Friday, December 5, 2008

Inner Dimensions: The businessman speaks..

రాత్రి ఒంటిగంటన్నర. నిద్ర రావట్లేదు. చలికాలం కావడం చేత ట్రైన్ లో అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు. ఇంకొన్ని గంటల్లో తనని కలవబోతున్నాను. మనసులో ఏదో హుషారు ఈల. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఓ చిల్లర వ్యాపారి టీ కంటైనర్ ని పక్కన పెట్టుకొని బెంచి మీద కునుకు తీస్తున్నాడు. టీ తాగాలనిపించింది. ట్రైన్ దిగి వాడిని లేపి టీ అడిగాను. టీ ఇచ్చి ఎప్పటిలాగే నాలుగు రూపాయలు తీసుకున్నాడు. 'ఇంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని సెర్వ్ చేస్తున్నాడు. extra చార్జ్ చెయ్యొచ్చు కదా.' అనుకున్నాను. నేను స్వతహాగా business man ని కావడంతో ఇలాగే ఆలోచిస్తాను. అతను ఎక్కువ చార్జ్ చేసుంటే అతనిమీద గర్వపడేవాడిని. ఒక సిగరెట్ కూడా తీసుకున్నాను. నాకు సిగరెట్ అలవాటు కాదు. అప్పుడప్పుడూ తీసుకుంటాను. materialistic things కి గానీ, మానవ బంధాలకి గానీ బానిసవడం, నన్ను నేను కోల్పోవడం నాకు నచ్చవు. ప్రశాంతమైన ఈ అర్థరాత్రి పూట చలిగాలిలో ఛాయ్ తాగుతూ దమ్ము లాగుతుంటే బాగుంది. I fucking loved this moment. స్టేషన్లో దూరంగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బయటవాళ్లెవరికీ నేను సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నా ముఖంలో ఎటువంటి భావాలూ కనపడవు. ఇది నా పర్సనల్ ఆనందం. నా ఆనందానికి ఎంత value ఇస్తానంటే పంచుకునేవారికి కూడా అదెంత valuable అని గ్రహించగలిగి ఉండాలి. ట్రైన్ కూత పెట్టడంతో ఎక్కాను.

నా గమ్యం వచ్చింది. ట్రైన్ దిగాను. చుట్టూ ఉన్న జనాలు పలచనయ్యాక తను కనపడింది. ఆమె కళ్ళలో నేను రానేమో, కనపడనేమో అన్న ఆలోచనల తాలూక ఒత్తిడి ఏమాత్రమూ లేదు. తను నా భార్య కాదు. నా భార్యకి బిజినెస్ పని మీద ముంబై వెళుతున్నానని చెప్పి ఈమెను కలవడానికి వచ్చాను. మేమెప్పుడూ పలకరించుకోం. కలిసి రెండు నెలలవుతున్నా గతక్షణమే మాట్లాడుకొని కంటిన్యూ చేస్తున్నట్లుగా మాట్లాడుకుంటాం. నేను దగ్గరకి వచ్చాను. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. 'My desire is peaking.' అని కళ్ళలోకే చూస్తూ చెప్పాను. తను నవ్వింది. చిన్న pause. మళ్ళీ నవ్వింది. ఈసారి నవ్వుతో పాటు తన కళ్ళలో కోరిక కూడా. నా కళ్ళు హర్షాన్ని తెలిపాయి. నా గెస్ట్ హౌస్ కి వెళ్లి మా కోరిక తీర్చుకున్నాం.

సుమారుగా ప్రతి రెండు నెలలకొకసారి మేం కలుసుకుంటాం. ఓ రెండుమూడు రోజులు కలిసుంటాం. తను ఓ సోషల్ వర్కర్. ఒక NGO ని నడిపిస్తోంది. నేను వ్యాపారిని. నాకు సోషల్ వర్క్ మీద ఆసక్తి లేదు. తనకి కూడా బిజినెస్ చెయ్యాలన్నఇంటరెస్ట్ లేదు. మా మధ్య ఆర్ధిక లావాదేవీలేమీ లేవు. మా ఇద్దరికున్న common point ఒక్కటే. మా వృత్తులపట్ల మాకున్న భావాలు. వ్రత్తి అని చెబితే వేరుచేసినట్లవుతుందేమో. నా గురించి నేను ఊహించుకున్నప్పుడల్లా నా బిజినెస్సే కనపడుతుంది. నారూపం కనపడదు. బయటవారందరికీ నేను ఏ ఫీలింగ్సూ లేని ఒక business man ని. కానీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు - నేనూ, నా వృత్తి వేరుకామని. తను కూడా అంతే. social work కి అవరోధమవుతుందని పెళ్లి, కుటుంబాన్ని వద్దనుకుంది. ' ఎప్పుడూ ఎమోషనల్ కాని ఈమెకేం తెలుసు social work. ', 'ఈవిడొక చండశాశనురాలు.' .. ఇలా తెలియనివారు ఈమె గురించి చెబుతుంటారు. మేము తొందరగా emote కాము ఎందుకంటే emotions మాకు చాలా విలువైనవి. ఇలాంటి చెప్పుకోని భావాలే తనని, నన్నుదగ్గర చేసాయి. మేం కలిసున్నరోజులు తిరగడం, తినడం తప్పిస్తే ఇంక చేసేవి రెండే పనులు- మాట్లాడుకోవడం, సెక్స్. మేము sweet nothings మాట్లాడుకోము. ఫ్యామిలీ విషయాలు అసలే ఉండవు. కేవలం మా పనుల గురించి, మా గురించే మాట్లాడుకుంటాము. ఇక సెక్స్ విషయానికొస్తే రెండు నెలలకొకసారి కలిసిన ఫస్ట్ టైం violent గా ఉంటుంది. మా frustrations reflect అవుతాయనుకుంటా. చివర్లో విడిపోయేముందటి కలయిక మాత్రం ఒక స్పూర్తివంతమైన అనుభవం. soft గా.. మాట్లాడుకుంటూ.. సున్నితంగా intimacy ని అద్దుకుంటూ.. నిన్నటి గాయాల, రేపటి భయాల ఉనికి లేకుండా.. really ఒక charging experience అది. మాది ప్రేమనా, వ్యామోహమా.. అని ఒక పేరు ఇవ్వడానికి, define చెయ్యడానికి నేను ప్రయత్నించను. ఎందుకిలా జరిగింది.. తను పరిచయం కాకపొతే ఏంటి?.. లాంటి ప్రశ్నలకి సమాధానాల కోసం వెతకను. irrational feelings కి నేను logic apply చెయ్యను. ఆలోచించేదల్లా నాకు కరెక్టా.. కాదా..అని. ఇప్పటి డెసిషన్ కి ఫ్యూచర్ లో బాధ పడతానా.. లేదా అని. నా కొడుక్కి 18 ఏళ్ళు వచ్చేవరకూ తండ్రి అవసరమని భావించాను. అందుకే తను, నేను దగ్గరయ్యామన్నవిషయం అనుభవంలోకి వచ్చాక (అప్పుడు నా కొడుక్కి 14 సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల వరకూ మేము కలుసుకోలేదు. ఈ ప్రపంచానికి మా వ్యవహారం తెలిసినా మేమిద్దరం భయపడం, బాధపడం. నా భార్య నుండి విడిపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నో ఏళ్లుగా మేమిద్దరం కేవలం బాధ్యతలని మాత్రమే షేర్ చేసుకుంటున్నాం. నా విషయం ఎప్పటికయినా తెలియాల్సిందే. నేను చెప్పకపోతే తను కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. విషయం తెలిస్తే తను బాధపడుతుంది. నా ద్వారా కాకుండా వేరే విధంగా బయటపడితే ఇంకొంచం ఎక్కువ బాధపడుతుంది. ఈ ఇంకొంచం ఎక్కువ బాధపడడాన్ని, చెప్పకపోవడం వలన తనకి దొరికే కొద్ది రోజుల ప్రశాంతతని కంపేర్ చేస్తే రెండవదే ఎక్కువ తూగింది. అందుకే నేనుగా ఈ విషయం తనకి చెప్పలేదు. ఇది తప్పని, ఒప్పని అనుకోకపోవడం వలన నాకెటువంటి గిల్టీ ఫీలింగ్ కూడా లేదు.

రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి పక్క మీద నా భార్య ఇలా అంది- 'ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతీసారీ మీరు కొత్తగా, ఫ్రెష్ గా కనపడతారు. ఏదో తెలియని మార్దవం కనపడుతుంది.'. తనింతలా expressive గా మాట్లాడటాన్ని, లోతుగా విశ్లేషించడాన్నినేను చాలారోజుల తర్వాత గమనించాను. తనని చూస్తూ అప్రయత్నంగా నా ముఖంలో ఒక మందహాసం మెరిసి మాయమయ్యింది.

11 comments:

మోహన said...

instinctive, responsible and a sensible egoist.

Nice characterisation. Felt a bit similar to 'Howard Roark' of 'The fountain head'. But నాకు వీడు నచ్చలేదు. పీక దాకా కోపం కూడా ఉంది. కోపం కాదేమో.. అలక అనాలేమో కొంచం డౌట్.

ఇలాంటి కారెక్టర్స్ పగలబడి ఎప్పుడు నవ్వుతారో, అలా నవ్వితే ఎలా ఉంటారో చూడాలని నాకో ఆశ.

Could not avoid thought process after reading, but enjoyed the read.. Thanks.

మురారి said...

@ మోహన గారు,
ఒక intense feeling ని టపాకెక్కించాలనుకున్నాను. రాసాక 'People should either hate it or love it. కానీ ఒక passive ఫీలింగ్ రాకూడద'ని భావించాను.
The Fountain Head నాకు నచ్చిన బుక్స్ లో ఒకటి. దాని ప్రభావం నా మీద ఉంది. ఈ కధ లోని Protagonist కూడా తనకి బాగా నచ్చిన వారి దగ్గర మామూలుగానే ఫ్రీగా ఉంటాడు. పగలబడి నవ్వుతాడు కూడా.

Syed said...

Its actually a good one.Describing a person rather a character who is into his own world, whose emotions are rarely understood by others is a bit difficult work.

మురారి said...

@Syed,
మీకు నచ్చినందుకు సంతోషం. నా మనసుకి నచ్చిన పాత్రలలో ఈ టపా కధానాయకుడు ఒకడు. నేను పూర్తిగా అతని స్వభావాన్ని టపాలో ఆవిష్కరించగలిగానో లేదో తెలియదు కానీ నా బుర్రలో ఇతని గురించి చాలా అనుకున్నాను. difficulty సంగతి తెలియదు కానీ ఇష్టంగా రాసాను.

sarath said...

Meeru romanticve kakunda mari konni rakaala rachanalu cheyochuga?

మురారి said...

@ Sarath,
Any thought that excites me, I simply put it in words. Sticking to any genre is not a conscious effort/ choice. I guess my posts reflect the state of my mind.

To my surprise, I didnt see any romance in this particular post.

Raj said...

నాన్న మురారి...(ANR speaks)
మానవుడు సంఘ జీవి...తను తన మనసే ప్రపంచం కాదు...కానీ ఒక వ్యక్తి లోని other side of the coin బాగా చూపించావని పిస్తోంది.

మురారి said...

Thanks Raj.

కొత్తావకాయ said...

>>> నా ఆనందానికి ఎంత value ఇస్తానంటే పంచుకునేవారికి కూడా అదెంత valuable అని గ్రహించగలిగి ఉండాలి.

>>> ఆమె కళ్ళలో నేను రానేమో, కనపడనేమో అన్న ఆలోచనల తాలూక ఒత్తిడి ఏమాత్రమూ లేదు.

>>>గతక్షణమే మాట్లాడుకొని కంటిన్యూ చేస్తున్నట్లుగా ..

>>> ఎన్నో ఏళ్లుగా మేమిద్దరం కేవలం బాధ్యతలని మాత్రమే షేర్ చేసుకుంటున్నాం.(pratogonist,అతని భార్య)

నేను చాలా సార్లు చదివి కామెంట్ చెయ్యకుండా వెళ్ళిపోయి నాలో నేనే ఆలోచించుకున్న పోస్టు ఇది.
ఈ ఇద్దరు కలిసి బతికితే ఇదే ఉద్వేగాన్ని, ఇదే పర్సనాలిటీలను కొనసాగించగలరా? కేవలం ఒకరికి ఒకరు ప్రతి క్షణం అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే కలిసినప్పుడు సంతోషం గా ఉంటున్నారా?

14 ఏళ్ళ కొడుకు పట్ల భాద్యత అనే విషయం ఒక్కటే ఎందుకో నాకు నచ్చలేదు. బాధ్యతాయుతం గా ఉండకూడదని కాదు. తనలో మంచిని తను చూపించుకున్నట్టు ఉండి అతనిలో అంతవరకు చూసిన పార్శ్వాన్ని హీరోయిక్ గా మార్చేసింది ఆ వాక్యం.

మురారి said...

@కొత్తావకాయ,
ఒక దశని దాటాక మనకి మనం చాలా క్లియర్‌గా కనపడతాం. మనల్ని మనం అర్ధం చేసుకోవడానికి ప్రత్యేకించి శ్రమపడనవసరం లేదు. మనల్ని మనం తేలికగా అంగీకరించగలుగుతున్నప్పుడు సహజంగానే మనమీద మనకి ఎంతో గౌరవం వచ్చేస్తుంది. ఆ స్థితిలో ఇతరులు మనల్ని ఎంత వరకు అర్ధం చేసుకోగలరనుకుంటే వారి దగ్గర అంతే expose అవుతాం. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఒకరిదగ్గర మరొకరు పూర్తి స్వేచ్చగా ఉండగలిగితే అది ఒక అద్భుతమైన ఒడంబడికగా ఉండిపోతుంది. వాళ్లు ఎంత టైం కలిసి ఉంటున్నారన్నది వారి బంధాన్ని ప్రభావితం చేయదు.

కొత్తావకాయ said...

హ్మ్.. నిజమే!