Skip to main content

Posts

Showing posts with the label సాహితి...

బింబాధరాల సరిహద్దున కన్నీటిచుక్క..

This moment is ridiculously painful. I am gasping for you. బాధని చూపించడానికి నా దగ్గర ఏ గుర్తూ లేదు- కళ్ళలో మాటిమాటికీ ముసురుకునే చెమ్మ తప్ప. పరితపించడమన్నది కేవలం హృదయానికే చెందిన భావనలా లేదు.. శరీరంలోని ప్రతీ రేణువూ నిన్ను కోరుకునే విరహాగ్నిలో మండిపోవడానికే ప్రాణం పోసుకుంటున్నాయి. My very existence is nothing but longing you. ఈ ఝాము భారంగా.. అనంతంగా గడుస్తోంది. మరుక్షణానికి ఇతర విషయాలతో కాస్త తేలికపడతానేమో!.. కానీ ఈ క్షణానికీ వేదన నిజమైనది. ఇంత వేదనలోనూ కొన్ని జ్ఞాపకాలు నవ్వు తెప్పిస్తాయి.. నవ్వు ముగుస్తుందనగా నీ లేమి మరింత తీక్షణంగా గుండెని మెలిపెడుతుంది.. నవ్వు తేలకుండానే కళ్ళు జలజలా వర్షిస్తాయి.. ఆ తర్వాత వెక్కుతూ దుఃఖం. ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ. ఇప్పటివరకూ ప్రపంచాన్ని పట్టించుకోనందుకు అది నిన్ను వేరుచేసి ఇలా కసితీర్చుకుంటోంది. విధి ఇంత కాఠిన్యమని నేనూహించలేదు. ఆఖరి కోరికకి కూడా ఆస్కారమివ్వలేదు. కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు ముప్పెరుగొంటాయి. నిన్ను పొందని జీవితాన్ని త్యజించా...

ఉప్పటి జ్ఞాపకం...

అనంత సాగర గర్భాన్ని దాటుకొని తీరానికి పరుగులెత్తిన అలలా ఈ క్షణం కోసమే ఎన్నో బరువైన దాహపు ఝాముల్ని ఈది వచ్చాను. వర్షించే క్షణం కోసమే బతికిన మేఘం వర్షించాక మాయమైనట్టు ఈ క్షణం కోసమే.. ఈ క్షణం లోనే గడిపిన మునుపటి కాలమంతా గమ్మున తన అస్తిత్వాన్ని జారవిడుచుకుంది. నా ఎదురుగా.. సాహితి. * * * * * నిండు గుండె వెంటనే తొణకలేనట్లుగా ఆ స్థానే నిశ్వాసలు అధికమై, పొడి పొడి మాటలు పల్లవించాయి. 'వచ్చేసావా?' 'ఊ!.. నీ పరీక్షలు అయిపోయాయా?' 'ఊ..' ఇద్దరివీ సమాధానం తెలిసిన ప్రశ్నలే. కానీ మనసులు అటూ, ఇటూ ప్రవహించడానికి భౌతికమైన ఏదో సంధి ఏర్పడాలిగా. ఇద్దరం పక్కపక్కన ఇసుకలో కూర్చున్నాం. మేమెప్పుడూ కలిసే ఏకాంత సాగరతీరమిది. కాసేపటికి నా కాళ్ల మీద తలపెట్టుకొని తను.. ఇంకాసేపటికి తన కాళ్లమీద తల పెట్టుకొని నేను. కాలం కరుగుతోంది. మాటల తలంబ్రాలు, స్పర్శలు రేపే నూనూగు కాంక్షల మేళాల నడుమ హృదయాల కళ్లాపులు. నా కళ్లకెదురుగా ఆకాశం.. అవధుల్లేకుండా. పగలు, రాత్రి మాలాగే ప్రేమికులై ఇప్పుడే కలుసుకుంటున్నారేమో. ఆకాశంలో అందమైన సంధ్య ఆవిష్కృతమౌతోంది. తన తోడుగా నా ప్రపంచం ఇప్పుడింత అందంగా ఉందన్న విషయం ఒక్కసారిగా అ...

పరవశం

రాత్రి ఒంటిగంట. గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది. చంద్రుడు చుక్కలతో దొంగాట ఆడుతూ మా పెరటి చెట్టు వెనక్కి నక్కాడు. నేను సబ్దం చెయ్యకుండా పెరటి తలుపు తీసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడెక్కాను. మా మేడని ఆనుకొని ఉన్న ఇంకొక రెండు మేడలని దాటేసరికి సాహితి వాళ్ల మేడ వచ్చేసింది. తను ఇంకా రాలేదు. గత కొన్ని రోజులుగా మేమిలాగే కలుసుకుంటున్నాము. కలిసి చేసేది కూడా ఏమీ లేదు. మనసులని కాసిన్ని కబుర్లతో ఆరబోసుకుంటాము. కొన్ని నవ్వులు విచ్చుకుంటాయి. ఈ కేరింతల నడుమనే కలహాలు కూడా మొదలవుతాయి. ఇక మూతి విరుపులు.. కోర చూపుల బాణాలు.. అరనిమిషపు అలకలు. గుండెల్లోని తొలిప్రేమ భావాలు, ఆకర్షణ, మైకం, పద్దెనిమిదేళ్ళ ప్రాయపు ఉద్విగ్నత ఇవన్నీ కలిసి అందంగా బయటపడాలని ప్రయత్నించి , విఫలమయ్యి ఇలా సిల్లీ కబుర్లు, అర్థం లేని తగాదాలుగా మారిపోతాయి. అయితేనేం.. మనసు కన్వే చెయ్యాలనుకున్నది అండర్ కరెంటు గా కన్వే అయిపోతుంది. తను వచ్చి చూస్తే వెంటనే కనపడకూడదని వాళ్ల మేడని, పక్క మేడని కలిపే పిట్టగోడ వెనక దాగున్నాను. ప్రపంచమంతా నిద్దురపోతోంది. అప్పుడప్పుడూ విసురుగా వచ్చే గాలి దగ్గర్లోన...

వెన్నెల సంగీతం

వెన్నెల రేయి.. సన్నని దారి.. దారికిరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు.. గాఢాంధకారం. కానీ దారిన మాత్రం చెట్లకొమ్మలు వడకాచిన వెన్నెల వెలుగు.. ఎంత బాగుందో!!. ఆ దారిలో సాహితీ, నేనూ నడుస్తున్నాము. ఒకరంటే ఒకరికి ఇష్టమని ఇద్దరికీ తెలుసు (గుండెల్లోని ప్రేమని కన్నులు ఒలికిస్తాయి కదా!.). కానీ మాటల్లో ఇంకా చెప్పుకోలేదు. చల్లగాలి ఇద్దర్నీ హత్తుకుంటోంది. పక్కన నడుస్తుంటే, తన జడను సింగారించిన సన్నజాజుల పరిమళం నన్ను అప్పుడప్పుడూ కమ్మేస్తుంది. నడకను అనుసరించి తన చెవి జూకాలు కదులుతున్నాయి. కాళ్ల పట్టీలకున్న చెరొక సిరిమువ్వ లయబద్ధంగా ‘ఘల్’మంటోంది. ఇంత ఏకాంత ప్రదేశంలో మేమిద్దరమే ఉన్నామన్న ఆలోచన రాగానే, ఏవేవో ఊహలు నా మనసుతో బంతాడుకున్నాయి. నడుస్తూ ఏటి వద్దకు వచ్చేసాము. ఇప్పుడు పడవ మీద అవతలి వైపుకి వెళ్తే అదే మా ఊరు. జాతరకని ఇక్కడకి వచ్చాము. అందరూ బస్‌లో ఊరికి వెళ్తామంటే మేమిద్దరమూ పడవలో వస్తామని ఇలా వచ్చాము. పడవ వచ్చేసరికి ఇంకొక అరగంట పడుతుంది. వెన్నెల మబ్బుల వలువలు విడిచి ఏరంతా పరుచుకుంది. ఒడ్డున నీళ్లలో కాళ్లు పెట్టుకొని కూచున్నాము. తను నీళ్లలో పాదాలు ఆడిస్తోంది..అందమైన లేత పాదాలు.. వాటిని చూస్తూ దగ్గరి...

సాహితి - తొలిపరిచయము

ఈ మధ్యన నా బ్లాగు నేనే సాంతం చదువుకున్నాను. ఎందుకో అంతగా నచ్చలేదు. పెద్ద స్కూలు బ్యాగు మోసుకొని, ఇసకలొ ఆడుకొని, చింపిరి జుట్టు, చీముడి ముక్కుతో స్కూలు నుంచి వచ్చిన పాపలా అనిపించింది. నా పాపకి నలుగు పెట్టి, కుంకుడికాయ రసం తో తలంటు పోసి, పట్టు లంగాజాకెట్టు వేసి ముస్తాబు చెయ్యాలి అనిపించింది. ఆ ప్రయత్నమే - ఈ 'సాహితి' సృష్టి. .... ఆ రోజు కార్తీక ఏకాదశి. Engg. course లో ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నిన్ననే ఇంటికి వచ్చాను. అమ్మ పొద్దున్న 5 గం.ల కే గుడికి వెళ్ళడానికి నిద్ర లేపేసింది. బయట చలి, లావుపాటి కంబలి లో కమ్మని వెచ్చదనం, పక్కన పడుకున్న నాన్న మీద చెయ్యి వేసుకుంటే నాన్న బొజ్జ రిథమిక్ గా శ్వాసని అనుసరించి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ఇలాంటి ambience ని వదిలిలేవడానికి అస్సలు మనసు రాలేదు. 'ఇంకొక 5 నిమిషాలు అమ్మా!' అంటూ మళ్లీ ముసుగుతన్నాను. కాసేపటికి మా చెల్లి మెల్లగా దుప్పటి ముఖం మీద నుంచి తీసి చల్లని తడి చెయ్యి నా ముఖం మీద పెట్టింది. నేను దిగ్గున లేచాను. తాను పరిగెత్తిన్ది. ఇంక తప్పదన్నట్లు లేచి టూత్ బ్రష్ అందుకున్నాను. చలిలో వేన్నీళ్ళ స్నానం భలే ఉంది. ... అమ్మ, నేన...