Skip to main content

Posts

భావి సమాజమా!.. నన్ను క్షమించు.

చుట్టూ భవనాలు, గుడిసెలు, రోడ్లు, మోటారు చక్రాలు.. మనుషుల చేతులు, కాళ్ళు కదులుతున్నాయి.. ముఖాలు మాట్లాడుతున్నాయి.. భవనాలు, చేతులు-కాళ్ళు, చక్రాలు, ముఖాలు తమని నియంత్రిస్తున్న పరాయి పైశాచిక శక్తి యొక్క వికృత, విశృంఖల నాట్యాన్ని నగ్నంగా చూపిస్తున్నాయి. తనని తాను కాల్చుకునే మూర్ఖావేశం, బలహీనమైనవాటిని ధ్వంసం చేసి సమర్థించుకునే కుటిల రాక్షసత్వం చుట్టూ కారుచిచ్చులా రాజుకుంటున్నాయి. రాజకీయం వ్యక్తి స్వార్ధానికి పరాకాష్టగా మారి సంఘాన్ని బలత్కరిస్తోంది. విలువలు నేర్పని, మనిషిని చేయలేని విద్య తన డొల్లతనాన్ని కఠోరంగా డప్పుకొడుతోంది. భయం.. స్వార్ధం.. కుటుంబం.. వంటి బంధాల, భావాల పిరికితనంతో నిండిన మానసిక నపుంసకుడిని నేను. నా రక్తం నిజానికి ఎర్రగానే లేదు. మరిగే స్వభావం కోల్పోవడంతో రక్తమాంసాదులు కుళ్లు కంపుకొడుతున్నాయి. భావి సమాజమా!.. నన్ను క్షమించు.

Inner Dimensions: The wife speaks..

పైశాచిక ఆనందమంటే ఏమిటో నాకిప్పుడే.. దానిని అనుభవిస్తుంటే అర్ధమౌతోంది... త్వరలో అతన్ని మానసికంగా హింసించబోతున్నాను. నా భర్త పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం నేనీమధ్యనే రహస్యంగా కనిపెట్టాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తుంటే.. ఇన్నాళ్ళకి ఓ తప్పుకి దొరికాడు. దీనిని ఎత్తి చూపిస్తూ రేపటి నుండీ అతన్ని ఎంతలా టార్చర్ పెట్టబోతున్నానో తలచుకుంటుంటే ఓ రాక్షస తృప్తి కలుగుతోంది. ఎందుకిలా ఉద్వేగంతో ఊగిపోతున్నాను?.. నేను నిజంగా ఈ విషయానికి ఆనందపడుతున్నానా?.. అతను నన్ను మోసగించాడ న్న బాధ నాకేమాత్రమూ లేదా?.. నిజం చెప్పాలంటే.. మోసగింపబడ్డానన్న బాధ తాలూక స్పృహ అయితే ఇప్పటివరకూ కలుగలేదు . కానీ ఓ మనసు మాత్రం తాను ఆరాధించిన విలువల మేరు శిఖరం కూలిపోయిన విషయాన్ని వెంటనే అంగీకరించలేక, తన ఆత్మ గౌరవాన్ని శిధిలాల్లో వెతుకుతూ కుమిలిపోతోంది . ఈ బాధే లేకుంటే నా ఆనందం ' పైశాచికం' ఎలా అవుతుంది ?.. బాధతో కూడిన ఆనందం వలన వచ్చిన శాడిజం ఇది . హ హ !!.. Its sheer 'hatred'. అతన్ని ఎందుకు అంతలా ద్వేషిస్తానో నాకు తెలియదు. కారణాలు వెతకను కూడా. వెతకలేని నా అశక్తత బయటపడి...

ఉప్పటి జ్ఞాపకం...

అనంత సాగర గర్భాన్ని దాటుకొని తీరానికి పరుగులెత్తిన అలలా ఈ క్షణం కోసమే ఎన్నో బరువైన దాహపు ఝాముల్ని ఈది వచ్చాను. వర్షించే క్షణం కోసమే బతికిన మేఘం వర్షించాక మాయమైనట్టు ఈ క్షణం కోసమే.. ఈ క్షణం లోనే గడిపిన మునుపటి కాలమంతా గమ్మున తన అస్తిత్వాన్ని జారవిడుచుకుంది. నా ఎదురుగా.. సాహితి. * * * * * నిండు గుండె వెంటనే తొణకలేనట్లుగా ఆ స్థానే నిశ్వాసలు అధికమై, పొడి పొడి మాటలు పల్లవించాయి. 'వచ్చేసావా?' 'ఊ!.. నీ పరీక్షలు అయిపోయాయా?' 'ఊ..' ఇద్దరివీ సమాధానం తెలిసిన ప్రశ్నలే. కానీ మనసులు అటూ, ఇటూ ప్రవహించడానికి భౌతికమైన ఏదో సంధి ఏర్పడాలిగా. ఇద్దరం పక్కపక్కన ఇసుకలో కూర్చున్నాం. మేమెప్పుడూ కలిసే ఏకాంత సాగరతీరమిది. కాసేపటికి నా కాళ్ల మీద తలపెట్టుకొని తను.. ఇంకాసేపటికి తన కాళ్లమీద తల పెట్టుకొని నేను. కాలం కరుగుతోంది. మాటల తలంబ్రాలు, స్పర్శలు రేపే నూనూగు కాంక్షల మేళాల నడుమ హృదయాల కళ్లాపులు. నా కళ్లకెదురుగా ఆకాశం.. అవధుల్లేకుండా. పగలు, రాత్రి మాలాగే ప్రేమికులై ఇప్పుడే కలుసుకుంటున్నారేమో. ఆకాశంలో అందమైన సంధ్య ఆవిష్కృతమౌతోంది. తన తోడుగా నా ప్రపంచం ఇప్పుడింత అందంగా ఉందన్న విషయం ఒక్కసారిగా అ...