తలుపు శబ్దం చెయ్యకుండా తెరుచుకుంది. తలుపు తెరిచాక రూమ్ ఎందుకో ఎప్పటిలా నిర్జీవముగా అనిపించలేదు నాకు. చీకటి రూము, మనసు మూలల్లోని చీకటి పొరలా ఉంది. నా ఆలొచనకి నాకే నవ్వు వచ్చింది. రూమ్మేట్ ఆన్ సైట్ కి వెళ్లాడు. ఇప్పుడు నేనొక్కడినే రూంలో. బెడ్ మీద వాలి, టి.వి ఆన్ చేసాను. నిరాసక్తంగా ఛానెల్లు మార్చుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ కాల్స్. రాత్రి 1.30 కావస్తూంది. ఇంక పడుకుందామని టి.వి, లైటు ఆఫ్ చెసాను. రూం నిండా చీకటి పరచుకొంది. పక్క వీధి స్ట్రీట్ లైటు వెలుగు కిటికీ గ్లాసు ద్వారా ఎదురుగా గోడ మీద గాఢ నీలపు కాంతిలో పడుతున్నది. అప్రయత్నంగా నా ద్రుష్టి ఆ వెలుగు మీద పడింది. అక్కడ ఏవో నీడలు కదులుతున్నాయి. ఒక్కసారిగా గుండెలు అదిరాయి. ఇంత రాత్రి వేళ ఏంటి కదులుతూంది అని!. కొంచం పరిశీలనగా చూస్తే నీడలు మనిషివి లా అనిపించలేదు. కొంచం ధైర్యం వచ్చింది. ‘ఏంటి ఈ రోజు ఇలా భయపడుతున్నాను’ అనుకున్నాను. ‘కమాన్ శీనూ!!, నువ్వు భయపడటం ఏంటి?’ అని కొంచం మోటివేట్ చేసుకొని పడుకున్నాను. కిటికీని ఆనుకొని వుంది పరుపు. మెల్లగా నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోబోతూండగా ఎదో శబ్దం వినిపించింది. ఎవరో కిటికీ అద్దాన్ని వేలితో చిన్నగా ర...