాధానం గా నవ్వినప్పటి నవ్వు వెలుగు లా ఉన్నాడు సూరీడు. ఇంక గమ్మున తెల్లారింది.

Sunday 22 July 2007

చిన్న చిన్న ఆనందాలు

స్నేహితుని ఉత్తరం పూర్తిగా 'ఇట్లు నీ స్నేహితుడు, xxxx.' అంత వరకూ చదివాక కూడా మనకు తెలియకుండానే మన కళ్ళు క్రిందన ఇంకా ఏమన్నా రాశాడేమో అని గుడ్డిగా వెతుకుతాయి. ఎంత వెచ్చని గుడ్డి అభిమానం!!. ఆ ఉత్తరం ని చదివాక దానిని ఎంత ఆప్యాయం గా పట్టుకుంటామని!!.

ప్రియురాలి తో కానీ బాగా నచ్చిన వాళ్ళ తో కానీ phone లో మాట్లాడుతున్నప్పుడు, 'bye' చెప్పేసాక కూడా ఒక రెండు క్షణాల వరకు disconnect చెయ్యము. మాటల్లో చెప్పలేని భావం ఏదో ఇంకా మిగిలిపోయి, ఆది చెప్పలేక, call cut చెయ్యలేక హృదయం ఎంత ఆరాటపడుతుందని!!. కాసేపు ఆగి, వెనక్కి వెళ్ళి, ఆ రెండు క్షణాలని తరచి చూస్తే... మనసు ముగ్ధ మూగది అయ్యి, తేటగా అమాయకత్వం తో ఎంత ముద్దు గా కనపడుతుందో!!.

ఇలా చిన్న చిన్న feelings ఎంత అద్భుతమైనవో. ఈ చిన్న చిన్న ఆనందాలే జీవితమేమో.

Labels:

Saturday 21 July 2007

నా గురించి ...

నా పేరు శ్రీనివాస్. I'm a software engineer. When I think about myself, I look like an unsolved bug. జీవితం ఏ గమ్యాలకో తెలియని పరుగు లా ఉంది అందుకే ఎప్పుడూ ఆలోచించను. అలాంటి ఆలోచనలు వస్తే, ఏ Gtalk నో, లేదా greatandhra.com నో open చేస్తాను. ఇప్పుడు మొదటి సారి అక్షర రూపం ఇస్తున్నాను.

ఆదివారం సాయంత్రం నుంచే ఏదో uneasyness...గుండెల్లో ఏదో బెంగ వీకెండ్ అయిపోతుంది అని. వీకెండ్ లో కొంచం రిఫ్రెష్ అయి, మెంటల్ గా ప్రిపేర్ అయి, self motivate చేసుకొని monday ని ప్రారంభించినా.. బుధవారానికి మనసు మొండి కేస్తుంది. ఇంకా దానికి ఏ అందమూ పట్టాడు సాయంత్రం మేడ మీద నన్ను చూసి హుషారుగా 'ఎన్ని రోజులు అయ్యింది నేస్తాం నీతో కలిసి పాడుకోని?' అని పలకరించిన పిల్ల గాలి నిరాశ తో వెను తిరుగుతుంది. ఉదయాన వెళ్లే దారిలో.. మంచు తో ఆటలాడి అందం గా విచ్చుకొన్న గడ్డి పూవు తనని గమనించలేదని మూతి మూడు వంకర్లు టిప్పుకొంటుంది చేసే వృత్తి మనసుకి నచ్చకపోతే, ఇంకా ఏదీ నచ్చదు. 'మరి నాకేది ఇష్టం? నాకు suit అయ్యే profession ఏది?' అని ప్రశ్నించుకొంటె నా దగ్గర సమాధానం లేదు.

నా మీద నాకే సిగ్గుగా ఉంది 25 సంవత్సరాలు నిండి కూడా నా గురుంచి నాకు తెలియదు అని వొప్పుకోవడానికి. తప్పంతా ఈ దెంగులోడి సమాజం దే!! (ఎవరి మీదో ఒకరి మీద తప్పు తోసేయ్యాలి కదా!). 'నాకేంటి నచ్చుతుంది?' అన్న వూహ వచ్చేలోపే ఆ individuality process ని erase చేసేసి, నీ లక్ష్యం 'Engineering' అని మనల్ని program చేసే పెద్దలు, subject పైన excite చెయ్యలేని engineering faculty, ఇంక ఫ్రెంద్స్.. సినిమాలు.. అమ్మాయిలు.. వాళ్ళతో స్నేహాలు-ప్రేమలు.. మధ్యలో హడావుడి గా semester exams... ఈ గందరగోళం అలా కొనసాగుతూ ఉండగానే చేతికి engg degree వచ్చేస్తుంది. ఒక్కసారిగా బుర్ర మీదకి బాధ్యతలు.. అందరిలానే హడావుడిగా ఉద్యోగ ప్రయత్నాలు.. కొన్ని failures.. insecurities.. చివరికో ఉద్యోగం. కాలక్రమం లో మెల్ల మెల్లగా పొరలు తొలిగి పోయాక మిగిలింది.. ఈ నిరాసక్తత.

ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ society conditioning నుంచి బయటకు వచ్చి నన్ను నేను తెలుసుకోవటం ప్రారంభించాలా?.. "అమ్మో!! అంత పెద్ద సాహసమే?". ఇప్పుడు ఈ s/w ఉద్యోగం మానేసి ఇంకేది అన్న చిన్నది చేస్తానంటే జనాలు నా నోట్లో ఉమ్మేస్తారు. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. మరొక వైపు 'పెళ్లి చేసుకో' అంటూ ఇంట్లో ఒత్తిడి. 'ఇప్పటికే బుర్ర మీద సగానికి పైగా ఎకరాలు రాలిపోయాయి. కొన్నాళ్ళు ఆగితే ఇంకెవరూ నాకు పిల్లను ఇవ్వరూ' అన్న tension మరొక వైపు. ఈ మధ్యన రాత్రి అయితే 'ఆ సుఖం' కూడా కావాలంటోంది శరీరం. మనకంటూ life లో ఒక 'focus' లేకపోతే ఇలాంటి తొక్కలో ఆలోచనలే వస్తూ ఉంటాయి.

ఇంకేమి చెప్పను.. i look like an unsolved bug. 'దేవదెవుడా!! నీకు వీలుంటే ఈ bug ని fix చెయ్యు'. ఏంటి నీకు కూడా bug fixing అంటే చిరాకా??. ఇంకా నన్ను ఆ భగవంతుడు కూడా బాగు చెయ్యలేడు.

Labels:

ముందు మాట

హాయ్!!,
కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు। కానీ, జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది. అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను. మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు, మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది. అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ... ముచ్చట్లూ...

Labels: