Skip to main content

ప్రార్ధన


తండ్రీ!..

         'నేను' అంటూ ఒక అస్థిత్వాన్ని కల్పించావు. 'నేను' లేని శూన్యత ఎలా ఉండేదో కానీ, 'నేను' అని అనుకోగలగటం ఎంత బావుందో!. అసలు పుట్టుకే ఎంత గొప్ప అనుభవమో!.. చూడడం, కదలడం, సంభాషించడం, స్పృశించడం, రుచులను తెలుసుకోవడం.. ఓహ్‌!..ఎన్ని అద్భుతాలో!..

         వీటన్నింటినీ మించి.. 'రసస్పందన'. ఎక్కడుందో తెలియని మనసులో ఒక 'భావన' మెదలడం.. ప్రేమ, కరుణ, విరహం, దు:ఖం వంటి భావనల సృజన.. మనిషిగా పుట్టినందుకు ఈ జీవితమెంత రసాత్మకంగా ఉందో!..

         సీతాకోకచిలుకలు, ఉడుతలు, చెట్లు, సెలయేళ్లు, వెన్నెల, నక్షత్రాలు.. ఇలా విశ్వమంతా వ్యాపించిన నీ చైతన్య స్రవంతిలో నేనూ ఒక భాగమవ్వడం... ఓహ్!!..

         ఈ బ్రతుకు నీవిచ్చిన బహుమతి ప్రభూ!.. ఇతరులని సాధ్యమైనంతవరకూ నొప్పించకుండా నిరంతరంగా ఈ బహుమతిని ఆనందంగా అనుభవించడమే నేను నీకిచ్చే గౌరవం.

         ఈ గమనంలో ఎదురుపడేది ఏదైనా నువ్విచ్చినదే కదా!..దానిని సంతోషంగా, ధైర్యంగా, వినమ్రత తో స్వీకరించగలగాలి. నీవు నాకై నిర్దేశించిన ఆటని నావంతుగా స్వేచ్చగా, నిర్భయంగా, మనస్పూర్తిగా ఆడగలగాలి.

         మనిషి ఏర్పరుచుకున్న సమాజం, కట్టుబాట్లు, డబ్బు.. మొదలైన అంశాలు నా బుద్ధిని కప్పిపుచ్చకుండా చూడు తండ్రీ!. భయాన్ని కలగనివ్వని బుద్ధి అనుక్షణం ఈ జీవితాన్ని ఒక ఆనందప్రయోగాల పరంపరగా మార్చనీ.

         భవబంధాలు, అహంభావాలు బాధిస్తాయి. కానీ నాకున్న భవము, బంధమూ నువ్వే.. విశ్వమంత నువ్వే.. ఒక్క నువ్వే.. అనేకమైన నువ్వే. ఇక బాధ ఎక్కడిది?.. దేనికోసమని బాధ. ఈ స్పృహ ఎల్లవేళలా నాకు ఎరుకలో ఉండనీ.

         చివరిగా.. చావు ఏ క్షణాన ఎదురుపడినా ఒక మారు సంతోషంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు.
 

Comments

శిశిర said…
ఈ గమనంలో ఎదురుపడేది ఏదైనా నువ్విచ్చినదే కదా!..దానిని సంతోషంగా, ధైర్యంగా, వినమ్రత తో స్వీకరించగలగాలి. నీవు నాకై నిర్దేశించిన ఆటని నావంతుగా స్వేచ్చగా, నిర్భయంగా, మనస్పూర్తిగా ఆడగలగాలి.

బాగా చెప్పారండీ.
"నాకున్న భవము, బంధమూ నువ్వే.. విశ్వమంత నువ్వే.. ఒక్క నువ్వే.. అనేకమైన నువ్వే. ఇక బాధ ఎక్కడిది?.. దేనికోసమని బాధ. ఈ స్పృహ ఎల్లవేళలా నాకు ఎరుకలో ఉండనీ."

బాగా చెప్పారండీ
@ శిశిర, శ్రీనివాస్ పప్పు,
ధన్యవాదాలండి.
మోహన said…
Nice one.

>> చావు ఏ క్షణాన ఎదురుపడినా ఒక మారు సంతోషంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు.

If every moment is worth celebrating, one need not wait for the last moment to thank GOD. HE deserves a thanks every moment.

another point. An artist never expects people to praise Him, but his art work. HE is basically an artist. So, if you are so impressed by Him, praise his work, Life.

So, the best way to show your gratitude to Him is to respect and humbly appreciating life force, in every form.

Good Luck!
This comment has been removed by the author.
@ మోహన,
కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగి చూసుకొని.. మనకి మనమే ముచ్చటపడి.. నాటకకర్తకు ఏకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలనిపిస్తుంది. చావు అలాంటి సందర్భమే!. అతని ఆటలో మనం పూర్తిగా మునిగిపోయి.. ఏ క్షణానికాక్షణం ధన్యవాదాలు చెప్పుకోలేకపోవచ్చు.
>>So, the best way to show your gratitude to Him is to respect and humbly appreciating life force, in every form.
అవును.. నా అభిప్రాయమూ అదే!!.
ధన్యవాదాలు.
chaala baavundi...
Excellent.
@ telugu-devotionalmp3,
థాంక్సండి.
MURALI said…
సెన్సిటివ్ భావాల మీ మనస్సు ఆవిష్కరించారు.
nagasrinivasa said…
చావు ఏ క్షణాన ఎదురుపడినా ఒక మారు సంతోషంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు.....ఎలా అండీ.. నాకు చావు అనేమాట వింటెనే చాలా భయం వేస్తుంది...
@ మురళి గారు,
ధన్యవాదాలండి.
@ నాగశ్రీనివాస,
భయం వేసినా, వేయకపోయినా చావు సత్యం. ఎదుర్కోవాల్సిందే. తప్పని విషయాన్ని వీలైతే అంగీకరించడం మంచిది కదా!.
మిగతా అన్నింటిలాగే చావు కూడా ఒకటి అని బాగా చెప్పినారు.
నిజంగా ఆక్షణంలో ఇన్నీ ఇచ్చినవానిని తలచుకొని కృతజ్ఞతలు చెప్పగలిగితే (ఇపుడెన్ని సార్లు చెప్పినా) ఎంత బాగుంటుంది!
అంత అదృష్టం ఉండి, ఆ బుద్ధి ఆక్షణానికి ఉండాలని ప్రార్థిద్దాం
మృత్యువు ఒడిలోకి వెళ్తున్నవేళలో చెప్పనో శ్రమచేత చెప్పలేనో నాటికిపుడే నిను తలతునని మనసారా తలచుకుంటాడు నరసింహ శతక కర్త.
Karthik said…
మురళీ గారు బాగుదండి మీ ప్రార్ధన... మీ కథ "అమ్మకు పూలు పూచాయి" ఇప్పుడే చదివాను, నాకు చాలా బాగా నచ్చింది:-):-)
dayakar said…
yekkada babu thamaru, mail respond cheyava yendhi?
@ లక్ష్మీదేవి గారు, @ ఎగిసే అలలు,
ధన్యవాదాలండీ!!.
nmrao bandi said…
చావు ఏ క్షణాన ఎదురుపడినా ఒక మారు సంతోషంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు...

ఈ మధ్యలో ఎన్ని కష్టనష్టాలకు...
ఒడిదుడుకులకి గురిచేసినా...
చివరగా మాత్రం సంతోషంగా
నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు...

బాగుంది...
నైస్ పోస్ట్...

అభినందనలు...
చాలా బాగా రాశారు మురారి గారూ...రవీంద్రుని గీతాంజలికి చలం తెలుగు అనువాదం తర్వాత నాకు నచ్చిన "ప్రార్ధన" ఇదే...! చాలా బావుంది. అభినందనలు...మీరు వంశధారా నదీతీరంలో ఉంటారా..ఇప్పుడూ అక్కడే ఉన్నారా...నేను పక్కనే ఉన్న విశాఖలో...
@Nmrao Bandi,
ధన్యవాదాలండి.

@Gayatri Lakshmi,
మీ అభిమానానికి పాత్రుడినవ్వడం సంతోషంగా ఉంది. నాది శ్రీకాకుళం.. కానీ బతుకుతెరువు హైదరాబాద్‌లోనే. ధన్యవాదాలండి.
Unknown said…
Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

Teluguwap,Telugu4u

Tollywood,Tollywood Updates , Movie Reviews
Unknown said…
This comment has been removed by the author.
Unknown said…
Hi Murari,
It was wonderful. Name of your blog pulled me to enjoy your writing. The blog name itself is explaining your very self. Prardhana, Raji, ounanna kaadanna .. Were very good. Your writings have introduced Osho to me.
Keep blogging.
Cheers
Vishnu
@Vishnu Vardhan,
Glad to know that u liked my blog. Thanks for the comments.
Hi Murari,

Please write more, my sister and me are eagerly waiting for your posts, we daily visit free hugs for a fresh, heart touching content, but the year 2013 really disappoints. whatever or however I say it is not enough. Raji, supraja, ting ting..Dairy Milk Silk, ounana kadana.. not enough Murari! Really not enough, it was not at all fair. Write more and make us to read more.

Cheers,
Vishnu, Bindu.
@ Vishnu, Bindu
చాలా ఆనందమేసింది మీ కామెంట్ చదివి. చాతీ ఉప్పొంగింది. నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌లో దీనినీ ఒకటిగా భావిస్తాను. U made my day. ఇకపోతే వేరే వ్యవహారాల్లో బిజీగా ఉండడం వల్ల రాయడం కుదరడం లేదండి. అంతా సర్దుకున్నాక మళ్ళీ రాయడం ప్రారంభిస్తానండి. మీ అభిమానానికి పాత్రుడిని అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
మీలో మాకు నచ్చే విషయం ఏమిటో తెలుసా మీరు వెంటనే స్పందిస్తారు. అలా స్పందించినందుకు ధన్యవాదములు. తప్పక రాయండే

బిందు,విష్ణు.
@హిమబిందు,
తప్పక ప్రయత్నిస్తానండి. ధన్యవాదాలు.