Skip to main content

Posts

Showing posts from August, 2007

పట్నం కాచిన వెన్నెల

వెన్నెల నవ్వింది - పట్నం లో తనది అడవి కాచిన వెన్నెల అని. వర్షం నవ్వింది - తనని చూసి విసుక్కొనే జనాలని చూసి. పసివాడు నవ్వాడు - train కి టాటా చెప్తుంటే దానికి రెస్పాన్స్ ఇవ్వ లేని మన హుందాతనాన్ని చూసి. లోపలి ఆనందం నవ్వింది - తనని ఎక్కడో బయట వెతుకుతున్నందుకు. మానవత్వం నవ్వింది - పక్కవాడి గురించి తెలీదు గానీ, celebrities ని బాగా పట్టించుకొంటున్నందుకు. పట్నం అనే వేశ్య నవ్వింది - తనది నిజమైన ప్రేమ అనుకొని మోసపోయే మనిషిని చూసి.
నా ప్రేమ ని కుంకుమ చేసి, గుండె భరిణ లో పోసి, నీకు బహుమతి గా ఇచ్చాను. ప్రియతమా !.. నన్ను సింగారించుకోవూ...

కిష్కింధకాండ

కాలేజీ రోజులు... యవ్వనమనే కోతి మన లోకి ప్రవేశించిన రోజులు. స్నేహ మాధుర్యాన్ని తెలిపిన రోజులు. అతివ ఆకర్షణ అనే మధువు రుచి మరిగిన రోజులు. నూనూగు మీసాలు, లేలేత కాంక్షలు, friends గ్యాంగులూ, byke సవారీలు, ప్రేమ వ్యవహారాలు.. అబ్బో!! ఆ రోజులే వేరు లెండి. మాది పల్లెటూర్లో ఒక engg college. మొత్తం ఆరుగురం roommates. ఆరుగురవి విభిన్న మనస్తత్వాలు. అయినా స్నేహం అనే పూమాల లో అందం గా ఒదిగిపోయాము. పల్లెటూరు కనుక చాలా సార్లు సాయంత్రం అయితే power పోయేది. happy గా మేడ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకొనే వాళ్ళము. అక్కడ hot hot topics- అమ్మాయిలే మరి. రాత్రి 12 గం..ల కి birth day parties అప్పుడే అలవడ్డాయి. cake cut చేసి పూసు కొన్నాక ఒకళ్ళ మీద ఒకరు నీరు పోసుకొని స్నానాలు చెయ్యటం భలే గా ఉండేది. serious Indoor cricket matchలు, ప్రపంచం లో అతి ముఖ్యమైన పని ఇదే అన్నట్లుగా 'పేకాటలు' అర్థరాత్రి దాటాక కూడా సాగేవి. పరీక్షలొస్తే, చదివింది తక్కువ... హడావుడి ఎక్కువ. ప్రతీ exam అయ్యాక అందరం వచ్చి, అరుగు మీద కూర్చొని, 'నడిపించు నా నావ నడి సంద్రమున దేవ!', ' పాపులము మేము.. ఓ తండ్రీ!' ... ఇలా ఏసుక్రీస్తు ...