Skip to main content

లలిత ప్రియ కమలం - నా సరస్వతి

నీవు భావస్పందనల హృదయరాగానివి. కనులు మూసినంతనే
ఊహల వినీలాకాశంలోంచి ధవళవస్త్రాలతో సమ్మోహనంగా
ఏతెంచుతావు. నిదురిస్తున్న నా వక్షస్థలం వేదికగా మోహినిలా
నాట్యమాడుతావు. నీ ప్రతి పదఘట్టనకీ -
నాలో ఒక్కో కవిత విరబూసుకుంటుంది... హృదయములో
సంగీతం సెలయేరై పారుతుంది... భావం గుండెలోంచి ఒలికి
భౌతికతని సంతరించుకుంటుంది.

నీ సౌందర్యం ఆవిష్కరిస్తున్నకొలదీ అనంతమనిపిస్తుంది.
అమ్మ ఒడి కమ్మదనంలా.. కవ్వించే ప్రేయసిలా..
బడుగు బ్రతుకుల ఆక్రోషంలా.. ఎండుటాకులు చెప్పే
తాత్వికతలా.. ఇలా నీవు కామరూపిణివి.
హృదయేశ్వరీ!, నీ వీణామృతనాదంలో మునుగుతూ
అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ.

Comments

మోహన said…
మురారి గారూ...

గాఢమైన భావాలను తేటగా, సున్నితంగా చెప్పటం ప్రశంశనీయం. ఆలాంటి రచనలకు మీ ఈ రచన ఓ మచ్చుతునక.

అలజడిగా అనిపించి సాధారణంగా భయపడి, వెలివేయబడే అంసాలను కూడా ఆదరించి, అనుభవాలుగా మలచుకుంటే ఆ తరువాత మిగిలే నిశ్శబ్ధ వాతావరణం వెదజల్లే ప్రశాంతత తాలూకు పరిమళాలను మీ రచనల ద్వారా ఆశ్వాదిస్తున్నాను. ధన్యవాదాలు.
Bolloju Baba said…
నీ ప్రతి పదఘట్టనకు ఒక్కో కవిత విరబూసుకోవటం బాగుంది
భావం భౌతికతను సంతరించుకోవటం మంచి పదచిత్రం
ఎండు టాకులు చెప్పే తాత్వికతా చాలా లోతైన భావాన్ని స్ఫురింపచేసె వాక్యం.

చాలా చాలా బాగున్నది.

బడుగుబ్రతుకుల ఆక్రోషం అన్న చోట కొంచెం ఆలోచించవలసినది.

బొల్లోజు బాబా
Purnima said…
భావం గుండెలోంచి ఒలికి
భౌతికతని సంతరించుకుంటుంది

కవితలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది
@బొల్లోజు బాబా
Thank u.
>>బడుగుబ్రతుకుల ఆక్రోషం అన్న చోట కొంచెం ఆలోచించవలసినది
inkoncham vishadeekarinchi cheppagalaraa?

@poornima
thank you.
kalpa latika said…
mohana gaaru chaeppina daaniti yaekeebhavistunnanu.

mee ee rachanalu mee talapulaku addampadutunnayi.

meeku chaeppaetantati daananu kaakapoyina,saahasinchi,chinna vishayamu chjaebutunnanu,
నీ వీణామృతనాదంలో మునుగుతూ
అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ
anna vaakyamlo "ahaanni" anna chota "ihanni" vaaditae baaguntundaemonanipinchiondi.
ardham kooda maerugupadutundani bhaavistoo....

.......saelavu
@kalpa latika,

మీరు చెప్పినట్టు మార్చినా బాగుంటుంది. అప్పటికి నాకు ఆ భావమే స్ఫురించింది. స్పందనకి థాంకులు.
kalpa latika said…
adrustam naadi ga bhaavistunnanu,meeboti vaari to ee saahitee parichayam.