Skip to main content

Posts

Showing posts from 2007

కనురెప్పల కావ్యం

నేను నీవైపే చూస్తున్నాను. నువ్వు కనురెప్పలు సన్నగా వాల్చి, ఆ పైన మెల్లగా వాటిని ఎత్తి నన్ను చూశావు. ప్రియతమా!, అది నాకొక కావ్యమయ్యింది.

సాహితి - తొలిపరిచయము

ఈ మధ్యన నా బ్లాగు నేనే సాంతం చదువుకున్నాను. ఎందుకో అంతగా నచ్చలేదు. పెద్ద స్కూలు బ్యాగు మోసుకొని, ఇసకలొ ఆడుకొని, చింపిరి జుట్టు, చీముడి ముక్కుతో స్కూలు నుంచి వచ్చిన పాపలా అనిపించింది. నా పాపకి నలుగు పెట్టి, కుంకుడికాయ రసం తో తలంటు పోసి, పట్టు లంగాజాకెట్టు వేసి ముస్తాబు చెయ్యాలి అనిపించింది. ఆ ప్రయత్నమే - ఈ 'సాహితి' సృష్టి. .... ఆ రోజు కార్తీక ఏకాదశి. Engg. course లో ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నిన్ననే ఇంటికి వచ్చాను. అమ్మ పొద్దున్న 5 గం.ల కే గుడికి వెళ్ళడానికి నిద్ర లేపేసింది. బయట చలి, లావుపాటి కంబలి లో కమ్మని వెచ్చదనం, పక్కన పడుకున్న నాన్న మీద చెయ్యి వేసుకుంటే నాన్న బొజ్జ రిథమిక్ గా శ్వాసని అనుసరించి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ఇలాంటి ambience ని వదిలిలేవడానికి అస్సలు మనసు రాలేదు. 'ఇంకొక 5 నిమిషాలు అమ్మా!' అంటూ మళ్లీ ముసుగుతన్నాను. కాసేపటికి మా చెల్లి మెల్లగా దుప్పటి ముఖం మీద నుంచి తీసి చల్లని తడి చెయ్యి నా ముఖం మీద పెట్టింది. నేను దిగ్గున లేచాను. తాను పరిగెత్తిన్ది. ఇంక తప్పదన్నట్లు లేచి టూత్ బ్రష్ అందుకున్నాను. చలిలో వేన్నీళ్ళ స్నానం భలే ఉంది. ... అమ్మ, నేన

నా ప్రపంచం

నా ప్రపంచం వసుధైక కుటుంబం. ఇందులో ప్రకృతి, మనిషి కలసిమెలసి పెరుగుతారు. ప్రతీ ఒక్కరూ తమ individual brilliance తో వెలుగుతారు. ప్రతీ కుటుంబం లో కనీసం రెండు చెట్లు సభ్యులుగా ఉంటాయి. Apartments ఉండవు. పల్లె, పట్నం అని differentiate చెయ్యలేము. అన్నీ సౌకర్యంగా, పచ్చగా ఉంటాయి. ఇక్కడ 'conditioned' relationships ఉండవు. Relationships grow naturally without any conditioning by the society. They enjoy full freedom. చట్టం ప్రకారం, 'పేరెంట్స్' అన్న సంబంధం ఉంటుంది. నిర్ణీత వయసు దాటిన యువతీ, యువకులు మాత్రమే పిల్లల్ని కనగలరు. ఒకసారి పిల్లల్ని కన్నాక, పిల్లలకి 15 ఏళ్లు వచ్చేవరకు విధిగా parenting చెయ్యాలి. ఇంక చదువు విషయానికి వస్తే, Education essentially teaches how to lead a happy life. In my world, Education is not seen as a means of employement. It first teaches values (like Truth, Individuality, Dignity of labour, equality) and then upon it knowledge. It helps free the mind to be its creative, sensitive and entrepreneurial best. ధనిక, పేద, జాతి, కుల, మత,వర్గ విభేధాలు పిల్లల మనసుల్లోకి

నేనూ, నా frustration, మా మురిపాలు...

ఈ రోజు ప్రశాంతంగా ఉందామని office కి సెలవు పెట్టాను. కానీ ఎక్కడ ప్రశాంతత? 'అందరూ ఏదో ఉపయోగపడే పని చేసేస్తున్నారు. నేనే ఖాళీగా ఉండిపోయాను.' అన్న పురుగు లాంటి ఫీలింగ్ రెగ్యులర్ గా నన్ను interrupt చేస్తూ ఉంది. పోనీ ఆఫీషు కి వెళ్తే బాగుంటామా అంటే అదీ లేదు. ఆఫీషు లోకి అడుగు పెడుతూనే keyboard చప్పుళ్లు, బిజినెస్ మాటలూ స్వాగతిస్తాయి. మనిషి చప్పుళ్లు ఉండవు. ఎవ్వరూ గట్టిగా నవ్వరు కూడానూ. అసలు ఆఫీషే ఒక పెద్ద computer లా అనిపిస్తుంది. అందులో bugs లేని program ఒకటి రొటీన్ గా run అవుతున్నట్లు గా ఉంది. ఆ ప్రదేశం కి వచ్చిన ఒక కుక్కని నేను. మనిషి వాసన కోసము వెదుకుతున్నాను. ఎక్కడా రాదాయె. ఇంక కూర్చొని పని మొదలుపెడుతూనే, నా లోని social psychologist లేస్తాడు. 'అసలు ఈ technology జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పు?' అంటూ క్లాస్ మొదలుపెడతాడు. ఇంక 'apartment culture, మనిషి మరీ narrow అయిపోవడమూ, ఉమ్మడి కుటుంబాలు లేకపోయే కనీసం పిల్లలకి నానమ్మలూ, తాతయ్యాలూ కరువు అవ్వడం, tv లు వచ్చి మనకీ పక్కింటికీ మధ్య దూరాలు పెంచడము, pollution, ... ' ఇలా పక్క రూమ్ లో మేకులు కొడుతున్న కార్పంటర్ లా నా మె
భావుకతా !... నా అభౌతిక ప్రపంచం లోకి నువ్వు అనుకోని అతిధివి. నీ స్పర్శ తో భావస్పందన లేని నా మనసు శిల సరససామ్రాజ్ని మోహిని గా మారింది. ఇప్పుడు తనకి ఎంతటి సున్నితత్వము, ఎన్ని కేరింతలు, ఏమి లావణ్యము!... నీ కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను. తను నవ్వింది. నువ్వు నా హృదయతంత్రి ని మీటావు.నా గుండె రాగాలు పలికింది. స్నేహం విత్తు మొక్క అయ్యింది. ఆ మొక్కకి 'ప్రేమ' అనే భావం మొగ్గ తొడిగింది. తన స్పర్శ కి నువ్వు అర్థాలు చెప్పావు. పెదవుల ఆట గురించి అడిగితే 'తనకు నువ్వంటే పిచ్చి ఇష్టం' అన్నావు. కౌగిలి దిగ్బంధనాన్ని 'నువ్వు లేకుండా నేనుండలేను' అని తర్జుమా చెప్పావు. ప్రేమ నా హృదయగిరిని దట్టమైన మేఘంలా కమ్మేసింది. ఆ అనుభూతి వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను. కొన్నాళ్ళకి కాలం నా వెర్రితనాన్ని ఆవిష్కరించింది. 'Be spontaneous yaar' అంటూ తను నన్ను విడిచిపోయింది. నా పల్లెటూరి ప్రేమని తన పట్నం ప్రేమ ఎగతాళి చేసిపోయింది. మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను మోసం చేశావు. భయంకరంగా దెబ్బ తీశావు. కక్షతో నిన్ను నా మనసు నుంచి వెలివేద్డామనుకున్నాను. కానీ నువ్వు దుఖంలో కూడా దాగివున్న అందాన్ని చూపించావు. నేన
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ call చేశాడు. వేరే company కి jump కొట్టాడు అట. Package చాలా బాగుంది. ఆది వినేసరికి, మనస్సు ఒక్కసారి jealousy, inferiority లాంటి వాటితో నిండిపోయింది. నేను సాధారణం గా డబ్బు కి అంత ప్రాధాన్యం ఇవ్వను. కానీ అప్పుడప్పుడు society conditioning నా మీద పని చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేశాను. తలుపు దగ్గరికి వస్తూనే, "శీను మామ!!" అంటూ పిల్లలు నన్ను చుట్టుముట్టేసారు. మా ఇంటికి అక్కలూ, వారి పిల్లలూ వచ్చారు. పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళి, నచ్చినవి కొనిపెట్టి, మేడ మీదకు తీసుకు వెళ్ళి, వాళ్ళని ఆడిపించటం మొదలుపెట్టాను. మెల్లగా నేనూ వాళ్ళతో కలిసిపోయాను... చిన్న పిల్లాడినైపోయి... ఈ తొక్కలో ఇగోలన్నీ వదిలేసి.. అలా చాలా సేపు ఆడుకొని, అలసిపోయాము. అప్పుడు నాకు నేను చాలా తేలికగా, స్వచ్ఛంగా, స్నానం చేసి మురికిని వదిలించుకొని తాజాగా ఉన్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా నా ఫ్రెండు, వాడి package గుర్తుకు వచ్చాయి. మనసు దానిని ఏదో సామాన్య వార్తలా చదివి పక్కన పడేసింది. నేను నిండుగా నవ్వుకున్నాను. ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ ఒత్తిడి తో గుండు చేయించుకు

నా టింగ్ టింగ్స్

ఈ టింగ్-టింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.. టింగ్-టింగ్ అంటే 'గుండెల్లో బెల్ మోగించిన అమ్మాయి' అన్న మాట. నా first టింగ్ టింగ్ పేరు - 'మీన'. నేను అప్పుడు 5th క్లాస్. నేను, ఆమె కలిసి ఆడుకొనేవాళ్ళము. ఒక రోజు స్కూల్ ముందు ఇసక మీదెక్కి ఆడుకుంటున్నాము. sudden గా తను తూలబోతూ ఉంటే, నేను పట్టుకొని, నేను కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుకుంటూ పడిపోయాము. ఆ వయసు లోనే నాకు ఏదో సినిమా లో హీరొ, హీరొయిన్లు ఇలా slow motion లో పడటం గుర్తుకు వచ్చింది. ఇంక అంతే! మోగింది బెల్. అప్పటి నుంచి తనని ఒక హీరొయిన్ లా నేనొక హీరొ లా ఫీల్ అవుతూ చూసేవాడిని. 6th class లో మా ఇద్దరి స్కూల్స్ మారిపోయాయి. మేము అలా విడిపోయాము. ఆ అమ్మాయి పేరు 'మంజుల'. నేను 10th class. కొత్తగా tution లో join అయ్యాను. ఆ రోజు first day. పొద్దున్నే త్వరగా వచ్చేశాను. చలి కాలం. ఇంక ఎవరూ రాలేదు. అంతలో చిన్నగా కాళ్ళ పట్టీ ల తాలూక మువ్వల చప్పుడు. చాలా rhythemic గా దగ్గరకు వస్తున్నాయి. అందమైన పాదాలు.. సన్నని నడుమును పట్టెసుకున్న మిడ్దీ (మెరూన్ color top, black color skirt) .. తల స్నానం చేసి అలానే వదిలేసిన కురులు..

పట్నం కాచిన వెన్నెల

వెన్నెల నవ్వింది - పట్నం లో తనది అడవి కాచిన వెన్నెల అని. వర్షం నవ్వింది - తనని చూసి విసుక్కొనే జనాలని చూసి. పసివాడు నవ్వాడు - train కి టాటా చెప్తుంటే దానికి రెస్పాన్స్ ఇవ్వ లేని మన హుందాతనాన్ని చూసి. లోపలి ఆనందం నవ్వింది - తనని ఎక్కడో బయట వెతుకుతున్నందుకు. మానవత్వం నవ్వింది - పక్కవాడి గురించి తెలీదు గానీ, celebrities ని బాగా పట్టించుకొంటున్నందుకు. పట్నం అనే వేశ్య నవ్వింది - తనది నిజమైన ప్రేమ అనుకొని మోసపోయే మనిషిని చూసి.
నా ప్రేమ ని కుంకుమ చేసి, గుండె భరిణ లో పోసి, నీకు బహుమతి గా ఇచ్చాను. ప్రియతమా !.. నన్ను సింగారించుకోవూ...

కిష్కింధకాండ

కాలేజీ రోజులు... యవ్వనమనే కోతి మన లోకి ప్రవేశించిన రోజులు. స్నేహ మాధుర్యాన్ని తెలిపిన రోజులు. అతివ ఆకర్షణ అనే మధువు రుచి మరిగిన రోజులు. నూనూగు మీసాలు, లేలేత కాంక్షలు, friends గ్యాంగులూ, byke సవారీలు, ప్రేమ వ్యవహారాలు.. అబ్బో!! ఆ రోజులే వేరు లెండి. మాది పల్లెటూర్లో ఒక engg college. మొత్తం ఆరుగురం roommates. ఆరుగురవి విభిన్న మనస్తత్వాలు. అయినా స్నేహం అనే పూమాల లో అందం గా ఒదిగిపోయాము. పల్లెటూరు కనుక చాలా సార్లు సాయంత్రం అయితే power పోయేది. happy గా మేడ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకొనే వాళ్ళము. అక్కడ hot hot topics- అమ్మాయిలే మరి. రాత్రి 12 గం..ల కి birth day parties అప్పుడే అలవడ్డాయి. cake cut చేసి పూసు కొన్నాక ఒకళ్ళ మీద ఒకరు నీరు పోసుకొని స్నానాలు చెయ్యటం భలే గా ఉండేది. serious Indoor cricket matchలు, ప్రపంచం లో అతి ముఖ్యమైన పని ఇదే అన్నట్లుగా 'పేకాటలు' అర్థరాత్రి దాటాక కూడా సాగేవి. పరీక్షలొస్తే, చదివింది తక్కువ... హడావుడి ఎక్కువ. ప్రతీ exam అయ్యాక అందరం వచ్చి, అరుగు మీద కూర్చొని, 'నడిపించు నా నావ నడి సంద్రమున దేవ!', ' పాపులము మేము.. ఓ తండ్రీ!' ... ఇలా ఏసుక్రీస్తు

వేకువ రాగం

అంతా చీకటి. చుట్టూ ఏమీ లేదు సముద్ర ఘోష తప్ప. చంద్రుడు లేని ఆకాశం నల్లని చీర కట్టుకొని, పెద్దగా ఉన్న చీర కొంగుని అలాగే గాలికి వదిలేసి సముద్రపు ఒడ్డున తన ప్రియుని కోసం ఎదురు చూస్తున్న పడుచు లా ఉంది. అక్కడక్కడ మెరుస్తున్న నక్షత్రాలు ఆ చీర కొంగుకు అద్దిన చమ్కీల్లా ఉన్నాయి. తన ప్రియుడు రాబోతున్నాడని ఏ మేఘమో కబురంపినట్లు గా ఉంది దూరం గా తూర్పున ఒక చిన్న వెలుగురేఖ ఆశ లా విచ్చుకొంటోంది. వస్తూనే నన్ను ఎలా చుట్టెస్తాడా అన్న ఊహ వచ్చి బుగ్గలు ఎర్రబడినట్లు ఉన్నాయి. వెలుగురేఖ ఎర్ర నారింజ రంగు లోకి మారింది. ఆ ఊహల్లో ఉంటూండగానే చూసింది - దూరంగా అశ్వారూఢూడై వస్తున్నాడు సఖుడు. అరె! ఆకాశానికి ఎంత హర్షాతిరేకం!!. ఆనందంతో ఎన్ని రంగులు మార్చుకొంటోందో... ఎన్ని హోయలు వొలకబొస్తోందో... అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఏదో ఆహ్లాదమైన రాగాన్ని అందుకున్నట్లు గా ఉంది. నక్షత్రాలు బారులు తీరిన వయొలిన్ విద్వాంసుల్లా ప్రకృతి ఆలాపనకి వాయులీన సహకారం అందిస్తున్నారు. పిల్ళగాలి గాడు ఆ tunes కి అనుగుణంగా ఊగుతున్నాడు. ఆ రాగం.. ఒక క్రొత్త స్వాగతం లా... ఒక నూతన ఒరవడి లా... నిన్నటి బాధల నుంచి నేటి ఆనందాలకి నడిపించే దృక్పధం లా ఉంది.

చిన్న చిన్న ఆనందాలు

స్నేహితుని ఉత్తరం పూర్తిగా 'ఇట్లు నీ స్నేహితుడు, xxxx.' అంత వరకూ చదివాక కూడా మనకు తెలియకుండానే మన కళ్ళు క్రిందన ఇంకా ఏమన్నా రాశాడేమో అని గుడ్డిగా వెతుకుతాయి. ఎంత వెచ్చని గుడ్డి అభిమానం!!. ఆ ఉత్తరం ని చదివాక దానిని ఎంత ఆప్యాయం గా పట్టుకుంటామని!!. ప్రియురాలి తో కానీ బాగా నచ్చిన వాళ్ళ తో కానీ phone లో మాట్లాడుతున్నప్పుడు, 'bye' చెప్పేసాక కూడా ఒక రెండు క్షణాల వరకు disconnect చెయ్యము. మాటల్లో చెప్పలేని భావం ఏదో ఇంకా మిగిలిపోయి, ఆది చెప్పలేక, call cut చెయ్యలేక హృదయం ఎంత ఆరాటపడుతుందని!!. కాసేపు ఆగి, వెనక్కి వెళ్ళి, ఆ రెండు క్షణాలని తరచి చూస్తే... మనసు ముగ్ధ మూగది అయ్యి, తేటగా అమాయకత్వం తో ఎంత ముద్దు గా కనపడుతుందో!!. ఇలా చిన్న చిన్న feelings ఎంత అద్భుతమైనవో. ఈ చిన్న చిన్న ఆనందాలే జీవితమేమో.

ముందు మాట

హాయ్!!, కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు। కానీ, జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది. అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను. మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు, మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది. అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ... ముచ్చట్లూ...