Skip to main content

Posts

Showing posts with the label నా భావాలు..ఆలోచనలు..

నెచ్చెలీ!.. నువ్వొస్తావని..

జీవితపు దారిలో నడుస్తూ ఈ చోట నీకోసమని ఆగిపోయాను. నేను వచ్చిన దారిలో విరిసిన ప్రతి పువ్వునీ కోసి అపురూపంగా పట్టుకువచ్చాను. మరి నీకు నచ్చుతాయో.. లేదో. అందుకున్నప్పుడు వాటి ముళ్ళు నిన్ను గాయపరుస్తాయేమోనన్న భయం కూడా ఉంది. నా కాంప్లెక్సుల ఒంటరి వసారాని ఇంపుగా సంపంగెవై అల్లుకుంటావని... ఉబుసుపోని ఉక్కబోతలోకి బిగిసిపోయే బంధాల గంధమై వస్తావని ... నీకోసం ఆగిపోయాను. నాదొక ఒంటరి క్షణం.. నీదొక ఒంటరి క్షణం.. కలిసిన క్షణమది కమనీయమవుతుందని... నాదొక మాట.. నీదొక మాట.. మురిపాల మూటలై మనసుల్ని వడకాస్తాయని... నాలోని దాగుండిపోయిన పసివాడు నీ సమక్షంలో బయటకి వచ్చినప్పుడు వాడి మారాన్ని, కేరింతలని కాకిఎంగిలి చేసి పంచుకుంటావని... నా అనురాగాన్నంతటినీ ముద్దులు చేసి ముద్దలుగా నీకు కొసరి, కొసరి తినిపించాలని... నీకోసం ఆగిపోయాను. అలసిపోయి ఇంటికొచ్చిన సూరీడు పశ్చిమప్రౌఢ గుండెల్లో తలదాచుకున్నాడు. గూటికి చేరుకున్న గువ్వలు జంటగా సేదతీరుతున్నాయి. ఆరుబయలు ఏటిలో వెన్నెల నగ్నంగా ఆరబోసుకుంది. నేను ఒంటరిగా నీ తలపులతో తపించాను. ఎదోనాడు ఈ క్షణం మనదవుతుందని... కాగిన దేహాలు కరిగిన సాక్షిగా మన జీవితలక్ష్యాలకి ఒకరికొకరం ఆజ్యమవుతామని...

సెర్చ్ ..

నేను దేని గురించి వెతుకుతున్నానో తెలియదు. యే విజయపు వేకువ కోసమో తెలియదు. అసలు విజయమన్నదే లేదు, ప్రతీదీ గొప్ప అనుభవమేనన్న పరిణితి కోసమో ఏమో నేనైతే వెతుకుతున్నాను. నేను స్వార్థపరుడినో, ప్రేమమూర్తినో తెలియదు. మంచి చేసావు అని ఇతరులు చెప్పే ప్రతి పనిలోనూ నా అంతస్స్వార్ధమే కనపడుతుంది. స్వార్ధం పెరిగి ప్రేమవుతుందా లేక స్వార్ధం కరిగి ప్రేమ పుడుతుందా?.. నాకు తెలియదు. నేను వెతుకుతున్నాను. నేనెవరిని సమాధానపరచాలనుకుంటున్నానో తెలియదు. నా వాళ్లు, నా చుట్టూ ఉన్నా ప్రపంచానికా .. లేక నాకు నేనేనా?.. ఆత్మసాక్షికే అయితే ప్రత్యేకించి సమాధానం చెప్పనవసరం లేదు కదా!. బహుశా ఈ సమాధానం చెప్పనవసరం లేదు అన్న జ్ఞానం ఇచ్చే స్థితి కోసమేనేమో నేను వెతుకుతున్నాను. ప్రతీ అందానికీ ప్రతిస్పందిస్తాను. దానిని నాదాన్ని చేసుకొని, అనుభవించి, పరవశించి తేలికవ్వాలో లేక ఆ అందం లోనూ నన్నే చూసుకొని మురిసిపోవాలో తెలియదు. నేను... జ్ఞానముండీ మాయ కమ్మేస్తుంది. ప్రతిక్షణం ఏమరుపాటుగా ఉండి మాయతో పోరాడాలో లేక మాయలో ఆర్తిగా మునిగిపోయి, రమించి ఆ తీక్షణత కు మాయ కరిగినప్పుడు బోసినవ్వులా బయటపడాలో ఏమో.. నేనైతే...

లలిత ప్రియ కమలం - నా సరస్వతి

నీవు భావస్పందనల హృదయరాగానివి. కనులు మూసినంతనే ఊహల వినీలాకాశంలోంచి ధవళవస్త్రాలతో సమ్మోహనంగా ఏతెంచుతావు. నిదురిస్తున్న నా వక్షస్థలం వేదికగా మోహినిలా నాట్యమాడుతావు. నీ ప్రతి పదఘట్టనకీ - నాలో ఒక్కో కవిత విరబూసుకుంటుంది... హృదయములో సంగీతం సెలయేరై పారుతుంది... భావం గుండెలోంచి ఒలికి భౌతికతని సంతరించుకుంటుంది. నీ సౌందర్యం ఆవిష్కరిస్తున్నకొలదీ అనంతమనిపిస్తుంది. అమ్మ ఒడి కమ్మదనంలా.. కవ్వించే ప్రేయసిలా.. బడుగు బ్రతుకుల ఆక్రోషంలా.. ఎండుటాకులు చెప్పే తాత్వికతలా.. ఇలా నీవు కామరూపిణివి. హృదయేశ్వరీ!, నీ వీణామృతనాదంలో మునుగుతూ అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ.

నా ప్రపంచం

నా ప్రపంచం వసుధైక కుటుంబం. ఇందులో ప్రకృతి, మనిషి కలసిమెలసి పెరుగుతారు. ప్రతీ ఒక్కరూ తమ individual brilliance తో వెలుగుతారు. ప్రతీ కుటుంబం లో కనీసం రెండు చెట్లు సభ్యులుగా ఉంటాయి. Apartments ఉండవు. పల్లె, పట్నం అని differentiate చెయ్యలేము. అన్నీ సౌకర్యంగా, పచ్చగా ఉంటాయి. ఇక్కడ 'conditioned' relationships ఉండవు. Relationships grow naturally without any conditioning by the society. They enjoy full freedom. చట్టం ప్రకారం, 'పేరెంట్స్' అన్న సంబంధం ఉంటుంది. నిర్ణీత వయసు దాటిన యువతీ, యువకులు మాత్రమే పిల్లల్ని కనగలరు. ఒకసారి పిల్లల్ని కన్నాక, పిల్లలకి 15 ఏళ్లు వచ్చేవరకు విధిగా parenting చెయ్యాలి. ఇంక చదువు విషయానికి వస్తే, Education essentially teaches how to lead a happy life. In my world, Education is not seen as a means of employement. It first teaches values (like Truth, Individuality, Dignity of labour, equality) and then upon it knowledge. It helps free the mind to be its creative, sensitive and entrepreneurial best. ధనిక, పేద, జాతి, కుల, మత,వర్గ విభేధాలు పిల్లల మనసుల్లోకి...

నేనూ, నా frustration, మా మురిపాలు...

ఈ రోజు ప్రశాంతంగా ఉందామని office కి సెలవు పెట్టాను. కానీ ఎక్కడ ప్రశాంతత? 'అందరూ ఏదో ఉపయోగపడే పని చేసేస్తున్నారు. నేనే ఖాళీగా ఉండిపోయాను.' అన్న పురుగు లాంటి ఫీలింగ్ రెగ్యులర్ గా నన్ను interrupt చేస్తూ ఉంది. పోనీ ఆఫీషు కి వెళ్తే బాగుంటామా అంటే అదీ లేదు. ఆఫీషు లోకి అడుగు పెడుతూనే keyboard చప్పుళ్లు, బిజినెస్ మాటలూ స్వాగతిస్తాయి. మనిషి చప్పుళ్లు ఉండవు. ఎవ్వరూ గట్టిగా నవ్వరు కూడానూ. అసలు ఆఫీషే ఒక పెద్ద computer లా అనిపిస్తుంది. అందులో bugs లేని program ఒకటి రొటీన్ గా run అవుతున్నట్లు గా ఉంది. ఆ ప్రదేశం కి వచ్చిన ఒక కుక్కని నేను. మనిషి వాసన కోసము వెదుకుతున్నాను. ఎక్కడా రాదాయె. ఇంక కూర్చొని పని మొదలుపెడుతూనే, నా లోని social psychologist లేస్తాడు. 'అసలు ఈ technology జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పు?' అంటూ క్లాస్ మొదలుపెడతాడు. ఇంక 'apartment culture, మనిషి మరీ narrow అయిపోవడమూ, ఉమ్మడి కుటుంబాలు లేకపోయే కనీసం పిల్లలకి నానమ్మలూ, తాతయ్యాలూ కరువు అవ్వడం, tv లు వచ్చి మనకీ పక్కింటికీ మధ్య దూరాలు పెంచడము, pollution, ... ' ఇలా పక్క రూమ్ లో మేకులు కొడుతున్న కార్పంటర్ లా నా మె...
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ call చేశాడు. వేరే company కి jump కొట్టాడు అట. Package చాలా బాగుంది. ఆది వినేసరికి, మనస్సు ఒక్కసారి jealousy, inferiority లాంటి వాటితో నిండిపోయింది. నేను సాధారణం గా డబ్బు కి అంత ప్రాధాన్యం ఇవ్వను. కానీ అప్పుడప్పుడు society conditioning నా మీద పని చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేశాను. తలుపు దగ్గరికి వస్తూనే, "శీను మామ!!" అంటూ పిల్లలు నన్ను చుట్టుముట్టేసారు. మా ఇంటికి అక్కలూ, వారి పిల్లలూ వచ్చారు. పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళి, నచ్చినవి కొనిపెట్టి, మేడ మీదకు తీసుకు వెళ్ళి, వాళ్ళని ఆడిపించటం మొదలుపెట్టాను. మెల్లగా నేనూ వాళ్ళతో కలిసిపోయాను... చిన్న పిల్లాడినైపోయి... ఈ తొక్కలో ఇగోలన్నీ వదిలేసి.. అలా చాలా సేపు ఆడుకొని, అలసిపోయాము. అప్పుడు నాకు నేను చాలా తేలికగా, స్వచ్ఛంగా, స్నానం చేసి మురికిని వదిలించుకొని తాజాగా ఉన్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా నా ఫ్రెండు, వాడి package గుర్తుకు వచ్చాయి. మనసు దానిని ఏదో సామాన్య వార్తలా చదివి పక్కన పడేసింది. నేను నిండుగా నవ్వుకున్నాను. ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ ఒత్తిడి తో గుండు చేయించుకు...

నా టింగ్ టింగ్స్

ఈ టింగ్-టింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.. టింగ్-టింగ్ అంటే 'గుండెల్లో బెల్ మోగించిన అమ్మాయి' అన్న మాట. నా first టింగ్ టింగ్ పేరు - 'మీన'. నేను అప్పుడు 5th క్లాస్. నేను, ఆమె కలిసి ఆడుకొనేవాళ్ళము. ఒక రోజు స్కూల్ ముందు ఇసక మీదెక్కి ఆడుకుంటున్నాము. sudden గా తను తూలబోతూ ఉంటే, నేను పట్టుకొని, నేను కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుకుంటూ పడిపోయాము. ఆ వయసు లోనే నాకు ఏదో సినిమా లో హీరొ, హీరొయిన్లు ఇలా slow motion లో పడటం గుర్తుకు వచ్చింది. ఇంక అంతే! మోగింది బెల్. అప్పటి నుంచి తనని ఒక హీరొయిన్ లా నేనొక హీరొ లా ఫీల్ అవుతూ చూసేవాడిని. 6th class లో మా ఇద్దరి స్కూల్స్ మారిపోయాయి. మేము అలా విడిపోయాము. ఆ అమ్మాయి పేరు 'మంజుల'. నేను 10th class. కొత్తగా tution లో join అయ్యాను. ఆ రోజు first day. పొద్దున్నే త్వరగా వచ్చేశాను. చలి కాలం. ఇంక ఎవరూ రాలేదు. అంతలో చిన్నగా కాళ్ళ పట్టీ ల తాలూక మువ్వల చప్పుడు. చాలా rhythemic గా దగ్గరకు వస్తున్నాయి. అందమైన పాదాలు.. సన్నని నడుమును పట్టెసుకున్న మిడ్దీ (మెరూన్ color top, black color skirt) .. తల స్నానం చేసి అలానే వదిలేసిన కురులు.....

కిష్కింధకాండ

కాలేజీ రోజులు... యవ్వనమనే కోతి మన లోకి ప్రవేశించిన రోజులు. స్నేహ మాధుర్యాన్ని తెలిపిన రోజులు. అతివ ఆకర్షణ అనే మధువు రుచి మరిగిన రోజులు. నూనూగు మీసాలు, లేలేత కాంక్షలు, friends గ్యాంగులూ, byke సవారీలు, ప్రేమ వ్యవహారాలు.. అబ్బో!! ఆ రోజులే వేరు లెండి. మాది పల్లెటూర్లో ఒక engg college. మొత్తం ఆరుగురం roommates. ఆరుగురవి విభిన్న మనస్తత్వాలు. అయినా స్నేహం అనే పూమాల లో అందం గా ఒదిగిపోయాము. పల్లెటూరు కనుక చాలా సార్లు సాయంత్రం అయితే power పోయేది. happy గా మేడ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకొనే వాళ్ళము. అక్కడ hot hot topics- అమ్మాయిలే మరి. రాత్రి 12 గం..ల కి birth day parties అప్పుడే అలవడ్డాయి. cake cut చేసి పూసు కొన్నాక ఒకళ్ళ మీద ఒకరు నీరు పోసుకొని స్నానాలు చెయ్యటం భలే గా ఉండేది. serious Indoor cricket matchలు, ప్రపంచం లో అతి ముఖ్యమైన పని ఇదే అన్నట్లుగా 'పేకాటలు' అర్థరాత్రి దాటాక కూడా సాగేవి. పరీక్షలొస్తే, చదివింది తక్కువ... హడావుడి ఎక్కువ. ప్రతీ exam అయ్యాక అందరం వచ్చి, అరుగు మీద కూర్చొని, 'నడిపించు నా నావ నడి సంద్రమున దేవ!', ' పాపులము మేము.. ఓ తండ్రీ!' ... ఇలా ఏసుక్రీస్తు ...

చిన్న చిన్న ఆనందాలు

స్నేహితుని ఉత్తరం పూర్తిగా 'ఇట్లు నీ స్నేహితుడు, xxxx.' అంత వరకూ చదివాక కూడా మనకు తెలియకుండానే మన కళ్ళు క్రిందన ఇంకా ఏమన్నా రాశాడేమో అని గుడ్డిగా వెతుకుతాయి. ఎంత వెచ్చని గుడ్డి అభిమానం!!. ఆ ఉత్తరం ని చదివాక దానిని ఎంత ఆప్యాయం గా పట్టుకుంటామని!!. ప్రియురాలి తో కానీ బాగా నచ్చిన వాళ్ళ తో కానీ phone లో మాట్లాడుతున్నప్పుడు, 'bye' చెప్పేసాక కూడా ఒక రెండు క్షణాల వరకు disconnect చెయ్యము. మాటల్లో చెప్పలేని భావం ఏదో ఇంకా మిగిలిపోయి, ఆది చెప్పలేక, call cut చెయ్యలేక హృదయం ఎంత ఆరాటపడుతుందని!!. కాసేపు ఆగి, వెనక్కి వెళ్ళి, ఆ రెండు క్షణాలని తరచి చూస్తే... మనసు ముగ్ధ మూగది అయ్యి, తేటగా అమాయకత్వం తో ఎంత ముద్దు గా కనపడుతుందో!!. ఇలా చిన్న చిన్న feelings ఎంత అద్భుతమైనవో. ఈ చిన్న చిన్న ఆనందాలే జీవితమేమో.

ముందు మాట

హాయ్!!, కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు। కానీ, జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది. అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను. మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు, మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది. అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ... ముచ్చట్లూ...