Skip to main content

Posts

Showing posts with the label Adults only.

రాజి

 (గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే) నిశిరాత్రి రంగులారబోస్తున్న సంధ్యని నిర్దాక్షిణ్యంగా లోబరుచుకొని కొన్ని గంటలౌతోంది. టార్పాలిన్‌ తో కప్పబడిన ఓ గుడిసె నుండి బయటకొచ్చింది రాజి. అలాంటి గుడిసెలే ఆ ప్రాంతంలో ఓ ముప్పై వరకూ రోడ్డు పక్కగా ఉన్నాయి. గుడిసె నుండి కొంచం దూరం నడిచి, రోడ్డు మీదకి వచ్చి పక్కగా ఉన్న భారీ సిమెంట్‌ పైప్‌ ఎక్కి కూర్చింది. పైప్‌ వెనుక ఎత్తుగా ఎదిగిన చెట్టుకొమ్మ నీడలు ఆమెపై తచ్చాడుతున్నాయి. రాత్రి 10 దాటడంతో ఆమె ఉండే స్లమ్‌ ఏరియా నిద్రలో జోగుతోంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల ఏడుపులు అక్కడి ప్రశాంతతని భగ్నం చేస్తున్నా అవి కాసేపటికే సద్దుమణుగుతున్నాయి. ఇటు రోడ్డు మీద అప్పుడప్పుడు కార్లు రివ్వున దూసుకుపోతున్నాయి. కొంచం దూరంలో ఒక పబ్‌, దానిపక్కన షాపింగ్‌మాల్స్‌, అర్బన్‌ టౌన్‌షిప్స్‌ ఉన్నాయి. అటువైపంతా లైట్ల ధగధగలతో ఇంకా హడావుడిగా ఉంది. రాజి కి ఆ లైట్లంటే ద్వేషం. ఐనా వాటిని చూడడానికి అప్పుడప్పుడూ రాత్రిపూట బయటకి వస్తుంటుంది. ఆడవాళ్ళు రెండు రకాలు- మగవాడిని మోహంలోకి నెట్టేవారు, నెట్టలేనివారు. రాజి మొదటి కోవకి చెందుతుంది. ఆమెకి 24 ఏళ్లు ఉండొచ్చు. చామనఛాయ. చూ...