Skip to main content

Posts

Showing posts from March, 2010

Inner Dimensions: 'She' speaks..

మేఘంలా నేనెప్పుడూ కరిగిపోతానో నాకే తెలియదు. ప్రాతహ్ నిశీధిలో ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?.. వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే. దారిలో ఎవరో పాదాల కింద నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది. కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఖం కూడా కలగదు. రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది. నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి. నాకు సముద్రమంత ప్రేమ కావాలి.. చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను. కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే. వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను. విఫలమయ్యాక ఒంటరినయ్యాను. విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎ