Skip to main content

Posts

Showing posts from December, 2008

మిస్సింగ్ యు..

నేను నిద్రపోయాక రాత్రంతా మనసు నీ దగ్గరే తచ్చాడుతుందేమో . పొద్దున లేవగానే ఊహని స్పృశించే మొదటి రాగం నీ తలపే. నా సబ్కాన్షస్ పెట్టె నిండుగా నీ సుగంధంతో తొణుకుతుంటే అహం బిత్తరపోయి అంతలోనే సర్దుకుంటుంది. గంభీరమయిపోతాను. కొన్నిసార్లు నా గంభీరతని చూసి నేనే ఫక్కున నవ్వేసుకుంటాను. బాత్రూమ్ లోకి బద్ధకంగా దూరాక, బకెట్ లోని నీటి మీద వేలితో అప్రయత్నంగా నీపేరు రాస్తాను. అది చెరిగిపోతుంది. కానీ అందులో నీ పేరుందని నాకు తెలుసు. ఓసారి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక చిన్నమ్మాయి నన్ను వింతగా చూసినప్పుడు అర్థమయ్యింది- నువ్వు గుర్తొచ్చి నా ముఖం ముద్దుగా నవ్వుతోందని. వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని పట్టుకొని ఫాస్ట్ గా ఓ ముద్దిచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తా. రాత్రి మేడ మీద తిరుగుతున్నప్పుడు నువ్వెప్పుడూ పాడే పాట గుర్తొస్తుంది. నీకస్సలు పాటలు పాడటం రాదు. ఆ పాటనైతే దారుణంగా ఖూనీ చేస్తావు. అప్పుడు వెక్కిరించాను గానీ ఇప్పుడు నీ పాట నాకెంతిష్టమో!!. నువ్వు పాడినట్లే పాడుతూ మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాను. నవ్వుకుంటున్నా సరే ఓ నీటితెర నా కళ్ళని అడ్డుగా కప్పేస్తుంది.

Inner Dimensions: The businessman speaks..

రాత్రి ఒంటిగంటన్నర. నిద్ర రావట్లేదు. చలికాలం కావడం చేత ట్రైన్ లో అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు. ఇంకొన్ని గంటల్లో తనని కలవబోతున్నాను. మనసులో ఏదో హుషారు ఈల. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఓ చిల్లర వ్యాపారి టీ కంటైనర్ ని పక్కన పెట్టుకొని బెంచి మీద కునుకు తీస్తున్నాడు. టీ తాగాలనిపించింది. ట్రైన్ దిగి వాడిని లేపి టీ అడిగాను. టీ ఇచ్చి ఎప్పటిలాగే నాలుగు రూపాయలు తీసుకున్నాడు. 'ఇంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని సెర్వ్ చేస్తున్నాడు. extra చార్జ్ చెయ్యొచ్చు కదా.' అనుకున్నాను. నేను స్వతహాగా business man ని కావడంతో ఇలాగే ఆలోచిస్తాను. అతను ఎక్కువ చార్జ్ చేసుంటే అతనిమీద గర్వపడేవాడిని. ఒక సిగరెట్ కూడా తీసుకున్నాను. నాకు సిగరెట్ అలవాటు కాదు. అప్పుడప్పుడూ తీసుకుంటాను. materialistic things కి గానీ, మానవ బంధాలకి గానీ బానిసవడం, నన్ను నేను కోల్పోవడం నాకు నచ్చవు. ప్రశాంతమైన ఈ అర్థరాత్రి పూట చలిగాలిలో ఛాయ్ తాగుతూ దమ్ము లాగుతుంటే బాగుంది. I fucking loved this moment. స్టేషన్లో దూరంగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బయటవాళ్లెవరికీ నేను సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నా ముఖంలో ఎటువంటి భావాలూ