నా ఇంట్లో ఆ రూముని నేనెప్పుడూ తెరవలేదు. ఆ రూము నుంచి ఎప్పుడూ ఏవో ఏడుపులు, మూలుగులు, అరుపులు వంటి భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రూమన్నా, అందులో ఉండే ఆ పిచ్చిదన్నా నాకు చాలా భయం. అసలు నా ఇంటిని నేను పెద్దగా పట్టించుకోను. ఇంట్లో మిగిలినవారి గురించి, ఆ రూము గురించి చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందేమో.. తెలిస్తే వారేమనుకుంటారో.. అని ఎప్పుడూ ఇంటికి తాళం వేసి బయటనే తిరుగుతా. కానీ ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగు వచ్చేస్తుంటుంది. నాకు నేనే డొల్లగా కనపడతా.. ఏదో వేషం వేసుకున్నట్లు. ఆ రూములో పిచ్చిది ఎందుకో నన్ను కలవడానికి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ నేను ఆ రూము తలుపు తీయనుగా. నేను స్పృహలో ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా తను రాలేదు. అందుకే నేను నిద్రలోకి జారినప్పుడు తను వస్తుంది- ఓ పీడకలలా.
ఇంటిలో ఓ చిన్నమ్మాయి కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. దానికీ, వరండాలో కూర్చొని ప్రపంచాన్ని చూసే బామ్మకి అస్సలు పడదు. కానీ ఆ చిన్నమ్మాయి అంటే నాకు భలే ఇష్టం. దానితో ఉంటే నాకూ పిల్లచేష్టలు వచ్చేస్తాయి. మళ్ళీ పదిమందీ నన్ను చూసి నవ్వుతారేమోనని భయం. అందుకే ఎవాయిడ్ చేస్తా. మరొక రూములో లంగా- వోణీ, తలలో పూలు, వాలు జడ, పట్టీలేసుకొని ఒకమ్మాయి. పక్క రూంలోనే స్లీవ్లెస్ జాకెట్, మినీ స్కర్ట్, చింపిరి జుట్టేసుకొని సిగరెట్ కాలుస్తూ మరొక అమ్మాయి. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవే. ఎవరిని సమర్థించాలో అర్థం కాదు.
ఒకసారి వరండాలో బామ్మ ఒడిలో తలపెట్టుకొని కలలుకంటూ అడిగా - 'నా రాకుమారుడుని ఎలా కనిపెట్టడం?' అని. 'ఎవరైతే నీ ఇంటికి వచ్చి ఆ రూము తలుపు తీయగలడో వాడే నీ రాకుమారుడు' అని. అప్పటినుంచి చాలామంది అబ్బాయిలను ఇంటికి తెచ్చా. కొందరు బామ్మ చాదస్తానికి, అది దాటినవారు చిన్నమ్మాయి అల్లరికి పారిపోయారు. మరికొందరు లంగా-వోణీ అమ్మాయి దగ్గర, ఇంకొందరు చింపిరి జుట్టు చోరీ దగ్గర బోల్తాలు పడ్డారు. ఇంతలో మావోడు పరిచయమయ్యాడు. వీడే వాడు అని గుర్తించేలోపే బామ్మని ఇంప్రెస్ చేసేసి, చిన్నపిల్లతో చెమ్మచెక్కలాడాడు. లంగా-వోణీని ముగ్గులోకి దించాడు. సిగరెట్ పాపతో డేటింగ్ కూడా చేసాడు. ఒకరోజు సడన్ గా ఆ రూముని నా(తన) సమక్షంలో తెరిచాడు(ను). లోపల ఒకమ్మాయి రోగంతో బాధపడుతూ కనపడింది. నాకు భయం వెయ్యాలా. ఎందుకో భోరున ఏడ్చేసాను. తనపై చాలా జాలి కలిగింది. ఆశ్చర్యంగా నావాడు నన్ను అర్థం చేసుకున్నాడు. అప్పట్నుంచి నేను నా ఇంటివాళ్ళతో చక్కగా గడపటం మొదలుపెట్టాను. దాంతో ఆ రూములోని అమ్మాయి బాగా కోలుకోంది. నా చొరవతో బామ్మ, చిన్నమ్మాయి, లంగా-వోణీ, సిగరెట్, జబ్బుది అందరూ ఒకరితో ఒకరు దగ్గరవ్వసాగారు. వాళ్ల మధ్య పూర్తి సఖ్యత కుదిరాక ఒక గమ్మత్తైన క్షణంలో అందరూ నాలో కలిసి మాయమయిపోయారు. నేను నేనుగా.. నిండుగా అయిపోయాను. భలే ఆనందమేసింది. పరిగెత్తుకొని వెళ్లి నా రాకుమారుడిని కౌగిలించుకున్నాను. అంతా హ్యాపీస్. కధ కంచికి .. మనమింటికి.
నోట్: ఇక్కడ 'నా ఇల్లు' అనేది నా మనసుని (స్పెసిఫిక్ గా ఒక అమ్మాయి మనసుని ) సూచిస్తుంది. ఇంటిలోని ఇతర పాత్రలు నా మనసులో ఉండే భిన్న పార్శ్వాలు.

Comments
ఒక గదిలో పెత్టి తాళం వేసిన పిచ్చిది, మీ పీడకల !! అంటే ఏదో బాధాపూర్వక గతమా?
చిన్నమ్మాయి, చిలిపితనం
బామ్మ, సంఘాన్ని గుర్తు చేసే సామాజిక విశ్లేషణ
సిగరెట్ కాల్చే అమ్మాయి, సమాజాన్ని ఎదిరించి బరి తెగించాలనే కోరిక
లంగా ఓణీ అమ్మాయి, సౌమ్యమైన భావాలు
ప్రతీ ఒక్కరిలోనూ ఇలాంటి భావాలు ఉంటూనే ఉంటాయి.
వాటి మధ్య సఖ్యత కోసం, ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఒక వ్యక్తి లేదా కళ రూపంలో దొరకవచ్చు.
చివరగా ఒక విమర్శ, ఇది ఒక అమ్మాయి దృక్పధంలో రాసినా ఇది రాసింది అబ్బాయని సులంభంగా చెప్పచ్చు.
అమ్మాయి ఈ విషయంపై రాస్తే రాసే పద్దతి వేరేలా ఉంటుంది.
nenu 'note' add chesaanu. adi chadivi mallee okasaari prayatninchandi.
@murali,
థాంక్సండి.
ఆ రూము, ఆ మనుష్యులు ఏంటని చెప్పకుండా ఒకసారి పబ్లిష్ చేసి చూద్దామనుకున్నా. మీకు అర్థమయ్యింది.
@motoroian,
I donno what is "Absurdity" technique.
ఉన్నా ఇలానే జీవితకాలం కంటిన్యూ అవటం కూడా కష్టమేమో.
Good technique in writing. Good post.
థాంక్సండి.చాలా బాగా విశ్లేషించారు.
>>ఒక గదిలో పెత్టి తాళం వేసిన పిచ్చిది, మీ పీడకల !! అంటే ఏదో బాధాపూర్వక గతమా?
బాధాపూర్వక గతమైనా కావచ్చు లేదా ఎన్నాళ్ళనుంచో తనని పీడిస్తున్న ఇన్సెక్యూరిటీస్ అయినా కావచ్చు.
>>ఇది ఒక అమ్మాయి దృక్పధంలో రాసినా ఇది రాసింది అబ్బాయని సులంభంగా చెప్పచ్చు.
అమ్మాయి ఈ విషయంపై రాస్తే రాసే పద్దతి వేరేలా ఉంటుంది.
ఇంటరెస్టింగ్ ..మీరు ఎలా అబ్బాయి రాసిందని చెప్పగలిగారో..అమ్మాయి రాసే పధ్ధతి ఎలా ఉంటుందో కొంచం వివరిస్తారా?
@everythingisprecious,
థాంక్సండి. దొరకడం కష్టమే.. కంటిన్యూ అవ్వడమూ కష్టమే.. కానీ ఆశించటంలో తప్పులేదు కదా..
ఇది అందరికీ వర్తించకపోవచ్చు.
" అసలు నా ఇంటిని నేను పెద్దగా పట్టించుకోను " - ఎందుకో ఒక అమ్మాయి ఇలా రాయదు అనిపిస్తోంది.
" దానితో ఉంటే నాకూ పిల్లచేష్టలు వచ్చేస్తాయి. మళ్ళీ పదిమందీ నన్ను చూసి నవ్వుతారేమోనని భయం " - అమ్మాయిలకి బేసిగ్గా పిల్లలంటే ఇష్టం ఎక్కువే. వారు చేసే పనుల్లో కొంటెతనం, చిన్నపిల్లల చేష్టలు కనిపిస్తుంటేనే ఉంటాయి.
"అప్పటినుంచి చాలామంది అబ్బాయిలను ఇంటికి తెచ్చా" - ఒక అమ్మాయి ఇలా రాయదు..
nice logic. well said. I keep this in mind for future posts. Thank u.
What you've written is "Absurd" technique.
oh.. naaku teliyadu. ilaa raayali ani anipinchindi. raasaanu. net lo ee technique gurinchi chaduvutaanu. Thanks for letting me know this.
లోపలున్నామె పిచ్చిదా, జబ్బుదా? పిచ్చిదైతే, అన్నా(న్నే)ళ్ళ తరువాత బయట పడితే, ఖచ్చితంగా లోపలికి వచ్చిన వారిని అటాక్ చేస్తుంది. లేకపోతే ఇంకేదైనా.. abnormal గా. కొన్ని సార్లు వాళ్ళని గాయపరచవచ్చు, లేక తనే గాయపడచ్చు కూడా..! బహుసా, ఇదేనేమో నేను మిస్సింగ్ అనుకుంటున్న ఎంటిటీ.
I wanted to present it in a generic way. అలాగే మానసిక స్థితులను ఒక చందమామ కధలా చెప్పాలనుకున్నాను. అందుకే ఎక్కువ డీటైల్స్ లోకి వెళ్ళలేదు.
idi choodandi
http://en.wikipedia.org/wiki/Theatre_of_the_Absurd
Samuel Beckett's "Waiting for Godot", Ionesco's Rhinocéros are well known examples for this techniques.
Deeniki konchem merugulu diddite wonderful absurd story avutundani naa abhipraayam.
All the best.
బొల్లోజు బాబా
Thanks.
@motorolan,
link intaku munde choosaanu. quite informative. Thanks.
You did spoil my party by that note. ;-) Either make it explicit in the write up itself or just leave it as it is. Many don't enjoy obscurity, but it is great fun for people like me.
You write beautifully, please carry on the good work.
నా పాత పోస్టుల్లో కొన్ని అమ్మాయి గొంతుతోనే ఉన్నాయి. ప్రతీ ఒక్కరి మనసు కొంత అమ్మాయితనము, అబ్బాయితనముల మిక్స్ అని నా అభిప్రాయం.
ఇక 'నోట్' మొదట పెట్టలేదు. కొందరు అర్థం కాలేదని కామెంట్ చేయడంతో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని పెట్టాను.
ఫైనల్ గా 'థాంక్యూ'.
need to check out your older posts.
Thanks and u r welcome.
చివర్లో నోట్ పెట్టకపోయినా, టపాలో కావల్సినన్ని హింట్లు ఉన్నాయి, మీరేం రాస్తున్నారో అర్ధం కావడానికి.
బాగుంది. రాస్తూ ఉండండి.
ఇప్పుడిక మీ పాతవన్నీ చదవాలి :-)
"ప్రతీ ఒక్కరి మనసు కొంత అమ్మాయితనము, అబ్బాయితనముల మిక్స్ అని నా అభిప్రాయం. "...
కరక్టుగా చెప్పారు, atleast నాకు సంబంధించినంతవరకూ.. నేను అనుభవించే ఫీలింగ్స్ కొన్ని, సమకాలీన రచనల్లో కానీ, సినిమా మీడియాలో కాని, అమ్మాయిలకే ఎక్కువ ఆపాదించగా చాలా సార్లు గమనించి ఆశ్చర్య పోతాను. ఏం..సున్నితత్వం కేవలం అమ్మాయిల సొత్తేనా? నిన్న ఎవరో అబ్బాయి బ్లాగులో " 'అమర్ ప్రేమ్' సినిమా చూసొచ్చి గదిలో గుక్క పెట్టి మరీ ఏడిచాను" అని చదివితే I could relate to him, although I neveer watched that movie.
అందుకే, I have some serious reservations about John Gray's work on 'Men are from Mars, Women are from Venus'.
Thank u.
I too doesnt approve of john gray's work completely.
modata bhaagam chaduvutoovuntae connectivity miss ayyindanipinchindi.kaani naaku connect kaani clymax to kottaru.superb.
Thank u.