ఉరుకుతూ బస్సెక్కాను. చీర చెమటతో తడిసిపోయింది. పొద్దంతా కూలి చేసి, సాయంత్రం ఆ డబ్బులతో మా చంటోడికి బట్టలు కొని, మా ఊరి బస్సెక్కేసరికి రాత్రి తొమ్మిది దాటింది. కండె క్టరు టి కేట్ ఇచ్చాక చేతిలో రెండు రూపాయలే మిగిలాయి. ఊరెళ్ళాక పనికొస్తాయని దాచుకున్నాను. బాగా ఆకలేస్తుంది. పనితో ఒళ్ళు హూనమైనా నిద్ర పట్టట్లేదు. పొద్దుట్నుంచి తిండి లేదు. ఇంకేమీ చెయ్యలేక కళ్లు మూసుకున్నాను. ముందు సీట్లో ఒక బట్టతల ఆయన ప్రక్కవాళ్లకి దేవుని గురించి అందరికీ వినిపించేలా చెబుతున్నాడు. 'మనిషికి భగవంతుని మీద తప్ప మరే విషయం మీద అనురక్తి ఉండకూడదు.' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నా నాకేమీ ఎక్కట్లేదు. వాళ్ళెవరికీ ఆకలి లేదు. నాకుంది. కడుపు నిండాకే దేవుడు. బస్ లో లైట్లాపేశారు. బయట కూడా చీకటిగానే ఉంది.మధ్యలో ఆగినప్పుడు ఒకాయన బస్సెక్కి నా పక్కన కూర్చున్నాడు. కొంచం కళ్ళెత్తితే ఆయన బూట్లు కనపడ్డాయి. మళ్ళీ చీకటి. కాసేపటికి ఆయన నా వైపుకి ఒరుగుతున్నాడు. నిద్రలో ఉన్నాడో ఏమో. నాకు అతన్ని పక్కకి తోసే ఓపిక ఎంత మాత్రం లేదు. ఆకలిని జయించడానికి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేసాను. ఇంకాసేపటికి అతని చెయ్యి నా ఒ...