Skip to main content

Posts

Showing posts with the label Inner Dimensions

Inner Dimensions: 'She' speaks..

మేఘంలా నేనెప్పుడూ కరిగిపోతానో నాకే తెలియదు. ప్రాతహ్ నిశీధిలో ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?.. వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే. దారిలో ఎవరో పాదాల కింద నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది. కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఖం కూడా కలగదు. రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది. నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి. నాకు సముద్రమంత ప్రేమ కావాలి.. చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను. కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే. వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను. విఫలమయ్యాక ఒంటరినయ్యాను. విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎ...

Inner Dimensions: The wife speaks..

పైశాచిక ఆనందమంటే ఏమిటో నాకిప్పుడే.. దానిని అనుభవిస్తుంటే అర్ధమౌతోంది... త్వరలో అతన్ని మానసికంగా హింసించబోతున్నాను. నా భర్త పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం నేనీమధ్యనే రహస్యంగా కనిపెట్టాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తుంటే.. ఇన్నాళ్ళకి ఓ తప్పుకి దొరికాడు. దీనిని ఎత్తి చూపిస్తూ రేపటి నుండీ అతన్ని ఎంతలా టార్చర్ పెట్టబోతున్నానో తలచుకుంటుంటే ఓ రాక్షస తృప్తి కలుగుతోంది. ఎందుకిలా ఉద్వేగంతో ఊగిపోతున్నాను?.. నేను నిజంగా ఈ విషయానికి ఆనందపడుతున్నానా?.. అతను నన్ను మోసగించాడ న్న బాధ నాకేమాత్రమూ లేదా?.. నిజం చెప్పాలంటే.. మోసగింపబడ్డానన్న బాధ తాలూక స్పృహ అయితే ఇప్పటివరకూ కలుగలేదు . కానీ ఓ మనసు మాత్రం తాను ఆరాధించిన విలువల మేరు శిఖరం కూలిపోయిన విషయాన్ని వెంటనే అంగీకరించలేక, తన ఆత్మ గౌరవాన్ని శిధిలాల్లో వెతుకుతూ కుమిలిపోతోంది . ఈ బాధే లేకుంటే నా ఆనందం ' పైశాచికం' ఎలా అవుతుంది ?.. బాధతో కూడిన ఆనందం వలన వచ్చిన శాడిజం ఇది . హ హ !!.. Its sheer 'hatred'. అతన్ని ఎందుకు అంతలా ద్వేషిస్తానో నాకు తెలియదు. కారణాలు వెతకను కూడా. వెతకలేని నా అశక్తత బయటపడి...

Inner Dimensions: The businessman speaks..

రాత్రి ఒంటిగంటన్నర. నిద్ర రావట్లేదు. చలికాలం కావడం చేత ట్రైన్ లో అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు. ఇంకొన్ని గంటల్లో తనని కలవబోతున్నాను. మనసులో ఏదో హుషారు ఈల. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఓ చిల్లర వ్యాపారి టీ కంటైనర్ ని పక్కన పెట్టుకొని బెంచి మీద కునుకు తీస్తున్నాడు. టీ తాగాలనిపించింది. ట్రైన్ దిగి వాడిని లేపి టీ అడిగాను. టీ ఇచ్చి ఎప్పటిలాగే నాలుగు రూపాయలు తీసుకున్నాడు. 'ఇంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని సెర్వ్ చేస్తున్నాడు. extra చార్జ్ చెయ్యొచ్చు కదా.' అనుకున్నాను. నేను స్వతహాగా business man ని కావడంతో ఇలాగే ఆలోచిస్తాను. అతను ఎక్కువ చార్జ్ చేసుంటే అతనిమీద గర్వపడేవాడిని. ఒక సిగరెట్ కూడా తీసుకున్నాను. నాకు సిగరెట్ అలవాటు కాదు. అప్పుడప్పుడూ తీసుకుంటాను. materialistic things కి గానీ, మానవ బంధాలకి గానీ బానిసవడం, నన్ను నేను కోల్పోవడం నాకు నచ్చవు. ప్రశాంతమైన ఈ అర్థరాత్రి పూట చలిగాలిలో ఛాయ్ తాగుతూ దమ్ము లాగుతుంటే బాగుంది. I fucking loved this moment. స్టేషన్లో దూరంగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బయటవాళ్లెవరికీ నేను సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నా ముఖంలో ఎటువంటి భావాలూ...