Skip to main content

Posts

సంపంగి ఒడి

2009 నవంబర్ నెల. ఆ రాత్రి ముసుగు కప్పుకున్న ఉన్మాదంలా ఉంది. కార్తీకపు కర్కశ చలికి బస్టాండ్‌లో మూలకి ఓ కుక్క ముడుచుకొని పడుకుంది. చివరి బస్సు వచ్చిన శబ్దానికి ఓమారు తల పైకెత్తి మళ్ళీ నిద్రలోకి జారుకుంది.  బస్సులోంచి ఆఖరిగా దిగిన విజయ్ ముఖంలో ఏదో తీవ్రమైన ఉద్వేగం ప్రతిఫలిస్తోంది. బస్సు దిగి.. ఇటు, అటు చూసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అతని భుజాల మీదున్న బ్యాగ్‌లో యాసిడ్ బాటిల్ ఉందన్న విషయం అతనికి మాటిమాటికీ గుర్తువస్తోంది. బస్టాండ్‌లోనే ఒక బెంచీ మీద కూర్చున్నాడు. రాత్రి 11 దాటుతుండడంతో ప్రపంచమంతా నిద్రలోకి జోగుతున్నా విజయ్‌ని మాత్రం ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 'తెల్లారగానే అనూష పెళ్ళి. పెళ్ళి జరుగుతుండగా అందరి మధ్యలో ఆమె ముఖం మీద యాసిడ్ పొయ్యాలి. ప్రతీకారం తీర్చుకోవాలి..’ ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. విజయ్‌ చెయ్యబోతున్న మొట్టమొదటి క్రైమ్ ఇదే. .  క్రైమ్ చెయ్యడమేంటి?.. 5 నెలల క్రితం వరకూ అలాంటి ఊహలు కూడా అతనకి వచ్చేవి కావు.  విజయ్ తనలోని సంఘర్షణ మొద్దుబారడానికి దగ్గరలోనున్న వైన్‌షాప్‌కి వెళ్లి రెండు బీర్లు తాగాడు. తిరిగి బస్టాండ్ బెంచీ మీద కూర్చున్న అతన

యమున

ఆమెకి బాల్యంలో కోపిష్టి ఐన తండ్రంటే భయం. ఏడేళ్ళకే పక్కింటి అన్నయ్య ఎవరూ లేనప్పుడు ఆబగా తడిమేస్తుంటే.. ఆ నిస్సహాయత.. ఆమెకి పరిస్థితులపై పోరాడే స్ఫూర్తిని చంపేసింది. 17 ఏళ్లకి ఇంటిలో దొరకని ప్రేమని, ప్రేమపై అందమైన భాష్యాలు చెప్పే కాలేజి లెక్చరర్‌లో వెతుక్కుంది. ఆమె ఇచ్చిన తొలిముద్దుని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసేసరికి హతాశురాలైంది. ఆమె ఊహించుకున్న అందమైన ప్రపంచం ముక్కలైపోయింది. చనిపోదామనుకున్నా చావుకన్నా భయంకరమైన మానసికవేదనే తనకి సరైన శిక్ష అనుకుంది. అసలు తన జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యమూ ఆమెలో లేదు.. అది ఆత్మహత్యైనా సరే. 21 ఏళ్లకి ఇంట్లో వాళ్లు పెళ్ళిచేసేసారు. అప్పట్నించి రాత్రైతే నరకం. మనసుని తాకని భర్త తనువుని తాకుతుంటే ఏ స్పందనా కలిగేది కాదు. విసిగిపోయిన భర్త ఒకరోజు తన లవర్‌ని తన బెడ్‌రూమ్‌కి తెప్పించుకొని 'ఈమెని చూసి నేర్చుకో.. మగాడ్ని ఎలా సుఖపెట్టాలో' అంటూ రెచ్చిపోయాడు. 'వీడియో తీసుకొని మరీ చూసి తెలుసుకో' అన్నాడు. ఆమె వీడియో తీసింది. తరువాతిరోజు నుంచీ ప్రతీ రాత్రి ఒకటే పోరు - 'ఆ వీడియోలోని అమ్మాయిలా స్పంది

ప్రపోజల్

కావ్య ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టింది. సగటు టీనేజ్ ఊహలు, ఐడెంటిటీ క్రైసిస్ ఆమెకీ ఉన్నాయి. కానీ తనని అబ్బాయిలు చూడడం లేదని ఆమెకి లోలోపల చాలా బాధగా ఉండేది. చూడడం అంటే అందమైన అమ్మాయి కనపడగానే అబ్బాయిలు ఒకరకమైన మైమరుపుతో అలా చూస్తుండిపోతారే.. అలాంటి చూపులు తనకి కావాలి. "తన వక్షోజాలు చిన్నవి.. అందుకే అబ్బాయిలు తనని చూడడం లేదు.." అన్న ఫీలింగ్ ఆమెలో గాఢంగా నాటుకుపోయింది. ఎవరో అబ్బాయి "ఫ్లాట్ స్క్రీన్" అని తన గురించి మాట్లాడుకోవడం ఆమెకి గట్టిగా తగిలింది. అప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ ఇదే ఆలోచన. అద్దంలో తనని తాను చూసుకుంటుంటే కోపం. టైట్ డ్రెస్ వేసుకుంటే తన లోపం తెలిసిపోతుందని.. లూజ్ డ్రెస్ వేసుకుంటే ముసలమ్మ అంటారని.. ఇలా రోజూ డ్రెస్ వేసుకోవడమన్నది కావ్యకి ఒక సమస్య. సెల్ఫీ దిగడమొక సమస్య. ఫ్రెండ్స్‌తో బీచ్‌కి వెళ్లాలంటే సమస్య. అప్పటి వరకూ సరదాగా ఉండే తను సడెన్‌గా ఎందుకు మూడీగా ఐపోతుందో తనకే తెలియదు. కావ్య పేరెంట్స్‌కి ఇవేమీ పట్టవు. వాళ్లకి కావల్సిందల్లా ఆమె వీక్లీ టెస్టుల్లో తెచ్చుకుంటున్న ర్యాంకులే. ఇన్ఫిరియారిటీ, పేరెంటల్ ప్రెజర్‌తో సతమతమవుతున్న కావ్