Tuesday, December 14, 2010

బింబాధరాల సరిహద్దున కన్నీటిచుక్క..

This moment is ridiculously painful. I am gasping for you.

బాధని చూపించడానికి నా దగ్గర ఏ గుర్తూ లేదు- కళ్ళలో మాటిమాటికీ ముసురుకునే చెమ్మ తప్ప.

పరితపించడమన్నది కేవలం హృదయానికే చెందిన భావనలా లేదు.. శరీరంలోని ప్రతీ రేణువూ నిన్ను కోరుకునే విరహాగ్నిలో మండిపోవడానికే ప్రాణం పోసుకుంటున్నాయి. My very existence is nothing but longing you.

ఈ ఝాము భారంగా.. అనంతంగా గడుస్తోంది. మరుక్షణానికి ఇతర విషయాలతో కాస్త తేలికపడతానేమో!.. కానీ ఈ క్షణానికీ వేదన నిజమైనది.

ఇంత వేదనలోనూ కొన్ని జ్ఞాపకాలు నవ్వు తెప్పిస్తాయి.. నవ్వు ముగుస్తుందనగా నీ లేమి మరింత తీక్షణంగా గుండెని మెలిపెడుతుంది.. నవ్వు తేలకుండానే కళ్ళు జలజలా వర్షిస్తాయి.. ఆ తర్వాత వెక్కుతూ దుఃఖం.

ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ.

ఇప్పటివరకూ ప్రపంచాన్ని పట్టించుకోనందుకు అది నిన్ను వేరుచేసి ఇలా కసితీర్చుకుంటోంది. విధి ఇంత కాఠిన్యమని నేనూహించలేదు. ఆఖరి కోరికకి కూడా ఆస్కారమివ్వలేదు.

కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు ముప్పెరుగొంటాయి. నిన్ను పొందని జీవితాన్ని త్యజించాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నీకోసం తపించేదెలా?..

మన కొద్దికాలపు పరిచయాన్ని శ్వాసిస్తూ బ్రతికే నా మిగిలిన ముప్పావు జీవితానికి చుక్కాని నీ మూడక్షరాల పేరు- సాహితి.

* * * *

దూరంగా ట్రాఫిక్ ధ్వనుల మధ్య మధ్యాహ్నపు నిశ్శబ్దం నాలానే ఒంటరిగా తోచింది. ఈ క్షణాన ఎందుకో మేం విడిపోయినప్పటి కలయిక గుండెల్లో మెదిలింది. నిశ్శబ్దమా!.. నీతో పంచుకోనా..

మలిసంధ్య.. ఆకాశం నిశి భారంతో క్రిందకి కృంగుతూ విరిగిపోయేలా ఉంది. తను నా దగ్గరకి వస్తూ కనపడింది. ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఎండిపోయాయన్న విషయం తెలుస్తోంది. నేనింకా పరిస్థితిని అంగీకరించని స్థితిలో ఉన్నాను. కళ్ళు ఉబ్బిపోయి, ముఖం పీక్కుపోయినట్టుగా ఉన్నా తనలో ఏదో కొత్త కాంతి.. ఆకర్షితుడినయ్యాను. ఇలాంటి నేపధ్యంలో కూడా కలిగిన క్షణకాలపు భౌతిక ఆకర్షణ తన మనస్థితిని గ్రహించేసరికి ఆవిరయ్యింది.

తను ముఖం అటువైపుగా పెట్టి పొడిపొడిగా ముగింపు వాక్యాలని ముక్తాయించింది. మరణశాసనాన్ని వింటున్న ముద్దాయిలా నిలుచున్నాను. దూరంగా తీరం వద్ద అలల ఘోష అనంతమైన రోదనలా ఉంది.

'నాకోసమైనా నన్ను మరచిపోయి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తావా?..' అని అడిగి తల దించుకొంది. కన్నీటికి బరువెక్కువ.

'ఊహు!.. నేనుండను..' చివరికి నా గొంతు పెగిలింది.

'లేదు.. ఉండాలి..' అంటూ తను మళ్ళీ వాదనకి దిగింది. నేను మొండిగా ఉన్నాను. కాసేపటికి ఇక లాభం లేదని తను వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అడుగులేసింది. నేను వచ్చి తన భుజం పట్టుకొని ఆపాను. 'ఇటు నుండి ఇటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం..పద..' అని ఒక మొండి నిశ్చయానికి వచ్చి, తనని బలవంతంగా నా వైపుకి లాగుతూ వడిగా వేరొకవైపుకి తీసుకెళ్దామని ప్రయత్నించాను. 'చెయ్యి వదులు..' అన్నా పట్టించుకోలేదు. మూర్ఖావేశంతో లాగుతున్నా. తను ప్రతిఘటించింది. హిస్టీరిక్గా ఏడుస్తూ, నన్ను రక్కుతూ విడిపించుకోవాలని చూస్తోంది. నాలో దుఃఖం, కోపం ఒకేసారి ఎగిసాయి. స్పృహలో లేను. తన చేతిని వదిలి, ధాటిగా ఒక చెంపదెబ్బ కొట్టాను. అరుస్తున్నదల్లా ఆగింది. ఇంకా రొప్పుతోంది. ఏం చేసానో అర్ధమైన నా కళ్ళు వర్షిస్తున్నాయి. తను తలెత్తి నన్ను చూసింది. ఇద్దరం ఎదురుపడ్డాం. తను నన్ను చూస్తూ మెళ్లగా స్థిమితపడుతోంది. నేను కూడా నిస్తేజంగా తనని చూస్తున్నాను.

ఏమైందో.. తను దగ్గరగా వచ్చింది.. బలంగా నన్ను హత్తుకొని, ముఖమంతా ముద్దులు పెట్టింది. అప్పటివరకూ ఉబుకుదామని ప్రయత్నిస్తున్న బాధకి ఊతం దొరికింది. ఇద్దరం ఏడుస్తూ ఒకరినొకరు చుట్టేసుకున్నాము.

మా పెదవులు కలిసాయి.. గాఢంగా.. ఆవేశంగా.. ఆర్తిగా.. జీవితానికి మిగిలింది ఈ ఒక్క క్షణమే అన్నట్టు అధరాలు జంటగా హృదయాలని మేళవించి తడుముకుంటూ తపించాయి. ఇరుకనుల కన్నీరు బింబాధరాల సరిహద్దులని స్పృశించాయి.

ఇంకేమీ మాట్లాడుకోలేదు.. విడిపోయాము.

* * * *

తన మాటలు వినని, తన నవ్వులు కనని, తన ముద్దులు దొరకని రేపటిని పొడిచి, పొడిచి చంపాలనుకున్నాను. కానీ కాలమే మరుక్షణం నుంచీ నన్ను పొడిచి, పొడిచి చంపుతోంది.

నిశ్శబ్దం మాట్లాడలేదు. కానీ నన్ను మళ్లీ వెతుక్కునేలా చేసింది.. తన జ్ఞాపకాల్లో.

33 comments:

మనసు పలికే said...

మురారి గారు, చాలా చాలా బాగుంది.

మనసు పలికే said...

>>ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ.
Wonderful...

Anonymous said...

కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు ముప్పెరుగొంటాయి. నిన్ను పొందని జీవితాన్ని త్యజించాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నీకోసం తపించేదెలా?..

really superb

dayakar said...

congratulations man

dayakar said...

trying to evaluate ur mental condition :)

మురారి said...

@ మనసు పలికే, Anonymous,
థాంకులు.

@Dayakar,
ఈ టపాలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితం. :)

కెక్యూబ్ said...

మరల మీ ఇద్దరూ దగ్గరవ్వాలని ఆశిస్తూ...

బాగుంది సార్..

వేణూ శ్రీకాంత్ said...

గుండెని మెలి పెట్టే బాధకు మీరు అక్షరరూపం ఇచ్చినతీరు చాలా బాగుందండి.

dayakar said...

i mean raasey tappudu nee mental condition and emotions through the writer going on :))))

మురారి said...

@ కెక్యూబ్,
చూద్దామండి.. మంచి సన్నివేశం సంభవిస్తే కలిసిపోతారు..

@ వేణూ శ్రీకాంత్,
కొన్ని భావావేశాలని పదాల్లో పెట్టడం కష్టమనిపిస్తుంది.. మనకే సరిగ్గా అర్ధం కావు.. మనసు నుండి మాటల్లోకొచ్చేసరికి భౌతికపరిమితుల వల్ల చాలా అడుగంటిపోతుంది.

@ Dayakar,
హ్మ్!..

ఆ.సౌమ్య said...

మీరెప్పుడూ ఏది రాసినా ఇలా ఏడిపించేస్తారేమిటండీ? మీ టపా చదవగానే ఎప్పుడూఒక బాధ,ఒక ఆనందం, ఒక భావోద్వేగం లాంటివన్నీ ఒకేసారి ముసురుకుంటాయి.

చాలా చాలా బాగా రాసారు.

మురారి said...

@ ఆ.సౌమ్య,
ఏడిపించడమే నా ఉద్దేశ్యం అనుకునేరు!.. కొన్ని ఆలోచనలను మనసులోనే కట్టడి చెయ్యడం కష్టమైనప్పుడు ఇలా టపాల రూపాన్ని సంతరించుకుంటాయి.. అంతేగానీ ఇందులో ఎటువంటి దురుద్దేశ్యమూ లేదు అధ్యక్షా!..

టపా మీకు నచ్చినందుకు సంతోషం.

మురళి said...

'శరీరంలోని ప్రతి అణువూ..' అన్నది వాడుక, 'రేణువూ..' కొత్తగా అనిపించింది. 'జ్ఞాపకాలు' ఇది కాపీ పేస్ట్ చేయండి.. ఇక రాసిన విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదండీ.. రెండు సార్లు చదివి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయా.. ఇప్పుడు ఈ రెండు మాటలూ...

మురారి said...

@మురళి గారు,
mozilla add-on ని ఉపయోగించి నేను రాస్తున్న తెలుగులో 'జ్ఞా' ని ఎలా రాయాలో తెలియలేదు. తర్వాత google transliterate లో రాసి కాపీపేస్ట్ చేద్దామనుకున్నా గానీ మరచిపోయినట్టున్నాను. పబ్లిష్ చేసాకైనా చూసుకోవాల్సింది. సరిచేసినందుకు ధన్యవాదాలు.

సాహితి కధలో ఈసారెందుకో బాధని పెట్టాలనిపించింది. ఆ ఆలోచనతో పుట్టిన సన్నివేశమిది. స్పందనకి మరోసారి ధన్యవాదాలు.

చిన్ని said...

వేధనని చక్కగా ఆవిష్కరించారు .

మురారి said...

@ చిన్ని,
స్పందనకి ధన్యవాదాలు.

భావకుడన్ said...

అనుభవైక్యం కాని నాడు ఇంత చిక్కని భావుకత పండించటమూ, అది అనుభావించటమూ రెండూ కుదరవేమో.

స్క్రీం పైన్టింగ్ గుర్తుకు వచ్చింది మీ టపా చదువుతుంటే.

మురారి said...

@భావకుడన్,
రచయిత కనీసం ఊహలో నైనా అనుభవించకుండా రాయలేడు..

స్క్రీం పెయింటింగ్ ఏంటో తెలియదండీ.. వీలుంటే చెప్పగలరు.

భావకుడన్ said...

edward munch కానీ scream కాని గూగులించండి అదే వస్తుంది.

కెక్యూబ్ said...

మురారి గారు ఫేస్ బుక్ లో తెలుగు లిటరరీ సర్కిల్ పేరున ఒక గ్రూపు నడుస్తోంది. ఈ కన్నీటి చుక్కలను అక్కడ పరిచయం చేసా.. మీకు ఫేస్ బుక్ అకౌంటు వుంటే చేరమని ఆహ్వానం..

మురారి said...

@భావకుడన్,
మీరు చెప్పినప్పుడే గూగిలించా.. కానీ మరింత క్లారిటీ కోసం అడిగాను. థాంక్సండి.

@కెక్యూబ్,
ఫేస్‌బుక్‌ లో తెలుగు లిటరరీ సర్కిల్ గురించి శోధించా. కానీ దొరకలేదు. లింక్ తెలియజేయగలరు.

కెక్యూబ్ said...

telugupoetscircle@groups.facebook.com ఇదే మురారి గారు ఆ లింక్. మీకు facebook account వుంటే friends finder ద్వారా నా gmail account venneladaari@gmail.com ద్వారా login avvandi..

Anonymous said...

ee vedana anubhavika vedyam ayina vallaku mathrame ardhamayyadi adi naaku thelusu anduke nee bimbadharala kanneti chukaaloni uppadananni ruchi chusanu nestham naa edatho antha uppadaname prema theeyaga undani evarannaro gani.....love j

నిషిగంధ said...

పైన మురళీ గారు చెప్పినట్లు నేనూ ఇప్పటికి చాలాసార్లు చదివి మౌనంగా వెళ్ళిపోయా.. నేనూ చదివానని తెలియాలి కదా, అందుకే ఈసారికి కనబడక తప్పలేదు.. :-)

"నిన్ను పొందని జీవితాన్ని త్యజించాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నీకోసం తపించేదెలా?.."
ఈ ఒక్క లైన్ లోనే సముద్రమంత వియోగవేదన ఇమిడిపోయిందనిపించింది!!

మురారి said...

@కెక్యూబ్,Anonymous,
స్పందన కి ధన్యవాదాలు.

@నిషిగంధ,
మీరు చదివారని తెలియటం బావుంటుంది. థాంక్స్.

gayatri said...

మురారి గారు, చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగా రాసారు..
ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ.
ee words naku challa bagga nachendi...

మురారి said...

@gayatri గారు,
ఆ లైన్లు నాకు కూడా ఇష్టమైనవి. టపా మీకు నచ్చినందుకు సంతోషం.

Latha said...

dhukham dooramayi santhasham migalaalani asisthunna..
Hema

రఘు said...

అధ్బుతం

praveena said...

వేదనను అక్షరాలలో ఇంత బాగా బందించోచ్చని ఇక్కడే చూస్తున్నా.. చాలా బాగా రాసారు

మురారి said...

@Latha,
సంతోషం విలువ తెలియాలంటే దుఖం పక్కనే ఉండాలండి. నిజానికి ఇవి రెండూ వేరు కావేమో!.

@రఘు,
థాంకులు.

@Praveena,
మీకు నచ్చడం ఆనందం కలిగించింది. థాంక్స్.

gayatri said...

మురారి గారు, చాలా చాలా బాగుంది.

మురారి said...

@gayatri,

Thanks.