Skip to main content

పట్నం కాచిన వెన్నెల

వెన్నెల నవ్వింది - పట్నం లో తనది అడవి కాచిన వెన్నెల అని.

వర్షం నవ్వింది - తనని చూసి విసుక్కొనే జనాలని చూసి.

పసివాడు నవ్వాడు - train కి టాటా చెప్తుంటే దానికి రెస్పాన్స్ ఇవ్వ లేని మన హుందాతనాన్ని చూసి.

లోపలి ఆనందం నవ్వింది - తనని ఎక్కడో బయట వెతుకుతున్నందుకు.

మానవత్వం నవ్వింది - పక్కవాడి గురించి తెలీదు గానీ, celebrities ని బాగా పట్టించుకొంటున్నందుకు.

పట్నం అనే వేశ్య నవ్వింది - తనది నిజమైన ప్రేమ అనుకొని మోసపోయే మనిషిని చూసి.

Comments

బాగు బాగు. బాగా రాస్తున్నారండీ
Indeevara said…
mee varnanala yedo pratyeekata undandi. adeemito spashtamga cheppaleenu kani patnam kaachina vennela excellent.
@కల్పలతిక, వాత్సవి,
మీ స్పందనకి ధన్యవాదాలు.