Skip to main content

పరవశం

రాత్రి ఒంటిగంట. గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది. చంద్రుడు చుక్కలతో దొంగాట ఆడుతూ మా పెరటి చెట్టు వెనక్కి నక్కాడు. నేను సబ్దం చెయ్యకుండా పెరటి తలుపు తీసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడెక్కాను. మా మేడని ఆనుకొని ఉన్న ఇంకొక రెండు మేడలని దాటేసరికి సాహితి వాళ్ల మేడ వచ్చేసింది. తను ఇంకా రాలేదు. గత కొన్ని రోజులుగా మేమిలాగే కలుసుకుంటున్నాము. కలిసి చేసేది కూడా ఏమీ లేదు. మనసులని కాసిన్ని కబుర్లతో ఆరబోసుకుంటాము. కొన్ని నవ్వులు విచ్చుకుంటాయి. ఈ కేరింతల నడుమనే కలహాలు కూడా మొదలవుతాయి. ఇక మూతి విరుపులు.. కోర చూపుల బాణాలు.. అరనిమిషపు అలకలు. గుండెల్లోని తొలిప్రేమ భావాలు, ఆకర్షణ, మైకం, పద్దెనిమిదేళ్ళ ప్రాయపు ఉద్విగ్నత ఇవన్నీ కలిసి అందంగా బయటపడాలని ప్రయత్నించి , విఫలమయ్యి ఇలా సిల్లీ కబుర్లు, అర్థం లేని తగాదాలుగా మారిపోతాయి. అయితేనేం.. మనసు కన్వే చెయ్యాలనుకున్నది అండర్ కరెంటు గా కన్వే అయిపోతుంది. తను వచ్చి చూస్తే వెంటనే కనపడకూడదని వాళ్ల మేడని, పక్క మేడని కలిపే పిట్టగోడ వెనక దాగున్నాను. ప్రపంచమంతా నిద్దురపోతోంది. అప్పుడప్పుడూ విసురుగా వచ్చే గాలి దగ్గర్లోని కొబ్బరి చెట్టు ఆకుల్లోకి దూరి ఒక వింత శబ్దం చేస్తుంది. ఇంతలోనే సన్నగా ఓ సిరిమువ్వ ఘల్ మంటూ నా చెవిన పడింది. తను చప్పుడు చెయ్యకుండా వద్దామని ప్రయత్నిస్తున్నా తన పట్టీల కున్న నా ఫేవరేట్ సిరిమువ్వ నాకు సిగ్నల్ ఇస్తూ ఉంది. తను నేనున్న దగ్గరికి వచ్చింది. నేను కనపడకుండా గోడ వెనక కదలకుండా అలాగే కూర్చున్నాను. ఒక్క క్షణం రెండువైపులా నిశ్శబ్దం. ఇంతలొ ఒక్కసారిగా తన కురులు నా ముఖాన్ని కప్పేసాయి. వెనుకగా తన నవ్వు .. సన్నగా.. తెరలు..తెరలుగా. ఆమె రెండు చేతులు నా రెండు చెక్కిళ్ళను పట్టేసాయి. అలా తన కురులు నన్ను కమ్మేస్తూ ఉంటే.. ఎంత బాగుందో.. లేచి మాట్లాడుకున్నాం. పరికించి చూస్తే .. రెండు ఆత్మలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి గాల్లో చెట్టపట్టాలు వేసుకుని కనపడతాయి. అవి ఏంటి మాట్లాడుతున్నాయని చెవి పెట్టారనుకోండి .. మౌనం లోనుంచి ఓ మోహనరాగం విశ్వజనీనమై మిమ్మల్ని పలకరిస్తుంది.

టైము గాడు బండిని సర్రున లాగించేసాడు. జెలసీ ఫెలో. మేము వెళ్ళిపోవాల్సిన టైము వచ్చేసింది. లేచి నిల్చున్నాం. నేను సాయంత్రం రాజాం వెళ్ళిపోతున్నానని చెప్పా. నేను వేరే ఊర్లో(రాజాం లో) ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెలవులకని ఇంటికి వచ్చా. మళ్ళీ బయల్దేరాలి. తను నా కళ్ళలోకి చూసింది. దగ్గరగా వచ్చింది. ఇంకా దగ్గరగా వచ్చి కౌగిలించుకుంది. ప్రియురాలి మొదటి కౌగిలింత. ఫస్ట్ భయమేసింది. మెల్లగా కళ్లు మూసుకున్నాను. భయం కొంచం తగ్గింది. నా చేతులను తన చుట్టూ వేసాను. భయం మాయమయ్యింది. తన చెక్కిలికి నా చెక్కిలి చేర్చాను. అంతే.. ఆ క్షణం అనంతమయ్యింది. ఒక్క అనుభూతి సౌందర్యం తప్ప మరేమీ లేదు. 'నేను' అన్న ఉనికి కూడా లేదు. గురుత్వాకర్షణ ప్రభావం కోల్పోయి లైట్ గా అయిపోయాను. క్షణం కరిగింది. కౌగిలి విడింది. ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోయాం.

సౌందర్యం క్షణికమే కావచ్చు.. కానీ క్షణం సత్యమ కదా!.

Comments

Purnima said…
మొదటి లైన్లు చదవగానే.. కవిత్వంతో కూడిన వచనం చదువుతున్నాను అనుకున్నాను.. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి.

టైము గాడు బండిని సర్రున లాగించేసాడు. జెలసీ ఫెలో!! యస్స్.. హె ఇస్స్... జెలసీ ఫెలో!! ;-)

నాకయితే విపరీతంగా నచ్చింది. మీ అక్షరాలు నన్ను సున్నితంగా తాకాయి.. ఇంకా చదువుతాను. క్షణం సత్యం.. కదా?? :-)
@poornima
Thanks. u r one of my fav writers.
kalpa latika said…
"గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది."
anna mee modati vaakyam naa madilo odigina brundaavanilo venugaanam mroginchindi.
chaalabaagundi mee kadha.kadhanam kuda chakkaga saagindi.
chaduvutunna kaasepu nayika naenayyana anipinchindi.
meerupayoginchae upamaanalu sammohanaa raagalu palikistunnayantae nammutaara.
nijam srinivas gaaru,manasuna mudipadina konni melakuvalanu tatti nidura lepaaru.
@kalpa latika,

నా టపా మిమ్మల్ని అలరించినందుకు చాలా సంతోషం. మీ అందమైన తెలుగుని ఇంగ్లీషు లెటర్స్ లో కాకుండా తెలుగు అక్షరాల్లో చదివితే మరింత బావుంటుంది. స్పందనకి ధన్యవాదాలు.
kalpa latika said…
kshaminchaali.ee block lo telugu asksharaalu yelaa vastayo teliyaka satamatamayyanu.andukae tappaka aanglam lo pettanu.veelaitae daari choopagalaru
@kalpa latika,
నేను mozilla firefox లోని indict add-on ని ఉపయోగించి బ్రౌజర్స్ లో తెలుగు రాస్తాను. అంతకు ముందు Surya's mana telugu అనే free application ని download చేసుకొని ఆ ఎడిటర్ లో రాసి copy-paste చేసేవాడిని. ఈ information మీకు ఉపయోగపడుతుందేమో చూడండి.
కల్ప లతిక గారు,
ఈ లింకుని firefox browser లో ఓపెన్ చెయ్యండి.
https://addons.mozilla.org/en-US/firefox/search?q=Indic&cat=all

ఇందులో Indic Input Extension ని add to firefox ద్వారా add చేసుకోండి. ఓసారి browser ని close చేసి ఓపెన్ చేయండి. ctrl + spacebar నొక్కడం ద్వారా మీరు browser లో తెలుగు అక్షరాలని టైపు చేసుకోవచ్చు. మళ్లీ ఇంగ్లీషుకి మారాలంటే ఇంకోసారి ctrl + spacebar ని నొక్కితే చాలు.
Anonymous said…
చాలా బాగా రాస్తునారు..
SAI said…
బాగుంది నైస్ ఫీల్
చదివినంత సేపు అదో మైకంలాంటి భావన
SAI said…
బాగుంది నైస్ ఫీల్
చదివినంత సేపు అదో మైకంలాంటి భావన
@SAI గారు,
నా టపా మీకు నచ్చినందుకు ఎంతో సంతోషం!. మీ స్పందనకి ధన్యవాదాలు.