Skip to main content

Posts

Showing posts from 2013

ప్రార్ధన

తండ్రీ!..          'నేను' అంటూ ఒక అస్థిత్వాన్ని కల్పించావు. 'నేను' లేని శూన్యత ఎలా ఉండేదో కానీ, 'నేను' అని అనుకోగలగటం ఎంత బావుందో!. అసలు పుట్టుకే ఎంత గొప్ప అనుభవమో!.. చూడడం, కదలడం, సంభాషించడం, స్పృశించడం, రుచులను తెలుసుకోవడం.. ఓహ్‌!..ఎన్ని అద్భుతాలో!..          వీటన్నింటినీ మించి.. 'రసస్పందన'. ఎక్కడుందో తెలియని మనసులో ఒక 'భావన' మెదలడం.. ప్రేమ, కరుణ, విరహం, దు:ఖం వంటి భావనల సృజన.. మనిషిగా పుట్టినందుకు ఈ జీవితమెంత రసాత్మకంగా ఉందో!..          సీతాకోకచిలుకలు, ఉడుతలు, చెట్లు, సెలయేళ్లు, వెన్నెల, నక్షత్రాలు.. ఇలా విశ్వమంతా వ్యాపించిన నీ చైతన్య స్రవంతిలో నేనూ ఒక భాగమవ్వడం... ఓహ్!!..          ఈ బ్రతుకు నీవిచ్చిన బహుమతి ప్రభూ!.. ఇతరులని సాధ్యమైనంతవరకూ నొప్పించకుండా నిరంతరంగా ఈ బహుమతిని ఆనందంగా అనుభవించడమే నేను నీకిచ్చే గౌరవం.          ఈ గమనంలో ఎదురుపడేది ఏదైనా నువ్విచ్చినదే కదా!..దానిని సంతోషంగా, ధైర్య...