Skip to main content

Posts

లలిత ప్రియ కమలం - నా సరస్వతి

నీవు భావస్పందనల హృదయరాగానివి. కనులు మూసినంతనే ఊహల వినీలాకాశంలోంచి ధవళవస్త్రాలతో సమ్మోహనంగా ఏతెంచుతావు. నిదురిస్తున్న నా వక్షస్థలం వేదికగా మోహినిలా నాట్యమాడుతావు. నీ ప్రతి పదఘట్టనకీ - నాలో ఒక్కో కవిత విరబూసుకుంటుంది... హృదయములో సంగీతం సెలయేరై పారుతుంది... భావం గుండెలోంచి ఒలికి భౌతికతని సంతరించుకుంటుంది. నీ సౌందర్యం ఆవిష్కరిస్తున్నకొలదీ అనంతమనిపిస్తుంది. అమ్మ ఒడి కమ్మదనంలా.. కవ్వించే ప్రేయసిలా.. బడుగు బ్రతుకుల ఆక్రోషంలా.. ఎండుటాకులు చెప్పే తాత్వికతలా.. ఇలా నీవు కామరూపిణివి. హృదయేశ్వరీ!, నీ వీణామృతనాదంలో మునుగుతూ అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ.

ఒంటరి ఆలాపన

నిస్పృహతో భూమిలో దాగిన మొలకని పులకింపజేయడానికి ఆనందంగా వచ్చే తొలకరి చినుకు యొక్క హర్షాతిరేకాన్ని నేను. తర్వాత నాకేమవుతుంది అన్న ఆలోచన, భయమూ నాకు లేవు. నేను ఈ క్షణపు సౌందర్యాన్ని. నేను గాలి యొక్క చిలిపితనాన్ని. భూమి కన్న ఓర్పును. కనులలో కనపడని నీటి ఉద్రేకాన్ని కూడా. ఎప్పుడు బయటపడతానో నాకే తెలియదు. నేను కోయిల గొంతు శ్రావ్యాన్ని. తుమ్మెద రొదల అభద్రతని కూడా. నేను చంద్రుని కోసం ముస్తాబయిన కొలనులోని కలువ భామని. నేను పండువెన్నెల పంచిన విశ్వజనీన ప్రేమని. అమావాస్య చీకటిలో ఒంటరి ఆలాపనని కూడా.

సుప్రజ..5 ..The End

ఇటు మా వ్యాపారం కూడా పుంజుకుంది. మా కంపెనీ ప్రారంభించి అప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది. రాజు, రంగమ్మ ఇద్దరూ అద్భుతంగా పని చేస్తున్నారు. రాజు బయట నుంచి ఆర్డర్‌లు బాగా తీసుకొచ్చేవాడు.అంతకుముందు ఆటపట్టించిన అమ్మాయిలే ఇప్పుడు రాజు పట్ల అభిమానం, గౌరవం చూపిస్తున్నారు. మా ఉత్పత్తులకి ఆదరణ పెరిగి, మంచి పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఇంకా చాలా మంది మహిళలు మాతో కలిసారు. కొందరైతే పొరుగూరు నుంచి కూడా ఇక్కడకి వచ్చి పని చేస్తున్నారు. చిన్నగా ప్రారంభించిన మా కంపెనీ ఎనిమిది నెలలలోనే పదిహేను లక్షల టర్నోవర్‌ని చేరుకుంది. ఒక ప్రముఖ దినపత్రిక మా కంపెనీ గురించి ఆర్టికల్ వేసింది. నా ఫోటో, రంగమ్మ, రాజుల ఫోటోలు కూడా వేసారు. మా ఊరి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసారు. మమల్ని అభినందించటానికి రామ్మూర్తి మామయ్య, అత్తయ్య వచ్చారు. సభలో రాజు ఎందుకో కొంచం నీరసంగా, ఎక్కడో కోల్పోయినట్లుగా అనిపించాడు. నేను, రంగమ్మ మాట్లాడాక రాజుని ప్రసంగించమని అడిగారు. రాజు తడబడుతూ మైకు అందుకున్నాడు. ఒక రెండు నిమిషాలు నోరు పెగల్లేదు. అప్పుడు అర్థమయ్యింది-రాజు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడని. "ఒకప్...