Skip to main content

Posts

సాంగత్యపు సౌరభం

ప్రాతః నిశీధి, బంగారు లేత కిరణాలు నాలోకి నువ్వు. ----------------------------- రసహీనత, నీ అరనవ్వు వ్యాధికి సూదిమందు. ----------------------------- రవి కిరణాన్ని వాన చినుకు అడ్డిన క్షణం, నీ క్రీగంటి చూపు తాకిన క్షణం నా సృజనకి మరుజన్మం. ----------------------------- మెడ దిగువున నీ పుట్టుమచ్చ, నా చూపు బోధి కింద బుద్ధుడు. ----------------------------- వేసవిలో మల్లెలు విరిసిన సంధ్య, చిన్ని చిన్ని ఆనందాల కేరింతలు నీ సాంగత్యపు సౌరభం. -----------------------------

సంఘర్షణ

చుట్టూ గడియలేసి పహారా కాస్తున్న నా హృదయపు అంతఃపురం లోనికి వెన్నెల్లా నువ్వెప్పుడు వచ్చేసావో !.. పందిరిలా అల్లుకునేసరికి ఈ గోడలెపుడు వాటి గంభీర అస్తిత్వాన్ని కోల్పోయాయో !.. నీ ఉనికి తీరాన స్వాంతన పొందుతున్న నా పాదముద్రలు ఎప్పటికప్పుడు చెరిగిపోతున్నా దారిలో ఏరుకున్న గవ్వలు జ్ఞాపకాల పేజీల్ని ఇంకా అలంకరిస్తున్నాయి . సముద్రంలా నువ్వు లోపల ఉన్నావన్న నిజాన్ని ఆ కాపలావాడు అస్సలు భరించలేడు. లోపలికి ఎవరూ చొరబడలేదన్న భ్రమనే ఇంకా శ్వాసిస్తున్నాడు . నిజానికి కొన్ని భ్రమలే మనల్ని బ్రతికిస్తుంటాయి . లేదంటే నాలోని వాడు ఏమైపోయేవాడో .. నీ అవాజ్యమైన ప్రేమంటే నాకు గొప్ప భయం . ఓపలేను . అందుకే నా వైకల్యం కనపడనీకుండా నీనుంచి తప్పించుకు తిరుగుతుంటాను . కానీ నేను పారిపోతున్నది నానుంచే నని ఎప్పటికప్పుడు మర్చిపోతాను . ' నన్ను పరిహసించదానికే వచ్చావా ?.. పో !.. ' అని నిష్టూరమాడుతాను . కానీ నువ్వు నా కసురుని పట్టించుకోనట్లే కనబడతావు . అందుకు నాకు మరీ కోపం . నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు . వదులుకుందామంటే నా ...

ఆత్మ టపా

బ్లాగులో కొత్త టపా ( కధ) రాసి చాలా రోజులయ్యింది. ఈ మధ్యన ఐడియాలే రావట్లేదు. 'ఏమిటి.. నా బుర్ర వట్టి పోయిందా..ఇప్పటి వరకూ రాసినవి తప్పితే మరే స్టోరీ ఐడియాలు లేవా? .. రావా?..' ఇలా ఆత్మన్యూనతా భావాలు నన్ను పీడిస్తుంటే పేపరు, పెన్ను పట్టుకుంటే ఏదో ఐడియా తట్టకపోదా అని బలవంతంగా కూర్చున్నాను. రాయక ముందర ఆత్మన్యూనత; రాసాక నచ్చుతుందా, నచ్చదా.. కామెంట్లు వస్తాయా, రావా.. అన్న టెన్సన్లు; నచ్చకపోతే ఫ్రస్ట్రేషన్, నచ్చితే మరింత మంది మెచ్చాలన్నఉబలాటం.. ఇలా టపా రాసే క్రమంలో ఏ దశ కూడా బాగోదు ఒక్క - 'మెరుపులాంటి ఆలోచన మెదలడం, రాయడం' అన్న ఫేజ్ తప్పితే. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు. మరెందుకో ఈ పితలాటకం. కొంచం ఎక్కువ ఆలోచిస్తున్నానిపించింది. మళ్ళీ ఏదో కధ రాయాలన్న విషయం మీద దృష్టి పెట్టాను. బుర్రలో ఏ మెరుపూ మెరవట్లేదు. 'అలా కాకుండా ఎందుకు రాయలేను? ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరి.' అనుకొని ముందుగా ఒక కారెక్టర్ ని సృష్టించాను. మగవాడే. వాడికి 'శీను' అని పేరు పెట్టాను. వాడి కారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోస...