Skip to main content

Posts

ఆత్మ టపా

బ్లాగులో కొత్త టపా ( కధ) రాసి చాలా రోజులయ్యింది. ఈ మధ్యన ఐడియాలే రావట్లేదు. 'ఏమిటి.. నా బుర్ర వట్టి పోయిందా..ఇప్పటి వరకూ రాసినవి తప్పితే మరే స్టోరీ ఐడియాలు లేవా? .. రావా?..' ఇలా ఆత్మన్యూనతా భావాలు నన్ను పీడిస్తుంటే పేపరు, పెన్ను పట్టుకుంటే ఏదో ఐడియా తట్టకపోదా అని బలవంతంగా కూర్చున్నాను. రాయక ముందర ఆత్మన్యూనత; రాసాక నచ్చుతుందా, నచ్చదా.. కామెంట్లు వస్తాయా, రావా.. అన్న టెన్సన్లు; నచ్చకపోతే ఫ్రస్ట్రేషన్, నచ్చితే మరింత మంది మెచ్చాలన్నఉబలాటం.. ఇలా టపా రాసే క్రమంలో ఏ దశ కూడా బాగోదు ఒక్క - 'మెరుపులాంటి ఆలోచన మెదలడం, రాయడం' అన్న ఫేజ్ తప్పితే. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు. మరెందుకో ఈ పితలాటకం. కొంచం ఎక్కువ ఆలోచిస్తున్నానిపించింది. మళ్ళీ ఏదో కధ రాయాలన్న విషయం మీద దృష్టి పెట్టాను. బుర్రలో ఏ మెరుపూ మెరవట్లేదు. 'అలా కాకుండా ఎందుకు రాయలేను? ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరి.' అనుకొని ముందుగా ఒక కారెక్టర్ ని సృష్టించాను. మగవాడే. వాడికి 'శీను' అని పేరు పెట్టాను. వాడి కారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోస...

మార్నింగ్ రాగ...

జనవరి మాసపు ఓ ఉదయాన డిజికామ్ పట్టుకొని వీధుల మీద పడ్డాను కాసేపు నడవగానే 'మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా..' పాట మనసులో మెదిలి పెదవులపైకి వచ్చింది. కుక్కపిల్లలు ఒకదానిమీదొకటి సుఖంగా పడుకున్నాయి . ఓ రోజా పువ్వు వికసించింది. 'చలికాలం పొద్దున్న ఎండకాసుకుంటే భలే ఉంటుంది కదూ!.' ఒకాయన టీ తాగుతూ సమ్మగా పేపర్ చదువుకుంటున్నాడు. పిల్లలు కూడా ఎంచక్కా ముగ్గులేస్తున్నారు. వీధులు శుభ్రం చేసేవాళ్ళు ఏ గుర్తింపుకీ నోచుకో కపోయినా స్థితప్రజ్ఞుల్లా తమ పని తాము చేసుకుపోతున్నారు. బసవన్న 'టింగురంగా!..' అంటూ వీధుల్లో తిరుగుతున్నాడు. పూలమ్మి అప్పుడే షాపుని తెరిచింది. 'ఇడ్లీ. ఇడ్లీ..' అన్నా, చెల్లెల్ల ఇసుకలాట. నేను తోడు రాకపోతే తాత పేపర్ కొనుక్కోలేడు. పాపం!. పోనీలే.. ఆని వస్తా. "School time .. bachchon ka school time." చదువుల బరువు అమ్మకూ తప్పదు. అమ్మ బ్యాగ్ మోస్తుంటే హీరో ఎంత దర్జాగా నడుస్తున్నాడో.. అన్నతో ఎంచక్కా సైకిల్ మీద .. ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!.. నేనిక్కడ దాక్కుంటున్నా.. అసైన్‌మెంట్ చెయ్యలేదు.. ఇంట్లో ఏం చెప్పి స్కూల్ ఎగ...

విరహ భోగం...

డాబా మీదకి వచ్చాను. వెన్నెల పాలిపోయి ఉంది. చంద్రుని వైపు చూడబుద్ధి కాలేదు. చూస్తే మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతాడు. పక్కగా ఓ గాలి తెమ్మెర వెళ్ళింది. నువ్వు వెనుకగా వచ్చి నడుముకి చేయి జార్చి, చెవుల మీది కురులను సవరించి చెంపకి చెంప ఆనించిన అనుభవాన్ని తట్టి లేపింది. దానిని గమనించనట్టే ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను. ఆ మాత్రం గాలివిసురుకే చున్నీ ఎగిరి పక్కనున్న గులాబీ మొక్కకి చిక్కుకుంది. హే!.. దీనికో పువ్వు పూసింది. ఆప్యాయంగా ముఖాన్ని గులాబీకి దగ్గర చేశాను. ఉచ్ఛ్వాస గులాబీ పరిమళాన్ని పూసుకోగానే గుండె గదుల్లో నీ మందహాస సమ్మోహనం పొగమంచులా ప్రవేశించింది. తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది. ఈ బాధ వలనైనా శరీరానికి కొంచం స్పృహ వస్తుందని అలాగే పట్టిఉంచాను. కానీ నీ మత్తు మహత్తు చేసిన తిమ్మిరికి ఈ నొప్పి ఎలా తెలుస్తుంది. స్నానం చేసి మనసు కొంచం తేలికపడ్డాక పడుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. షవర్ నీరు కురుల మీదుగా శతాధిక పాయలుగా చీలి తనువంతా పారుతుంటే దేహం కోటి తంత్రుల ఘోషగా మారింది. షవర్ నీటికి ముఖాన్ని ఎదురుగా పెట్టి, చేతులతో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఓసారి తమకంత...