పైశాచిక ఆనందమంటే ఏమిటో నాకిప్పుడే.. దానిని అనుభవిస్తుంటే అర్ధమౌతోంది... త్వరలో అతన్ని మానసికంగా హింసించబోతున్నాను. నా భర్త పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం నేనీమధ్యనే రహస్యంగా కనిపెట్టాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తుంటే.. ఇన్నాళ్ళకి ఓ తప్పుకి దొరికాడు. దీనిని ఎత్తి చూపిస్తూ రేపటి నుండీ అతన్ని ఎంతలా టార్చర్ పెట్టబోతున్నానో తలచుకుంటుంటే ఓ రాక్షస తృప్తి కలుగుతోంది.
ఎందుకిలా ఉద్వేగంతో ఊగిపోతున్నాను?.. నేను నిజంగా ఈ విషయానికి ఆనందపడుతున్నానా?.. అతను నన్ను మోసగించాడన్న బాధ నాకేమాత్రమూ లేదా?..
నిజం చెప్పాలంటే.. మోసగింపబడ్డానన్న బాధ తాలూక స్పృహ అయితే ఇప్పటివరకూ కలుగలేదు. కానీ ఓ మనసు మాత్రం తాను ఆరాధించిన విలువల మేరుశిఖరం కూలిపోయిన విషయాన్ని వెంటనే అంగీకరించలేక, తన ఆత్మగౌరవాన్ని శిధిలాల్లో వెతుకుతూ కుమిలిపోతోంది. ఈ బాధే లేకుంటే నా ఆనందం 'పైశాచికం' ఎలా అవుతుంది?.. బాధతో కూడిన ఆనందం వలన వచ్చిన శాడిజం ఇది. హ హ !!..
Its sheer 'hatred'. అతన్ని ఎందుకు అంతలా ద్వేషిస్తానో నాకు తెలియదు. కారణాలు వెతకను కూడా. వెతకలేని నా అశక్తత బయటపడిపోతే నేను భరించలేను. వంటగదిలో చాకుని చూసిన ప్రతీసారీ I feel like hurting myself. చాకు ఎడమచేయి చర్మాన్ని లోతుగా కోస్తుంటే, ఆ బాధతీవ్రత నా ద్వేషాన్ని అధిగమించిన కొన్ని క్షణాల పలాయనం కోసం హాయిగా కోసుకోవచ్చు కూడా. కానీ ఇది నన్ను మరింత మూర్ఖంగా చూపిస్తుందని నన్ను నేను సంభాళించుకుంటాను.
తీక్షణమైన తృణీకారభావమేదో అతని సమక్షంలో నన్ను కాల్చేస్తూ ఉంటుంది. నిజానికి అతను ఎటువంటి తృణీకారభావాన్నీ చూపించడు. 'నువ్వు తప్పు' అని నేను చెప్పడానికి వచ్చిన ప్రతీసారీ నేను చెప్పేదీ వింటున్నట్టే.. నా భావాల్ని గౌరవిస్తున్నట్టే కనపడతాడు. కానీ నాకుమాత్రం అతని రీజనింగ్ ముఖం మీద చాచి లెంపకాయ కొట్టినట్టే అనిపిస్తుంది. లెంపకాయే చాలా సున్నితమేమో!.
పెళ్లికి ముందు నాకతనంటే హీరో-వర్షిప్. Future technologies మీద ఇన్వెస్టర్లకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటుచేసిన ఓ సెమినార్లో నేను అతన్ని మొదటిసారిగా కలిసాను. ఇందులో ప్రసంగించడానికి అతను వక్తగా వచ్చాడు. మా CEO నాకు అందరితో పాటు అతన్నీ పరిచయం చేసాడు. ఒక అనాధ బాలుడి స్థాయి నుండి ప్రముఖ చిప్ మాన్యుఫేక్చరింగ్ కంపెనీ అధినేతగా ఎదిగిన అతని సక్సెస్ స్టోరీని నేనిదివరకే చదివాను. ఎదుటివారి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడీ మనిషి. ఎదుటివారిలోని కల్మషం లేని మానవస్ఫూర్తిని పలకరించడానికి వెతుకుతున్నట్లుగా ఉంటుంది అతని చూపు. మామూలుకన్నా ఓ రెండు క్షణాలు ఎక్కువగా మా చూపులు కలిసి వీడాయి. తరువాత ప్రసంగాలు మొదలయ్యాయి. అతని ప్రసంగం క్లుప్తంగా.. ఓ focused strategy తో సాగింది. But the words used, the visuals presented and the thoughts projected were very radical in sense. అతని తర్వాత వచ్చిన వ్యక్తి ప్రసంగం వినడానికి మెదడు కొంచం టైం తీసుకొంది. లంచ్ టైంలో ఇద్దరం ఆక్సిడెంటల్ గా పక్కపక్కన కూర్చున్నాం. 'Your talk is quite outstanding.'- కితాబిచ్చాను. కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు. కాసేపటికి తలెత్తి చూస్తే అతను నన్ను దీక్షగా చూస్తున్నాడు. 'మీరు చాలా అందంగా ఉన్నారు.' - నాకిచ్చిన మొదటి కాంప్లిమెంట్. సిగ్గు గుప్పుమంది. ఆ రోజు కొన్ని గంటలపాటు ఏవో ఆదర్శాల గురించో, ఆశయాల గురించో మాట్లాడుకున్నాం.
'సత్యం పలుకవలెను.' అన్న ఆదర్శం గురించి మాట్లాడుకోవడం బానే ఉంటుంది.. కానీ దానిని నిజంగా ఆచరించేవారిని చూస్తే.. 'ridiculous!!' అనిపిస్తుంది. పెళ్లయ్యాక అతని గురించి నాకలాగే అనిపించింది. అలాగని అతను సమాజం నిర్దేశించిన ఆదర్శాలని పట్టించుకునే టైప్ కాదు. ఎదుగుతున్న క్రమంలో తాను పరిశీలించి, విశ్వసించిన ఆదర్శాలనే పాటిస్తాడు. పాటించడమేమిటి.. ఆ ఆదర్శాలే అతను. సమాజంలో పదిమందితో మెలిగే తీరు, కనీస మర్యాద ఇవేవీ మనోడికి తెలియవు. తనకి నచ్చని లేదా ఇబ్బంది కలిగించే ఏ పనీ.. అది ఎంత చిన్నదైనా చెయ్యడు. ఊరకనే లాభాన్ని ఆశించడు.. తీసుకోడు. He is totally insane. A little hypocrisy, adjustment, manipulation.. ఇవి లేని మనిషి మనిషే కాడు.
పెళ్లయిన కొత్తలో అతను పెట్టబోయే కొత్త ప్లాంట్ కోసం ఇద్దరమూ కలిసి వర్క్ చేసాము. ఆ టైంలో రోజులెలా గడిచాయో తెలియలేదు. అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకించి పని చేస్తున్నట్టుగా అనిపించదు.. It was as if we both were instrumental in a greater spirit. ఇంతలో తనకి సడన్ గా వేరే ప్రాజెక్ట్ రావడంతో ప్లాంట్ కి సంబంధించిన మిగిలిన మేనేజిరియల్ పనులని నాకొదిలేసి క్లైంట్ లొకేషన్ కి మూవ్ అయ్యాడు. రెండు నెలల తర్వాత అతను వచ్చిన మొదటిరోజునే నన్ను టెర్మినేట్ చేసేసాడు. 'You dont suit our work culture.' - ఈ ఒక్క స్టేట్మెంటే అతను నాకిచ్చిన explanation. టెర్మినేషన్ ని భరించగలిగానేమో కానీ ఆ తర్వాత అతను ఏమీ జరగనట్టు, ఎటువంటి గిల్టీ ఫీలింగులూ లేకుండా నాతో ఎప్పటిలా ఉండటాన్ని మాత్రం అస్సలు భరించలేకపోయాను.
నాకు లోలోపల ఒకటే కోరిక - అతను కృంగిపోతుంటే, బాధపడుతుంటే చూడాలి. మొదట్లో ఈ విషయాన్ని నేనే ఒప్పుకోలేకపోయాను. కానీ క్రమంగా ఆ కోరికే నా అస్తిత్వమయ్యింది. అతన్ని దెబ్బతీయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తునే ఉన్నాను. తద్వారా అతనికో పాఠం నేర్పించాలి. అసలు అందుకు కూడా కాదు.. నన్ను నేను సమర్ధించుకోవడానికి అతను ఫెయిలవ్వాలి. కానీ ఒక పని తాలూకా ఫలితమెప్పుడూ అతన్ని కృంగదీయదు. తనవంతుగా 'పూర్తి ప్రయత్నం చేసానా..' అన్నదే అతని concern. So, ఫలితాన్ని ప్రభావితం చెయ్యడం ద్వారా అతన్ని దెబ్బతీయలేం. పోనీ చేతులు, కాళ్లూ, నోరూ తీసేస్తే.. Damn him!.. I cant control his mind.
నిద్రమాత్రల సీసాని రెడీగా పెట్టుకున్నాను. వచ్చాక అతని భాగోతం నాకు తెలిసిపోయిన విషయాన్ని బయటపెట్టి, సూటిపోటి మాటలాడి, వీటిని మింగేయడానికి- just to see him broke with guilt. అతనొచ్చాడు. wardrobe దగ్గరనుండి తన ఈల సన్నగా వినబడుతోంది. నేనున్న గదిలోకి వచ్చాడు. 'హాయ్..' అంటూ నా భుజం మీద చేయి వేసి పక్కన కూర్చున్నాడు. నా ఊపిరి వణుకుతోంది. 'ఏంటి!.. ఒళ్లు కాలుతోంది.. ఒంట్లో బాలేదా?..' అంటూ కొంచం వడిగా నా నుదిటి మీద, మెడ మీద అరచేతిని పెట్టి చూస్తున్నాడు. నేను తలెత్తి చూసాను. అతని కళ్ళలో నా పట్ల concern కనపడింది. ఎటువంటి అపరాధభావమూ లేదు. గొంతులోనూ, చేతి స్పర్శలోనూ మార్ధవముంది. 'ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతీసారీ మీరు కొత్తగా, ఫ్రెష్ గా కనపడతారు. ఏదో తెలియని మార్దవం కనపడుతుంది.' అనుకున్నట్టే మొదలెట్టాను గానీ అంతలోనే డీవియేట్ అవ్వడాన్ని గ్రహించాను. ప్రతిగా కళ్ళలో చిన్న ఆశ్చర్యంతో మనస్పూర్తిగా నవ్వాడు. అతని సమక్షంలో అప్రయత్నంగా నాలో పూర్తి వైరుధ్య భావాలు ఆక్రమణ చేసాయి. ఎందుకు ఇంతలా అతన్ని హింసిస్తున్నానని ఓ క్షణానికి అనిపించింది. వేరొకరి దగ్గరైనా స్వాంతన పొందుతున్నాడని momentarily I felt happy for him. నాకు నేనే క్రూరంగా కనిపించాను. ఈరోజతన్ని హింసించలేను అని అర్ధమైపోతుంది. మరోవైపు లోలోపల ఏదో బాధ తన్నుకొస్తోంది. అతని ముందు బయటపడడం ఇష్టం లేక లేచి, వడిగా నా రూమువైపు అడుగులేసాను. 'డాక్టర్ ని పిలవనా?..' అని అతనేదో అడుగుతున్నాడు. 'అవసరం లేదు. crocin వేసుకుంటే సరిపోతుంద'ని ముక్తసరిగా సమాధానమిచ్చి రూంలోకి వెళ్లి, బెడ్ మీద పడిపోయాను. కళ్ళ నుండి నీటి ధార ఆగట్లేదు. అలా ఎంతసేపయ్యిందో. లేచి ముఖం కడుక్కున్నాను.
ఈరోజు తప్పించుకున్నావు. See you tomorrow Mr. Businessman.
Comments
ఫ్రేం కట్టి పెట్టుకోదగ్గ లైన్లు ఉన్నాయి ఈ టపాలో.. Good work. btw - be careful about copyrights. You are intruding to the core of psychic trauma of people ;)
>>చదువుతున్నంత సేపు, ఆవిడ నిష్టూరంలో నాకు అతడి పై ప్రేమే కనిపిస్తోంది!!
ప్రేమ కన్నా గౌరవమే ఎక్కువనుకుంటా.
ఈ టపాని నేను ఊహించినంతగా పదాల్లో పెట్టలేకపోయాను. అయినా మీకు నచ్చినందుకు సంతోషం. ఇక కాపీరైట్స్ అంటారా.. అంత ఆలోచించలేదు. ప్రస్తుతానికి అంత భయం లేదు కూడా.
Thank you.
atanu tananu mosam chaesaadani telisinaa aa paremanu kaavaalanukuntondi kaabatte kada ivaaltakainaa aagindi.
sadism vishayaanikostae manaloni raendo manishi alaa maatladistoo untaadu.
yedi yenmainaa "కానీ ఓ మనసు మాత్రం తాను ఆరాధించిన విలువల మేరుశిఖరం కూలిపోయిన విషయాన్ని వెంటనే అంగీకరించలేక, తన ఆత్మగౌరవాన్ని శిధిలాల్లో వెతుకుతూ కుమిలిపోతోంది." anna maatalu malli malli chadavaalani pistondi.
deniki continution undanae anukuntunnanu......
aame kshamani, preemani enta chakkaga varimcharoo allne moosom cheesina atani vyaktitwaanni kuda adbhutamga varnimchaare...
paatakulaku aa ammayi meeda jaalitopaatu atanimeeda kudaa soft corner undeelaa vraasaaru entainaa meeru magavaaree kadaa
May be you couldn't identify with the character or I might not wrote convincing enough.
@Kalpa latika,
ఆ వాక్యం రాసాక నాకు కూడా బాగా నచ్చిందండి. కొన్ని మార్లు నెమరువేసుకున్నాను కూడా. Inner Dimensions లో ఉన్న మూడు కారెక్టర్లూ తమ గొంతుని వినిపిస్తాయి. ఆల్రెడీ రెండు గొంతులు టపాకెక్కించాను. ఇక్కడ business man version ని చదవచ్చు.
http://swatichinuku.blogspot.com/2008/12/blog-post.html
ఇక మూడవ కారెక్టర్ వెర్షన్ ని వీలు కుదిరినప్పుడు రాస్తాను.
@ వాత్సవి,
మగ, ఆడ వంటి biasing లేకుండా రాసానండి (మీరెంత మాట అనేసారు!! :().
కారెక్టర్ని బట్టి అలా రాయడం జరిగింది. మగాడ్ని క్రూరంగా చూపగలిగితే ఇది చాలా మామూలుగా ఉండేది. ఈ టపాలోని కారెక్టర్లు నిజంగా real life లో కనపడరు. మనలోని కొన్ని కోణాలనే కారెక్టర్లుగా చేసి రాయాలని నా ఉద్దేశ్యం. అందుకే దీనికి Inner Dimensions ఆని పేరు పెట్టాను. ఎటువంటి 'social conditioning' లేకుండా నచ్చినట్టుగా ఉంటూ, నచ్చిన పని చేస్తూ ఉండాలనుకునే human spirit కి Business man రూపాన్నిచ్చాను. social conditioning, manipulative behavior ఇవన్నీ అతని భార్యగా మారాయి. అందుకే భార్యకి అతనంటే తీవ్రమైన ద్వేషం at the same time ఎనలేని గౌరవం కూడా.
థాంక్స్.
@నిషిగంధ,
స్పందన కి ధన్యవాదాలు. రచయితగా నా ఉద్దేశ్యంలో.. ఆమె అతనిలా మారలేదు. అది తనకీ తెలుసు. ఆమెకి 'అతని దృష్టిలో తను పెర్ఫక్షనిస్ట్ కావాల'న్న తాపత్రయం కన్నా 'నాలా ఉంటేనే సమాజం ఆమోదిస్తుంది. ఇలా అయితేనే నెగ్గుకురాగలం..' అని తను అతనికి ప్రూవ్ చెయ్యాలన్న కోరిక తీవ్రంగా ఉంటుంది. కానీ 'సంతోషం, బాధ, విజయం..' వంటివన్నీ వ్యక్తిగతమైనవనీ, వీటికి సమాజంతో పని లేదన్నది businessman ఫిలాసఫీ. దీనిని ఆమె అంగీకరించకపోయినా ఇందులోని సత్యపు స్పృహ ఆమెకి తెలుసు. అందుకే ఆమెకి అతనంటే ద్వేషమూ, గౌరవమూనూ.
క్షమించండి, వేచి ఉండలేని ఈ అసహనానికి కారణం మీ అక్షరాలు చేసే మాయో,వేసే మంత్రమో కారణం :-)
>>Businessman మాట్లాడిన సంవత్సరానికి భార్య పెదవి విప్పింది.
:). మీరిలా చనువుగా అడగడం నచ్చింది. మూడో కారెక్టర్ ని త్వరగా మాట్లాడించేందుకు ప్రయత్నం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@నిషిగంధ,
మీరు మోస్ట్ వెల్కమ్ అండి.
@కొత్తపాళీ,
మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు. మొదట్లో త్వరగా ప్లాట్ ని రివీల్ చేసే ఉద్దేశ్యంతో అలా రాసాను. మీరు చెప్పాకనే గమనించగలిగాను. కృతజ్ఞతలు.