Saturday, April 23, 2011

ఔననా!.. కాదనా!..

పూలమత్తుని ఘ్రాణించి, ఉన్మత్తలైన మరీచికలతో మోహనంగా కృష్ణవర్ణాన్ని కౌగిలించుకుంటోన్న సంధ్యాకాంత..

నిన్ను కలుస్తున్నానని సాయంత్రం సింగారించుకుందా?.. లేదా నేనే అందంగా చూస్తున్నానా?..

మనసు తీగ నీ తలపు కొమ్మని చుట్టుకొని మురిసి కంటున్న సన్నజాజి ఊహలు..

నువ్వీ క్షణం ఏం చేస్తుంటావో.. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంతలా రంజింపజేస్తుంటావో.. నీ పాదాల్ని భూమి ఎంత మెత్తగా హత్తుకుంటుందో.. గాలి నీ కురులని ఎంత సుతారంగా సవరిస్తుందో.. నీ చిరుచెమటని తడిమి తనలోకి లాక్కుంటున్న చుడీదార్‌ది ఎంత అదృష్టమో!..

ఒకరి కోసం ఆలోచించడం ఇంతటి కమ్మని మైకమా!.. ఇప్పుడే అనుభవమౌతోంది.

నీకోసం ఏదేదో చేసెయ్యాలన్న ఆరాటం.. కానీ ఏం చేసినా నీ సాహచర్యం నాకిచ్చే ఆనందం ముందు అదెంత?..

మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ముఖం మీది కురులను చేతివేళ్లతో వెనక్కి తోసుకుంటూ నన్ను చూస్తావు కదా.. గుండె గుప్పున పరవశంలో మునిగిపోతుంది.

యధాలాపంగా తగిలే వేలికొనలు యదని ఝుమ్మనిపిస్తాయి.. గుండె త్వరణం పెరిగేసరికి మెదడు వెనక్కి రమ్మని ఆదేశాలిచ్చినా అర్ధం చేసుకునే స్థితిలో అవి ఉంటేనా?..

గిటారు మీటినట్లు అంత సన్నగా ఎలా నవ్వుతావో?.. అప్పుడప్పుడు నా పట్ల నీ కళ్ళలో వెలిగే ఆర్తిని ఎలా దాచి పెట్టుకోను?..

నా ఇష్టాన్ని నీకు చెప్పెయ్యాలనే ఉంది.

నువ్వు కాదంటే ఈ అందమైన కల చెదిరిపోతుందే అని భయం.. అవునంటే ఆ తర్వాత నువ్వెక్కడ నాకు 'మామూలు' అయిపోతావేమోనన్న అనుమానం.

చెప్పకుండా.. ఇలా.. బానేవుంది. కానీ ఉండబట్టట్లేదు.

17 comments:

వేణూ శ్రీకాంత్ said...

Awesome మురారిగారు.. చాలా బాగుంది..

మురారి said...

@ వేణూ శ్రీకాంత్,

:)

మనసు పలికే said...

>>నువ్వు కాదంటే ఈ అందమైన కల చెదిరిపోతుందే అని భయం.. అవునంటే ఆ తర్వాత నువ్వెక్కడ నాకు 'మామూలు' అయిపోతావేమోనన్న అనుమానం.

అవును కాదన్న మాటల మధ్య ఊగిసలాటకి ఇంత అందమైన వర్ణన నేనింతవరకూ చూడలేదు:) అద్భుతం అన్న మాట చాలా చిన్నదవుతుందేమో మురారి గారు..

మధురవాణి said...
This comment has been removed by the author.
మధురవాణి said...

మీ పోస్ట్లు చదివాక ఏమీ మాట్లాడాలనిపించదు.. మళ్ళీ మళ్ళీ చదువుతూ మౌనంగా ఉండిపోవాలనిపిస్తుంది.. కామెంట్ రాయాలన్నా ఏమని రాయాలో తోచదు.. మీ అక్షరాలతో ఏవో లోకాల్లోకి తీస్కెళ్ళి అక్కడ వదిలి వచ్చేస్తారు! :)

మురారి said...

@మనసు పలికే,
ఊగిసలాటలోనే ఎక్కువ అందము, నాటకీయత ఉంటాయనుకుంటా. మీ కామెంట్ కి మురిసిపోయా.. థాంక్స్!.

@మధురవాణి,
నాకు కూడా చాలామంది బ్లాగర్ల టపాలు చదివితే ఇలానే అనిపిస్తుంది.. ఏం కామెంట్ చెయ్యాలో తోచదు.. అంత గొప్పగా అనిపిస్తాయి. పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది.

సాధారణంగా తీక్షణమైన భావావేశం ఉన్న అంశాలే నాకు రాసేందుకు ప్రేరణనిస్తాయి. ఆ తీక్షణత రచనలో చూపించడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ ఈ టపా మాత్రం ..బ్లాగ్ లో ఏమన్నా రాసి చాలా రోజులవుతుందని.. ఏదో రాయాలనిపించి, రాసాను. రాసాక.. felt foolishly romantic :).

మీ స్పందన కి ధన్యవాదాలు.

మోహన said...

Beautiful Murari Garu.

However, I somehow cudnt perceive the following line.
>>అవునంటే ఆ తర్వాత నువ్వెక్కడ నాకు 'మామూలు' అయిపోతావేమోనన్న అనుమానం.

To me, I flow when I express and the moment is eternal when it reaches abode.

No matter how many times and how many ways I express, someone special always remain special and the moments spent with them are the only times, where I love to breathe. And everything later looks so clean, loving and amazing, like for a new born :D


PS: Didnt want to use English. However its the language I use to maintain my balance. :D :P

మురళి said...

నువ్వు కాదంటే ఈ అందమైన కల చెదిరిపోతుందే అని భయం.. అవునంటే ఆ తర్వాత నువ్వెక్కడ నాకు 'మామూలు' అయిపోతావేమోనన్న అనుమానం. ...beautiful!!!మధురవాణి గారి మాటే నాదికూడానండీ..

మురారి said...

@మోహన,
ఒకరి మీద తీవ్రమైన ఆకర్షణ ఉండి, వారింకా పూర్తిగా తెలియని ఒక infatuated state లో ఇలాంటి భావాలు కలుగుతాయి. ఈ ఆకర్షణలని దాటేసి, మనసులు ఒళ్ళబోసుకొని తేలికయ్యే స్థితి ప్రేమ. ఆ స్థితికి చేరుకున్నాక 'మామూలు' అన్నది ఉండదు. ప్రణయం నిరంతర ప్రవాహమవుతుంది. ఇప్పుడొక ఓషో ప్రవచనం గుర్తుకొస్తోంది-
'మరొకరితో నీకు అవసరం లేనప్పుడు, నువ్వు ప్రేమించగలవు. ఆ ప్రేమ దైన్యాన్ని తీసుకురాదు. అవసరాలకి, ఆపేక్షలకి, కోరికలకి అతీతంగా ప్రేమ సున్నితమైన భాగస్వామ్యం, ఒడంబడిక అవుతుంది. '

@ మురళి,
స్పందన కి థాంకులు.

మోహన said...

--'మరొకరితో నీకు అవసరం లేనప్పుడు, నువ్వు ప్రేమించగలవు. ఆ ప్రేమ దైన్యాన్ని తీసుకురాదు. అవసరాలకి, ఆపేక్షలకి, కోరికలకి అతీతంగా ప్రేమ సున్నితమైన భాగస్వామ్యం, ఒడంబడిక అవుతుంది. '

How True!! Osho Rocks!!! :)
Thanks for sharing.

మురారి said...

@మోహన,
Yep.. Osho rocks!!.

Mohan Siva said...

Very Nice..!:)
www.inkakavala.com

మురారి said...

@Mohan Siva,
:)

Sudha said...

మురారిగారూ,
మొదటిసారి మీ బ్లాగ్ ని చూడడం...ఏదో ఒకటి బ్లాగ్లో రాద్దామని యథాలాపంగా రాస్తేనే ఇంత చక్కగా రాసారు....ఇక మీరు చెప్పిన తీక్షణమైన భావావేశం కలిగినప్పుడు రాసే మీ రచనలు చదివితే ఏమౌతామో... చాలా చాలా బాగా రాసారు....వ్యాఖ్యానిద్దామంటే మనసు మూగపోతోంది...మీ అంత అందంగా రాయడం చేతకాక....అది కేవలం వ్యాఖ్యకోసమైనా సరే..

మురారి said...

@Sudha గారు,
నా బ్లాగ్‌ కి స్వాగతం. ఇంత అందంగా నన్ను మునగ చెట్టు ఎక్కించేసి, మళ్లీ అందంగా రాయడం రాదంటారేమిటి?.. హమ్మో!.. మీతో జాగ్రత్తగా ఉండాలి. :) స్పందనకి థాంకులు.

Lakshmi Tadikonda said...

Murari Garu, awesome Andi.
Ma akka, tammudu chepte mee blog gurinchi emo anukunna..ento baga rasaru..nenu kuda matalu vettukuntunna em comment cheyyalani..kasepala undi poyi..ventane meeku cheppalanipinchi rasestunna..ee post chadivaka...antuntaruga manasu doodipinjala ayipoyindani adento ipude telsindi naku..eagerly waiting for your kalam jaluvarche mutyalu....

మురారి said...

@ Lakshmi Tadikonda
పాఠకుడిలో రసస్పందన కలిగించగలిగితే.. రచయితకి అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుందండి!!. స్పందించిన మీ అందమైన మనసుకి ధన్యవాదాలు.