Skip to main content
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ call చేశాడు. వేరే
company కి jump కొట్టాడు అట. Package చాలా బాగుంది. ఆది వినేసరికి,
మనస్సు ఒక్కసారి jealousy, inferiority లాంటి వాటితో నిండిపోయింది.
నేను సాధారణం గా డబ్బు కి అంత ప్రాధాన్యం ఇవ్వను. కానీ అప్పుడప్పుడు
society conditioning నా మీద పని చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేశాను.
తలుపు దగ్గరికి వస్తూనే, "శీను మామ!!" అంటూ పిల్లలు నన్ను
చుట్టుముట్టేసారు. మా ఇంటికి అక్కలూ, వారి పిల్లలూ వచ్చారు. పిల్లల్ని
బయటకు తీసుకు వెళ్ళి, నచ్చినవి కొనిపెట్టి, మేడ మీదకు తీసుకు వెళ్ళి,
వాళ్ళని ఆడిపించటం మొదలుపెట్టాను. మెల్లగా నేనూ వాళ్ళతో
కలిసిపోయాను... చిన్న పిల్లాడినైపోయి... ఈ తొక్కలో ఇగోలన్నీ వదిలేసి.. అలా
చాలా సేపు ఆడుకొని, అలసిపోయాము. అప్పుడు నాకు నేను చాలా తేలికగా,
స్వచ్ఛంగా, స్నానం చేసి మురికిని వదిలించుకొని తాజాగా ఉన్నట్లుగా
అనిపించింది. అప్రయత్నంగా నా ఫ్రెండు, వాడి package గుర్తుకు వచ్చాయి.
మనసు దానిని ఏదో సామాన్య వార్తలా చదివి పక్కన పడేసింది.
నేను నిండుగా నవ్వుకున్నాను.


ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ ఒత్తిడి తో గుండు
చేయించుకున్నాను. అసలుకే, చాలా ఎకరాలు పోయాయి. జుత్తు
ఉన్నప్పుడు ఏదోలాగా కొంత కవర్ చేసే వాళ్ళము. ఇప్పుడు జుత్తు
లేకపోయేసరికి, బట్టతల clear గా కనపడుతోంది. ఇంక చిరాకేసి, అద్దము
చూసుకోవడం మానేశాను. ఈ రోజు బస్ లో వస్తున్నప్పుడు నా పక్కన ఓ
ప్రేమ జంట. ఇద్దరూ చిలిపి గా గుసగుసలాడుకొంటున్నారు. వారి కళ్ళలోంచి
ప్రేమ భావము, లేలేత కాంక్షలు ఒలుకుతున్నాయి. రాత్రి పడుకోబోయే
ముందు ఎందుకో ఆ జంట గుర్తుకు వచ్చింది. ఆలోచనలు మనసుని ఎక్కడికో
తీసుకెళ్లాయి. లేచి, diary అందుకొన్నాను. ఏవో కవితలూ ('కవితలు' అని
నేను ఫీల్ అవుతూ ఉంటాను.), పిచ్చపాటీ రాసుకున్నాను. రాయటం
పూర్తయ్యాక ఒకసారి రాసింది చదువుకున్నాను. బాగా అనిపించింది. తృప్తిగా
లేచి ఇటు,అటు పచార్లు చేస్తున్నాను. మనసులో ఇంకా ఆగని భావ పరంపర,
ఏవేవో వూహలు. అలా నడుస్తూ యాదృఛ్ఛికం గా అద్దము వైపు చూశాను.
ఆశ్చర్యం!!. నేను అందం గా కనిపించాను.

Comments