Skip to main content

Posts

Showing posts from September, 2007

నా ప్రపంచం

నా ప్రపంచం వసుధైక కుటుంబం. ఇందులో ప్రకృతి, మనిషి కలసిమెలసి పెరుగుతారు. ప్రతీ ఒక్కరూ తమ individual brilliance తో వెలుగుతారు. ప్రతీ కుటుంబం లో కనీసం రెండు చెట్లు సభ్యులుగా ఉంటాయి. Apartments ఉండవు. పల్లె, పట్నం అని differentiate చెయ్యలేము. అన్నీ సౌకర్యంగా, పచ్చగా ఉంటాయి. ఇక్కడ 'conditioned' relationships ఉండవు. Relationships grow naturally without any conditioning by the society. They enjoy full freedom. చట్టం ప్రకారం, 'పేరెంట్స్' అన్న సంబంధం ఉంటుంది. నిర్ణీత వయసు దాటిన యువతీ, యువకులు మాత్రమే పిల్లల్ని కనగలరు. ఒకసారి పిల్లల్ని కన్నాక, పిల్లలకి 15 ఏళ్లు వచ్చేవరకు విధిగా parenting చెయ్యాలి. ఇంక చదువు విషయానికి వస్తే, Education essentially teaches how to lead a happy life. In my world, Education is not seen as a means of employement. It first teaches values (like Truth, Individuality, Dignity of labour, equality) and then upon it knowledge. It helps free the mind to be its creative, sensitive and entrepreneurial best. ధనిక, పేద, జాతి, కుల, మత,వర్గ విభేధాలు పిల్లల మనసుల్లోకి...

నేనూ, నా frustration, మా మురిపాలు...

ఈ రోజు ప్రశాంతంగా ఉందామని office కి సెలవు పెట్టాను. కానీ ఎక్కడ ప్రశాంతత? 'అందరూ ఏదో ఉపయోగపడే పని చేసేస్తున్నారు. నేనే ఖాళీగా ఉండిపోయాను.' అన్న పురుగు లాంటి ఫీలింగ్ రెగ్యులర్ గా నన్ను interrupt చేస్తూ ఉంది. పోనీ ఆఫీషు కి వెళ్తే బాగుంటామా అంటే అదీ లేదు. ఆఫీషు లోకి అడుగు పెడుతూనే keyboard చప్పుళ్లు, బిజినెస్ మాటలూ స్వాగతిస్తాయి. మనిషి చప్పుళ్లు ఉండవు. ఎవ్వరూ గట్టిగా నవ్వరు కూడానూ. అసలు ఆఫీషే ఒక పెద్ద computer లా అనిపిస్తుంది. అందులో bugs లేని program ఒకటి రొటీన్ గా run అవుతున్నట్లు గా ఉంది. ఆ ప్రదేశం కి వచ్చిన ఒక కుక్కని నేను. మనిషి వాసన కోసము వెదుకుతున్నాను. ఎక్కడా రాదాయె. ఇంక కూర్చొని పని మొదలుపెడుతూనే, నా లోని social psychologist లేస్తాడు. 'అసలు ఈ technology జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పు?' అంటూ క్లాస్ మొదలుపెడతాడు. ఇంక 'apartment culture, మనిషి మరీ narrow అయిపోవడమూ, ఉమ్మడి కుటుంబాలు లేకపోయే కనీసం పిల్లలకి నానమ్మలూ, తాతయ్యాలూ కరువు అవ్వడం, tv లు వచ్చి మనకీ పక్కింటికీ మధ్య దూరాలు పెంచడము, pollution, ... ' ఇలా పక్క రూమ్ లో మేకులు కొడుతున్న కార్పంటర్ లా నా మె...
భావుకతా !... నా అభౌతిక ప్రపంచం లోకి నువ్వు అనుకోని అతిధివి. నీ స్పర్శ తో భావస్పందన లేని నా మనసు శిల సరససామ్రాజ్ని మోహిని గా మారింది. ఇప్పుడు తనకి ఎంతటి సున్నితత్వము, ఎన్ని కేరింతలు, ఏమి లావణ్యము!... నీ కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను. తను నవ్వింది. నువ్వు నా హృదయతంత్రి ని మీటావు.నా గుండె రాగాలు పలికింది. స్నేహం విత్తు మొక్క అయ్యింది. ఆ మొక్కకి 'ప్రేమ' అనే భావం మొగ్గ తొడిగింది. తన స్పర్శ కి నువ్వు అర్థాలు చెప్పావు. పెదవుల ఆట గురించి అడిగితే 'తనకు నువ్వంటే పిచ్చి ఇష్టం' అన్నావు. కౌగిలి దిగ్బంధనాన్ని 'నువ్వు లేకుండా నేనుండలేను' అని తర్జుమా చెప్పావు. ప్రేమ నా హృదయగిరిని దట్టమైన మేఘంలా కమ్మేసింది. ఆ అనుభూతి వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను. కొన్నాళ్ళకి కాలం నా వెర్రితనాన్ని ఆవిష్కరించింది. 'Be spontaneous yaar' అంటూ తను నన్ను విడిచిపోయింది. నా పల్లెటూరి ప్రేమని తన పట్నం ప్రేమ ఎగతాళి చేసిపోయింది. మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను మోసం చేశావు. భయంకరంగా దెబ్బ తీశావు. కక్షతో నిన్ను నా మనసు నుంచి వెలివేద్డామనుకున్నాను. కానీ నువ్వు దుఖంలో కూడా దాగివున్న అందాన్ని చూపించావు. నేన...
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ call చేశాడు. వేరే company కి jump కొట్టాడు అట. Package చాలా బాగుంది. ఆది వినేసరికి, మనస్సు ఒక్కసారి jealousy, inferiority లాంటి వాటితో నిండిపోయింది. నేను సాధారణం గా డబ్బు కి అంత ప్రాధాన్యం ఇవ్వను. కానీ అప్పుడప్పుడు society conditioning నా మీద పని చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేశాను. తలుపు దగ్గరికి వస్తూనే, "శీను మామ!!" అంటూ పిల్లలు నన్ను చుట్టుముట్టేసారు. మా ఇంటికి అక్కలూ, వారి పిల్లలూ వచ్చారు. పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళి, నచ్చినవి కొనిపెట్టి, మేడ మీదకు తీసుకు వెళ్ళి, వాళ్ళని ఆడిపించటం మొదలుపెట్టాను. మెల్లగా నేనూ వాళ్ళతో కలిసిపోయాను... చిన్న పిల్లాడినైపోయి... ఈ తొక్కలో ఇగోలన్నీ వదిలేసి.. అలా చాలా సేపు ఆడుకొని, అలసిపోయాము. అప్పుడు నాకు నేను చాలా తేలికగా, స్వచ్ఛంగా, స్నానం చేసి మురికిని వదిలించుకొని తాజాగా ఉన్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా నా ఫ్రెండు, వాడి package గుర్తుకు వచ్చాయి. మనసు దానిని ఏదో సామాన్య వార్తలా చదివి పక్కన పడేసింది. నేను నిండుగా నవ్వుకున్నాను. ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ ఒత్తిడి తో గుండు చేయించుకు...

నా టింగ్ టింగ్స్

ఈ టింగ్-టింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.. టింగ్-టింగ్ అంటే 'గుండెల్లో బెల్ మోగించిన అమ్మాయి' అన్న మాట. నా first టింగ్ టింగ్ పేరు - 'మీన'. నేను అప్పుడు 5th క్లాస్. నేను, ఆమె కలిసి ఆడుకొనేవాళ్ళము. ఒక రోజు స్కూల్ ముందు ఇసక మీదెక్కి ఆడుకుంటున్నాము. sudden గా తను తూలబోతూ ఉంటే, నేను పట్టుకొని, నేను కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుకుంటూ పడిపోయాము. ఆ వయసు లోనే నాకు ఏదో సినిమా లో హీరొ, హీరొయిన్లు ఇలా slow motion లో పడటం గుర్తుకు వచ్చింది. ఇంక అంతే! మోగింది బెల్. అప్పటి నుంచి తనని ఒక హీరొయిన్ లా నేనొక హీరొ లా ఫీల్ అవుతూ చూసేవాడిని. 6th class లో మా ఇద్దరి స్కూల్స్ మారిపోయాయి. మేము అలా విడిపోయాము. ఆ అమ్మాయి పేరు 'మంజుల'. నేను 10th class. కొత్తగా tution లో join అయ్యాను. ఆ రోజు first day. పొద్దున్నే త్వరగా వచ్చేశాను. చలి కాలం. ఇంక ఎవరూ రాలేదు. అంతలో చిన్నగా కాళ్ళ పట్టీ ల తాలూక మువ్వల చప్పుడు. చాలా rhythemic గా దగ్గరకు వస్తున్నాయి. అందమైన పాదాలు.. సన్నని నడుమును పట్టెసుకున్న మిడ్దీ (మెరూన్ color top, black color skirt) .. తల స్నానం చేసి అలానే వదిలేసిన కురులు.....