Tuesday, December 20, 2011

రాజి


 (గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే)

నిశిరాత్రి రంగులారబోస్తున్న సంధ్యని నిర్దాక్షిణ్యంగా లోబరుచుకొని కొన్ని గంటలౌతోంది.

టార్పాలిన్‌ తో కప్పబడిన ఓ గుడిసె నుండి బయటకొచ్చింది రాజి. అలాంటి గుడిసెలే ఆ ప్రాంతంలో ఓ ముప్పై వరకూ రోడ్డు పక్కగా ఉన్నాయి. గుడిసె నుండి కొంచం దూరం నడిచి, రోడ్డు మీదకి వచ్చి పక్కగా ఉన్న భారీ సిమెంట్‌ పైప్‌ ఎక్కి కూర్చింది. పైప్‌ వెనుక ఎత్తుగా ఎదిగిన చెట్టుకొమ్మ నీడలు ఆమెపై తచ్చాడుతున్నాయి. రాత్రి 10 దాటడంతో ఆమె ఉండే స్లమ్‌ ఏరియా నిద్రలో జోగుతోంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల ఏడుపులు అక్కడి ప్రశాంతతని భగ్నం చేస్తున్నా అవి కాసేపటికే సద్దుమణుగుతున్నాయి. ఇటు రోడ్డు మీద అప్పుడప్పుడు కార్లు రివ్వున దూసుకుపోతున్నాయి. కొంచం దూరంలో ఒక పబ్‌, దానిపక్కన షాపింగ్‌మాల్స్‌, అర్బన్‌ టౌన్‌షిప్స్‌ ఉన్నాయి. అటువైపంతా లైట్ల ధగధగలతో ఇంకా హడావుడిగా ఉంది. రాజి కి ఆ లైట్లంటే ద్వేషం. ఐనా వాటిని చూడడానికి అప్పుడప్పుడూ రాత్రిపూట బయటకి వస్తుంటుంది.

ఆడవాళ్ళు రెండు రకాలు- మగవాడిని మోహంలోకి నెట్టేవారు, నెట్టలేనివారు. రాజి మొదటి కోవకి చెందుతుంది. ఆమెకి 24 ఏళ్లు ఉండొచ్చు. చామనఛాయ. చూడగానే మగవాడికి సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఒక ఆమెతో ఐదునిమిషాల సాంగత్యం చాలు. ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే మగవాడు ఒక బలమైన మోహోద్రేకం లో పడిపోతాడు. ఆమె దేహభాషలో ఏవో నీలిఊసుల గుసగుస వినబడుతుంది. కళ్ళు చూసేకొద్దీ మరింత ప్రత్యేకమనిపిస్తాయి.. కొంటె భావాలేవో మార్మికంగా ప్రతిఫలిస్తాయి. ఒకసారి వాటిని చూసాక.. అర్ధమౌతుంటే.. మగవాడు తిరిగి చూడడానికి తడబడతాడు- ఎక్కడ వివశుడనైపోతానేమోనని. ముత్యమంత ముక్కుపుడక ఆమెలోని నిగూఢతకి మెరుపులద్దినట్టుంటుంది. ఆ స్లమ్‌లో ఉన్న తోటి ఆడవాళ్లలా ఆమె చీరలు, లంగావోణీలు వేసుకోదు. మగవాళ్ల ఫుల్‌స్లీవ్‌ షర్ట్, కుచ్చులతో ఉండే పొడవాటి లంగా- ఆమె ఎప్పుడూ వేసుకునే డ్రెస్‌. తోటి ఆడవాళ్లు తనని చూసి మూతి తిప్పుకున్నా.. అసూయ పడినా.. హీనంగా చూసినా.. పట్టించుకోదు. తనసలు ఆ సమూహానికి చెందినట్టే కనపడదు.

నొప్పి చురుక్కుమనడంతో రాజి మోచేతి మీది చర్మం అస్థిత్వంలోకి వచ్చి, తన మీదున్న దోమని కళ్ళకి చూపించింది. వెంటనే దోమని కొట్టాలన్న ఆలోచన కలిగినా ఎందుకో ఆగింది. ఎదురుగా పడుతున్న పసుపురంగు స్ట్రీట్‌లైట్‌ కాంతిలో దోమ పొట్టలోకి ఎక్కుతున్న రక్తం గాఢనారింజరంగులో కనపడుతోంది. దోమ నాళిక రక్తాన్ని లాగుతున్న బాధ లేశమాత్రంగా తనకి తెలుస్తోంది. పొట్టనిండాక తిరిగి గాలిలోకి ఎగురుతున్న దోమని ఆ అవకాశం కోసమే చూస్తున్నట్టు వెంటనే పట్టుకొంది. పొట్టనిండిన దోమని పట్టుకోవడం సులువు. ఎందుకంటే అది వేగంగా ఎగరలేదు. రాజి అరచేతి రాపిడికి ఆ సూక్ష్మ ప్రాణి చతికిలపడింది. రాజి దోమని వేళ్లతో పట్టుకొని ఒకవైపున్న రెక్కలని విరిచేసి దోమని పక్కన పడేసింది. దోమ అక్కడే కొట్టుకుంటూ పడి ఉంది. రాజి మళ్లీ రోడ్డు వైపు దృష్టి సారించింది. ఒక అరనిమిషం తర్వాత లెక్కపెట్టుకున్నట్టు దోమని కాలి వేలితో నలిపి, చంపేసింది.

రోడ్డు పక్కగా ఓ మోటార్‌సైక్లిస్ట్‌ ఆగాడు. ఉచ్చ పోసుకున్నాడు. జిప్‌ పెట్టుకొని సైడ్‌కి తిరుగుతూ రాజిని చూసాడు. ఆశ తళుక్కుమంది. కామాన్ని చీకటిభావనగా గుర్తించే ఏ సంఘపు మగవాడైనా ఆడదాన్ని మొదట కోరికతోనే చూస్తాడు. కానీ రాజి ముఖాన్ని పక్కకి తిప్పింది.

ఇంకొకడు కారులోంచి దిగి ఫోన్‌ లో మాట్లాడాడు. ఏదో టెన్షన్‌లో ఉన్నట్టున్నాడు కానీ ఈమెని చూసేసరికి ఓ క్షణం ఏవీ పట్టనట్టు తెప్పరిల్లాడు. కామం అతిప్రభావవంతమైన యాంటి-డిప్రెషన్‌ ఏజెంట్‌. రాజి కళ్ళతోనే తన నిరసనని నిర్ద్వందంగా చెప్పింది. పాపం వాడు మళ్లీ టెన్సన్స్‌ లో పడ్డాడు.. ఈసారి ఇంకాస్త ఎక్కువ ఫ్రస్ట్రేషన్‌తో. కామం తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌ కారకం కూడా!.

ఆమె ఎవరికోసమో ప్రత్యేకంగా నిరీక్షిస్తున్నట్టు లేదు. అరగంట దాటింది. రోడ్డు మీద వాహనాల రాక బాగా తగ్గింది. ఇంతలో మరొక కారు ఆగింది. ఒక 30 ఏళ్ల వ్యక్తి దమ్ము కొట్టడానికి దిగాడు. అతన్ని చూడగానే రాజి కళ్ళు మెరిసాయి. టీ షర్ట్‌, జీన్స్‌లో హాండ్సమ్‌గా ఉన్నాడు. అంతవరకూ మోకాళ్లపై తలపెట్టి కూర్చున్న ఆమె నిటారయ్యింది. సిగరెట్‌ వెలిగించుకుంటూ అతను రాజి ని చూసాడు. చూసిన క్షణాన లేశమంత ఆసక్తి తప్పితే అతనిలో మరేమీ కనపడలేదు. రాజి ఓసారి అతన్ని చూసి, కుడి చేతితో వెనుకున్న జుత్తుని మెడకి కుడిపక్కగా ముందుకు లాక్కుంది. అక్కడినుండి కుడిచేయి జారి తన నడుముని పట్టుకుంది. ఎడమచేయి కాస్త వెనుకకి వెళ్లి సిమెంట్‌పైప్‌ని ఆసరా తీసుకోవడంతో ఎద కొంచం ముందుకు పొడచూపింది. కుడికాలు కాస్త ముందుకు వచ్చి, పాదం సిమెంట్‌పైప్‌ని ఆనుకొంది. పెదవులు ఒకింత విచ్చుకున్నాయి. సూటిగా చూస్తున్న ఆమె కళ్ళలో ఆసక్తి కలిసిన మత్తు. ఆమెని అలా చూస్తూ అతనూ ఆకర్షితుడై ఇంకొంచం ముందుకు జరిగాడు. సిగరెట్‌ అయిపోయింది. 'ఇది ఆ టైపు కేసు..' అనుకొని లైట్‌ తీసుకుందామనుకున్నాడు కానీ ఎందుకో ఆమె అందరిలా అనిపించలేదు. పక్కలకి అటూ, ఇటూ చూసి మళ్లీ ఆమె వైపు చూసాడు. తనని పసిగట్టినట్టుగా ఆమె ముఖంలో వెలిగిన చిలిపి నవ్వు అతన్ని దెబ్బతీసింది. కూల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తూ మరొక సిగరెట్‌ని లైటర్‌ తో వెలిగించి తనకి ఇంకాస్త దగ్గరగా వచ్చాడు. రాజి అతన్ని చూస్తూ కుడిచేత్తో ఆమె షర్ట్‌కున్న మొదటి గుండీని తొలగించింది. తొలగించడం వల్ల తొంగిచూసిన అందాలు కావు.. ఆమె కళ్ళలోని కవ్వింపు.. ఏ మగాడి లాగులోనైనా అప్పటికప్పుడే ఒత్తిడిని పెంచేస్తుంది. అతను అమాంతం కామపీడుతుడయ్యాడు. ఇంకా దగ్గరకి వచ్చాడు. ఐనా కొంచం బెరుకు ఉంది. ఎలా మొదలుపెట్టాలో అర్ధం కాలేదు. ఒక వందనోటు పర్సులోంచి తీసిచ్చాడు. రాజి నోటుని అందుకొని నవ్వింది. ఆ నవ్వులో ఒకింత తేలిక భావం. 'సిగరెట్‌ ఇవ్వు' అనడిగింది. ఇచ్చాడు. ఒక దమ్ము ఊది, రెండవ దమ్ముని ఊదుతూ వందనోటిని సిగరెట్‌ దగ్గరకి తెచ్చి, కాల్చింది. నోట్‌ మీద పెద్ద కన్నమయ్యాక నోట్‌ని కిందపడేసింది. షాక్‌ తినడం అతని వంతయ్యింది. ఈసారి ఐదొందల నోటిచ్చాడు. సిగరెట్‌ని‌ తీసి పక్కన పైప్‌ మీద పెట్టింది. షర్ట్‌ జేబులోంచి పదిరూపాయల నోటు తీసి, ఆ ఐదొందలకి కలిపి అతనికిస్తూ 'నీ రేటెంత?' అనడిగింది.

ఆశ్చర్యంతో అతను మరింత మోహావేశుడయ్యాడు. ఆమెని అక్కడే అనుభవించెయ్యాలన్నట్టు ముందుకొచ్చాడు. రాజి అతని ఛాతి మీద రెండు చేతుల్ని అడ్డుగా వేసి ఆపింది. అడ్డుని మెళ్లగా వదులు చేసేసరికి అతని ముఖం, రాజి ముఖం దగ్గరగా వచ్చేసాయి. కానీ ముద్దు పెట్టుకోలేనంత దూరంలో అతన్ని ఆపేసి కొంటెగా చూసింది. అతని చేతులు రాజి భుజాల్ని పట్టుకొని ముందుకు లాగుతున్నాయి. ఇంతలో రాజి ఎడమ చేయి అతని ఛాతిని రాసుకుంటూ కిందకి జారుతోంది. అతని శ్వాస బరువెక్కుతోంది.. అదే సమయంలో శ్వాస వేగమూ పెరుగుతోంది. చేతిని అక్కడివరకూ తీసుకెళ్లి, చేయి ఇక ఆ భాగాన్ని పట్టుకోబోతోందనగా ఒక అరక్షణం ఆపింది.. అతను ఆవేశంలో కరిగి, వణుకుతున్నాడు. తిరిగి చురుగ్గా రాజి చేయి అతని అంగాన్ని సుతారంగా పట్టుకొంది. అతను ఒక్కసారిగా అదిరి, ఉత్తేజితుడై 'Oh.. i'm horny.. Bitch, i fuck u.. ' అంటూ దానినే రిపీట్‌ చేస్తూ తన మీద పడి, నలిపేస్తున్నాడు. అంతవరకూ కామదేవతలా ఉన్న రాజి, ఏదో ముసుగు తొలగించినట్టు అకస్మాత్తుగా సాధారణయువతిలా మారింది. ఇటూ, అటూ చూసింది. పక్కనే కాలుతున్న సిగరెట్‌ పీకని తీసి, అతని మెడ మీద పెట్టేసరికి అరుస్తూ ఆమెని వదిలాడు. వెంటనే ఆమె స్లమ్‌ వైపుకి పరిగెత్తింది.. ఆమె ముఖంలో ఎందుకో ఆనందం.. ఒకింత క్రూరత్వంతో కూడిన ఆనందం.

పెద్ద అంగలేసుకుంటూ వచ్చి, రాజి గుడిసెలో తాగి పడుకున్న తన భర్తని లేపుతుంటే ఆమె అత్తకి తెలివి వచ్చి, ఏదో గ్రహించినదానిలా గుడిసె నుంచి దుప్పటి పట్టుకొని బయటకు నడిచింది. లేపుతున్నది రాజి అని తెలియగానే మొగుడు ఠక్కున లేచి ఆశగా చూసాడు- చాన్నాళ్లకి మళ్లీ ఈ రాత్రికి పండగ చేసుకోవచ్చని.

'ఈసారి ఏం చెప్పాలా?..' అనడిగాడు.
'ఓ.. యం ఆర్నీ.. బిచ్‌.. ఐ ఫక్యూ!!..' అని చెప్పింది రాజి. 

ప్రాక్టీస్‌ చేసాడు. ప్రాక్టీస్‌ మీద నమ్మకం కుదిరాక, ఆ ఆనందంలో రాజి మీద మృగంలా పడి ఆమె షర్ట్‌ని చకచకా విప్పేసాడు. రాజి నిర్భావంగా అతన్ని ఒక క్షణం ఆగమని చెప్పింది. రాజి కళ్ళకి దాసుడైనట్టు ఠక్కున ఆగిపోయాడు. గుడిసెలోని దీపం ఆర్పి అతని పక్కలో చేరింది. పక్కలో చేరకముందు- దీపం ఆర్పాక అక్కడే ఒక క్షణం ఆగి, ఆమె ఏదో ఊహని వెతికింది. మరుక్షణం కామదేవతలా ఓ నీలివెలుగు ఆమె ముఖాన పులుముకొంది.

బయట ముసలమ్మ (రాజి వాళ్ల అత్త) దోమల్ని పైటకొంగుతో విసురుతూ దుప్పటి కిందవేసుకొని పడుకొంది. గుడిసె లోపల నుంచి ఈ శబ్దాలు పదేపదే వినిపిస్తున్నాయి-


రాజి భర్త: 'ఓయే.. యం ఆర్నీ.. బిచ్చు‌.. ఐ ఫక్యూ!!..'
రాజి: 'మ్మ్‌మ్‌మ్‌మ్‌!!..అహ్మ్‌మ్మ్‌!!.. మ్మ్‌ఆహ్!!..'‌

8 comments:

మోహన said...
This comment has been removed by the author.
మోహన said...

(గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే)

idi choosi post chadavakundaa aagipoyaaa mastaarooo... :P 6 nelalayyaakaa vacci, ilaa board pedite maa laanti valla sangatEnTI? maa waitingu waitingu kaaadaa...?? ika maa kosam eppudu raastaaru? maLLeee inko aarO, mupphai aarO nelalu wait cheyyaalEmO??!!!! hmmmmmmm

శేఖర్ పెద్దగోపు said...

ఇలాంటి కధ రాయటమే గాక పబ్లిష్ కూడా చేసిన మీ గట్స్‌కి లాల్ సలాం...:-)
నాకైతే ఆ అమ్మాయి సైకాలజీ అర్ధం కాలేదు...బాగుంది చాలా బాలెన్స్‌డ్‌గా రాసారు...కొంచెం బాలెన్స్ తప్పినా 'మరో' కధలా అయిపోయుండేది...మీ ఫ్యాన్స్‌కి మాత్రం కాస్త నిరాశపరచబోయే టపానే..:-)

MURALI said...

నేను నిరాశపడలేదు. మీరు మీకే సొంతమైన ఒక స్టైల్‌లో మాస్టర్స్ సాధించారు. కధ శరీరాన్ని వదిలి అత్మని చూస్తే కనిపించింది మీ స్టైలే. తరుచూ రాస్తూ ఉండండి మాస్టారు.

మురారి said...

@ మోహన,
అయ్యో!.. మీరు 'పెద్దవార'నుకున్నానే ;).

@శేఖర్‌ పెద్దగోపు,
రాయాలనిపించింది, రాసాను. అంతే :).
మీ స్పందనకి ధన్యవాదాలు.

@మురళి,
మీ ప్రోత్సాహానికి థాంకులు.

dayakar said...

:) :))

మోహన said...

Read it now for the 3rd time.

మొదటి సారి చదివిన వెంటనే ఏం అర్ధంకాలా.. ఈ కథ రాయటానికి చాలా creativity, guts అవసరం అనుకున్నాను. ఏమీ చెప్పకుండా వెళ్లటం ఇష్టం లేక ఏదో చెప్పి వెళ్లాను. :D

రెండవసారి చదివినప్పుడు 'ఏదో ఉంది ఈ రాజిలో....' అనిపించింది. బట్ ఏమిటో అర్ధం కాలా....
"థిస్ రాజి ఈస్ అప్ టూ సంథింగ్. వాట్ ఈస్ ఇట్???" అనుకుంటూ, I returned with some ???!!!!

ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తరువాత చదివితే తలలో ఏవో బల్బులు వెలుగుతున్నాయి. [వేలుగుతున్నాయో, ఆరుతున్నాయో మరి! :) ]
దోమ ఉదంతం, ఆమె attitude, ఆ వ్యక్తులతో ఆమె ప్రవర్తన.... వేటాడేప్పుడు ఉన్న ఆ hunting attitude..., అది just for the fun of hunting? not to feast on the prey! not to win over!!!

why did she do it all???
If it is just her fantasy, why did she break it all??
btw - రాజీ పాత్రకి ఆ పేరు పెట్టటంలో వేరే ఆంతర్యం ఏమైనా ఉందా? Is she portraying the hippocratic and compromising nature in human behavior?? I mean nature of ppl living in a society?

I dont know, if you thot something like this or u thot anything at all in psychological or metaphorical ways, when writing it. Just ignore, if it doesnt make any sense. వాటేవర్...

ఐ స్టిల్ థింక్, "థిస్ రాజి ఈస్ అప్ టూ సంథింగ్." వాట్ ఈస్ ఇట్??!!! i would like to listen your version of the thot.

Now, to say, You are writing some classics here..!! I should be out of my mind to expect u to write such stuff very frequently. coz i know what it takes to write a piece of work like this!. But you see... I am greedy. whats wrong in asking... :D Keep writing more often ;)
PS: pay attention while framing stmts. you need to do some proof reading.

మురారి said...

@మోహన,

రాజి లాంటి స్త్రీని ఆవిస్కరించాలన్నది నా చిరకాల వాంఛ. కానీ అంత బాగా ఆవిష్కరించలేకపోయానన్నది సత్యం. తనలాంటి కారెక్టెర్‌ని ప్రెజెంట్‌ చెయ్యాలంటే కొంత నిగూఢత అవసరం. అలానే పోస్ట్‌ చదివాక ఒక రెండు నిమిషాలైనా పాథకుడు ఆమె గురించి ఆలోచించాలన్నది నా ఆబ్జెక్టివ్‌. అందుకే తేటతెల్లంగా రాయలేదు.

I wanted to exhibit how social disparity manifests into frustration/ fantasy through the character of Razi. రాజికి తాను అందగత్తెనని తెలుసు. ధనిక వర్గానికి చెందిన వారిలా విలాసాలు అనుభవించే అర్హత తనకుందని బలంగా నమ్ముతుంది. తాను ఆ స్లమ్‌ బతుకులకి చెందనని ఆమె ప్రగాఢ గుడ్డి విశ్వాసం. కానీ జీవితం ఆమెకి మొండిచెయ్యి చూపిస్తుంది. ఆమె కల నెరవేరదనే సత్యం ఆమెకు అర్ధమౌతున్నా జీర్ణించుకోలేని పరిస్థితి. అందులోంచి కలిగే ఫాంటసీనే నా కధ- She fancies being fucked in English.

రాజి గురించి రచయితగా నాకు కొంత తెలిసినా పాఠకులకి తన పెర్స్పెక్టివ్‌ లో ఏ విషయమూ చెప్పకూడదనుకున్నాను. ఒక అబ్జర్వర్‌ లా ఈ సంఘటనని పాఠకులకి చెబ్దామనుకున్నాను.

బేసిగ్గా నేను గొప్పగా రాయను. నాకంత vocabulary గానీ, బాగా తీర్చిదిద్దాలన్న excitement వల్ల కలిగే ఓపికగానీ లేవు. నా కధావస్తువు మాత్రం ఘనంగా ఉండాలని ఆశిస్తాను. ఆ కధ, కారెక్టర్లు మనసులో form/visualize అవుతున్నప్పుడు మాత్రం చాలా excite అవుతాను. కొన్నిసార్లు ఆ excitement బలీయమైనపుడు బ్లాగ్‌లో ఒక టపాగా బయటకొస్తుంది. నాకు కూడా తరచుగా రాయాలని ఉంది. కానీ ఈ నిబద్ధతలేమి ఉంది చూసారూ!..హన్నా! దానికి రెండు బెత్తం దెబ్బలు పడాల్సిందే.
మీ స్పందనకి ధన్యవాదాలు.