Skip to main content

ఒంటరి ఆలాపన

నిస్పృహతో భూమిలో దాగిన మొలకని పులకింపజేయడానికి
ఆనందంగా వచ్చే తొలకరి చినుకు యొక్క హర్షాతిరేకాన్ని నేను.
తర్వాత నాకేమవుతుంది అన్న ఆలోచన, భయమూ నాకు లేవు.

నేను ఈ క్షణపు సౌందర్యాన్ని.

నేను గాలి యొక్క చిలిపితనాన్ని. భూమి కన్న ఓర్పును. కనులలో
కనపడని నీటి ఉద్రేకాన్ని కూడా. ఎప్పుడు బయటపడతానో
నాకే తెలియదు.

నేను కోయిల గొంతు శ్రావ్యాన్ని. తుమ్మెద రొదల అభద్రతని కూడా.

నేను చంద్రుని కోసం ముస్తాబయిన కొలనులోని కలువ భామని.

నేను పండువెన్నెల పంచిన విశ్వజనీన ప్రేమని. అమావాస్య
చీకటిలో ఒంటరి ఆలాపనని కూడా.

Comments

Bolloju Baba said…
వ్యక్తీకరణ అద్భుతంగా ఉంది.
ఒక సౌందర్య పరిమళ తరంగం
చెంపలను తాకి
గిలిగింతలు పెట్టినట్టుగా ఉంది.

బొల్లోజు బాబా
Purnima said…
మొడెస్టీ అన్న పదం లేకపోతే బాగుణ్ణు ఒక క్షణకాలం, మీ టపాలోని సౌదర్యమంతా నాదే అనేసుకుందును. :-) ఇది ఇప్పటికి ఎన్ని సార్లు చదవనో లెక్కలేదు. ఎప్పుడూ కమ్మెంట్ చేయలేదు, ఇదో ఇప్పుడు చెప్తున్నా.. "Loved it!"
@ బొల్లోజ బాబా గారు,
థాంక్సండీ. మీరు అందంగా చూసారు కనుకనే మీకు అందంగా కనపడింది.

@ పూర్ణిమ గారు,

నిజమైన సౌందర్యం ఒక్కరి సొంతం కాదు.. అందరిదీనూ. మీరు ఆ సౌందర్యం తో ఐడెంటిఫై చేసుకోగలిగితే అది మీదే. నా స్నేహితురాలు తన గురించి రాయమని అడిగినప్పుడు ప్రతిగా ఇది పుట్టింది. టెక్నికల్ గా సైకాలజీ దృక్కోణంలో రాద్దామని పెన్ను పట్టుకుంటే ఇలా వచ్చింది.

మీ కామెంటుకి మురిసిపోయాను. థాంక్యూ.
చాలా బాగుంది
@Phaneendra,
Thank you.