Skip to main content

Posts

Showing posts from February, 2009

మార్నింగ్ రాగ...

జనవరి మాసపు ఓ ఉదయాన డిజికామ్ పట్టుకొని వీధుల మీద పడ్డాను కాసేపు నడవగానే 'మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా..' పాట మనసులో మెదిలి పెదవులపైకి వచ్చింది. కుక్కపిల్లలు ఒకదానిమీదొకటి సుఖంగా పడుకున్నాయి . ఓ రోజా పువ్వు వికసించింది. 'చలికాలం పొద్దున్న ఎండకాసుకుంటే భలే ఉంటుంది కదూ!.' ఒకాయన టీ తాగుతూ సమ్మగా పేపర్ చదువుకుంటున్నాడు. పిల్లలు కూడా ఎంచక్కా ముగ్గులేస్తున్నారు. వీధులు శుభ్రం చేసేవాళ్ళు ఏ గుర్తింపుకీ నోచుకో కపోయినా స్థితప్రజ్ఞుల్లా తమ పని తాము చేసుకుపోతున్నారు. బసవన్న 'టింగురంగా!..' అంటూ వీధుల్లో తిరుగుతున్నాడు. పూలమ్మి అప్పుడే షాపుని తెరిచింది. 'ఇడ్లీ. ఇడ్లీ..' అన్నా, చెల్లెల్ల ఇసుకలాట. నేను తోడు రాకపోతే తాత పేపర్ కొనుక్కోలేడు. పాపం!. పోనీలే.. ఆని వస్తా. "School time .. bachchon ka school time." చదువుల బరువు అమ్మకూ తప్పదు. అమ్మ బ్యాగ్ మోస్తుంటే హీరో ఎంత దర్జాగా నడుస్తున్నాడో.. అన్నతో ఎంచక్కా సైకిల్ మీద .. ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!.. నేనిక్కడ దాక్కుంటున్నా.. అసైన్‌మెంట్ చెయ్యలేదు.. ఇంట్లో ఏం చెప్పి స్కూల్ ఎగ