Skip to main content

సాంగత్యపు సౌరభం

ప్రాతః నిశీధి, బంగారు లేత కిరణాలు

నాలోకి నువ్వు.
-----------------------------

రసహీనత, నీ అరనవ్వు

వ్యాధికి సూదిమందు.
-----------------------------

రవి కిరణాన్ని వాన చినుకు అడ్డిన క్షణం, నీ క్రీగంటి చూపు తాకిన క్షణం

నా సృజనకి మరుజన్మం.
-----------------------------

మెడ దిగువున నీ పుట్టుమచ్చ, నా చూపు

బోధి కింద బుద్ధుడు.
-----------------------------

వేసవిలో మల్లెలు విరిసిన సంధ్య, చిన్ని చిన్ని ఆనందాల కేరింతలు

నీ సాంగత్యపు సౌరభం.
-----------------------------

Comments

Purnima said…
బాగున్నట్టే ఉంది. బాగుంది!
@పూర్ణిమ,
భలే చాతుర్యంగా చెప్పారే. స్పందనకి థాంకులు.
మోహన said…
కలిగే స్పందనను అనుభవించటం ఒక ఎత్తైతే దానిని వడిసిపట్టి పదాల్లో పెట్టడం... బాగుంది.
ప్రకృతితో అనునయించి చెప్పటం ఇంకా బాగుంది.