ఇటు మా వ్యాపారం కూడా పుంజుకుంది. మా కంపెనీ ప్రారంభించి అప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది. రాజు, రంగమ్మ ఇద్దరూ అద్భుతంగా పని చేస్తున్నారు. రాజు బయట నుంచి ఆర్డర్‌లు బాగా తీసుకొచ్చేవాడు.అంతకుముందు ఆటపట్టించిన అమ్మాయిలే ఇప్పుడు రాజు పట్ల అభిమానం, గౌరవం చూపిస్తున్నారు. మా ఉత్పత్తులకి ఆదరణ పెరిగి, మంచి పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఇంకా చాలా మంది మహిళలు మాతో కలిసారు. కొందరైతే పొరుగూరు నుంచి కూడా ఇక్కడకి వచ్చి పని చేస్తున్నారు. చిన్నగా ప్రారంభించిన మా కంపెనీ ఎనిమిది నెలలలోనే పదిహేను లక్షల టర్నోవర్‌ని చేరుకుంది. ఒక ప్రముఖ దినపత్రిక మా కంపెనీ గురించి ఆర్టికల్ వేసింది. నా ఫోటో, రంగమ్మ, రాజుల ఫోటోలు కూడా వేసారు. మా ఊరి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసారు. మమల్ని అభినందించటానికి రామ్మూర్తి మామయ్య, అత్తయ్య వచ్చారు. సభలో రాజు ఎందుకో కొంచం నీరసంగా, ఎక్కడో కోల్పోయినట్లుగా అనిపించాడు. నేను, రంగమ్మ మాట్లాడాక రాజుని ప్రసంగించమని అడిగారు. రాజు తడబడుతూ మైకు అందుకున్నాడు. ఒక రెండు నిమిషాలు నోరు పెగల్లేదు. అప్పుడు అర్థమయ్యింది-రాజు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడని. "ఒకప్...