Skip to main content

భావి సమాజమా!.. నన్ను క్షమించు.

చుట్టూ భవనాలు, గుడిసెలు, రోడ్లు, మోటారు చక్రాలు..
మనుషుల చేతులు, కాళ్ళు కదులుతున్నాయి.. ముఖాలు మాట్లాడుతున్నాయి..
భవనాలు, చేతులు-కాళ్ళు, చక్రాలు, ముఖాలు తమని నియంత్రిస్తున్న పరాయి పైశాచిక శక్తి యొక్క వికృత, విశృంఖల నాట్యాన్ని నగ్నంగా చూపిస్తున్నాయి.
తనని తాను కాల్చుకునే మూర్ఖావేశం, బలహీనమైనవాటిని ధ్వంసం చేసి సమర్థించుకునే కుటిల రాక్షసత్వం చుట్టూ కారుచిచ్చులా రాజుకుంటున్నాయి.
రాజకీయం వ్యక్తి స్వార్ధానికి పరాకాష్టగా మారి సంఘాన్ని బలత్కరిస్తోంది.
విలువలు నేర్పని, మనిషిని చేయలేని విద్య తన డొల్లతనాన్ని కఠోరంగా డప్పుకొడుతోంది.
భయం.. స్వార్ధం.. కుటుంబం.. వంటి బంధాల, భావాల పిరికితనంతో నిండిన మానసిక నపుంసకుడిని నేను.
నా రక్తం నిజానికి ఎర్రగానే లేదు.
మరిగే స్వభావం కోల్పోవడంతో రక్తమాంసాదులు కుళ్లు కంపుకొడుతున్నాయి.
భావి సమాజమా!.. నన్ను క్షమించు.

Comments

అవును ఎవరో వస్తారనీ ఏదో చేస్తారనీ ఏదో చేస్తారనీ ఎదురు చూడటమే పనైపోయింది మనకు.
Padmarpita said…
నన్ను క్షమించు అని తప్పుకుంటే ఈ సమాజంలో మార్పు ఎలా వస్తుందండి?:)
మోహన said…
This comment has been removed by the author.
మోహన said…
ఎంత ఆవేశంగా ఉన్నారు! ఎంత లోతుగా మునిగిపోయారూ!!
చాలా బాగా వ్యక్తపరిచారు.
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూసేవాళ్ళు -ఆశావాదులు
జనాల్లో సగం కంటే తక్కువ మంది ఉండేరకం...

మనమే ఏదో చెయ్యలనుకునే వాళ్ళు
-పోరాటయోదులు
ఇలాంటి వారిని వేళ్ళపై లెక్కించవచ్చు..

ఇక మూడో రకం...
పై రెండింట్లో కనీసం ఒక్కటి కూడా అనుకోనివాళ్ళు...అంటే ఏం జరిగినా పట్టనట్టుండే స్వార్ధపరులు...వీళ్ళే మహా ప్రమాదకారులు...ఎవరికి వారు నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటే వీళ్ళ శాతం సగం కంటే ఎక్కువ ఉంటుంది...కానీ వీళ్ళందరూ కూడా విచిత్రం తమని తాము రెండో రకం వ్యక్తులుగా పొరబాటుపడుతుంటారు.

కనీసం మీరు మొదటి రకం అయినా అయినందుకు అభినందనలు...
Anonymous said…
a bit difficult 2 understand. koncham artham ayinde