మేఘంలా నేనెప్పుడూ కరిగిపోతానో నాకే తెలియదు.
ప్రాతహ్ నిశీధిలో ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?..
వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే.
దారిలో ఎవరో పాదాల కింద నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది. కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఖం కూడా కలగదు.
రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది. నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి.
నాకు సముద్రమంత ప్రేమ కావాలి..
చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను. కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే. వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను. విఫలమయ్యాక ఒంటరినయ్యాను.
విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎంత గొప్పదో!).
ఇస్తూ ఇస్తూ.. సముద్రమయ్యాను.
ఒక అనాధ పిల్లల ఆశ్రమాన్ని నడుపుతున్నాను. పిల్లలంటే నాకిష్టం.. ఏ కల్మషమూ లేని సహజమైన భావోద్వేగాలు వారివి.. వారి నవ్వులు, కేరింతలు, కోపాలు.. అన్నీ అపురూపంగా అనిపిస్తాయి. వారి సామాజికస్థాయి తో సంబందం లేకుండా పిల్లలందరికీ చక్కని విద్యాబుద్ధులు, ఆరోగ్యకరమైన ఆహారం, వాతావరణం అవసరమని నేను నమ్ముతాను. అందుకు శాయశక్తులా కృషి చేస్తాను. కృషి అని చెప్పేకన్నా.. its my way of life అని చెప్పడం సబబేమో.
పిల్లలనే కాకుండా సహజమైనది ఏదైనా నన్ను ఆకట్టుకుంటుంది.
కానీ సమాజమే బోలెడు కట్టుబాట్లని, ఆంక్షలనీ, prejudice నీ పెట్టి మనుషుల్ని సహజత్వం నుండి దూరం చేస్తుంటుంది.
సమాజం నాకు నచ్చదు.. కానీ తేలికగా భరించగలను.
ఒక పనిని ఎక్కువమంది మనుషుల ద్వారా.. ఎక్కువకాలం నడవగలిగేలా చెయ్యాలంటే అందుకు ఒక system ని రూపొందించాలి. system.. ఆ తర్వాత rules n regulations.. ఇవన్నీ ఎప్పుడొస్తాయో అప్పుడు అది జీవచైతన్యాన్ని కోల్పోతుంది. end purpose నెరవేరుతుందేమో కానీ spontaneity ఉండదు. Lack of spontaneity is fatal to living.
నేను కూడా అనాధాశ్రమమనే system ని నడుపుతున్నాను. చాలాసార్లు i wont exhibit my usual self. ఎదుటివ్యక్తిని బట్టే ఉంటాను. బయటకి చాలా rigid గా, emotionless గా సముద్రగర్భంలా గంభీరంగా కనపడతాను.
ఈ external exhibition నాకు నచ్చకపోయినా.. అవసరం. The end goal motivates me. బయటి మేకప్ నాలోపలి మనిషిని కలుషితం చెయ్యకుండా over time, I developed a sense of detachment.
నాతో ఇంటరాక్ట్ అయ్యే చాలామంది నాలోని లోపలి మనిషిని కనీసంగా కూడా చూడలేరు.. గుర్తించలేరు. గుర్తిస్తే ఏమవుతారో అన్న ఆలోచన కలిగి ఒక్కోసారి వారితో ఉండగానే లోలోపల తెగ నవ్వేసుకుంటుంటాను.. వీళ్ళు నన్ను అస్సలు భరించలేరు. తట్టుకోలేరు. నిజానికి సహజంగా ఉండడం అదేమంత కష్టమైన విషయం కాదు.. It is the easiest state to be and the most difficult thing to practice.
ఆరోజు చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాను. మా పిల్లలు చేసే ప్రోడక్ట్స్ కి ఒక పేరున్న కంపెనీ బ్రాండింగ్ కోసం సంప్రదింపులు జరిపాను. ఇది వారికీ లాభసాటిగా ఉంటుందని నేను నమ్మినా వాళ్ళు వేరే ఆబ్లిగేషన్స్ మూలంగా ఒప్పుకోలేదు. ఆ ఆబ్లిగేషన్స్ సిల్లీగా అనిపించడం నా ఫ్రస్ట్రేషన్ కి కారణమయ్యుండొచ్చు. కారణమేమిటని నేనెక్కువగా ఆలోచించను. I just let the emotion flow. ట్రైన్లో కొచ్చి నా సీట్లో కూలబడ్డాను. ఓ గంట తర్వాత నా స్పృహ చుట్టూ ఉన్న ప్రపంచం మీదకి వచ్చింది. కంపార్ట్మెంట్ లోని సైడ్ బెర్త్ లో ఓ ఇద్దరు కాలేజ్ కుర్రాళ్లు నా మీద ఏదో కామెంట్ చేస్తూ నవ్వుకుంటున్నారని అర్ధమయ్యింది. ట్రైన్లో జనాలు చాలా పలచగా ఉండడంతో వారు ధైర్యంగా, వినబడేట్టుగా కామెంట్ చెయ్యగలుగుతున్నారు. నా ఎదురుగా 'అతను' కూర్చున్నాడు. మేమిద్దరం, కాలేజి కుర్రాళ్లు తప్పితే కంపార్ట్మెంట్ లో ఇంకెవరూ లేరు. అతను వెకిలిగా ఆ కుర్రాళ్లని సమర్ధించడం గానీ లేదంటే నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి నా మీద జాలి చూపించడం గానీ చెయ్యట్లేదు. కుర్రాళ్లని ఆపడానికి నేను ఏదన్నా చెయ్యొచ్చు కానీ దానికి కూడా మూడ్ లేదు. ఒక్కోసారి అంతే. కాసేపటికి అప్రయత్నంగా కొంగుని భుజాలమీదకి లాక్కున్నాను. 'అరే!.. ఆంటీ సిగ్గుపడుతోంది రా.. దాస్తోంది రా!..' అంటూ ఎక్కువచెయ్యడం మొదలుపెట్టారు. అయినా నాలో స్తబ్దత పోలేదు. ఎదురుగా అతను ఇబ్బందిగా కదలడంతో అసంకల్పితంగా అతని వైపుకి చూసాను. చూపు ఆసక్తిగా అతని దగ్గరే ఆగిపోయింది. అతనిలో నాపట్ల concern కనపడింది. నేనేదో చెయ్యాలన్నట్టు.. వేరే ఏమీ ఆశించని virgin concern. ఆ భావం నన్ను కదిలించింది. లేచి, విసురుగా కుర్రాళ్ల దగ్గరకి వెళ్లాను. నూనూగు మీసాల ప్రాయంలో ఉన్నారు. నేనలా సడన్ గా వచ్చేసరికి గుటకలు మింగారు. ఎందుకో అనుకోకుండా ఆ క్షణంలో వారిపై నాకు జాలి కలిగింది. 'కూర్చోవచ్చా?..' అని అడగడంతో వారు గాభరపడుతూ సీట్ ఆఫర్ చేసారు. నేను వారితో కూర్చొని క్యాజువల్ గా మాటలు కలిపాను. సాటి మనుషుల మీదుండే సహజమైన అభిమానం, గౌరవం తో వాళ్ల గురించి అడిగాను. నా గురించి చెప్పాను. ప్రపంచాన్ని అప్పుడే తెలుసుకుంటున్న వారి ఉద్వేగం, సందిగ్ధతలని చూసి అప్పటి నేనుతో ఐడెంటిఫై చేసుకున్నాను. వాతావరణం తేలికయ్యింది. సరదాగా కొన్ని జోకులు దొర్లాయి. తిరిగి నా సీటు కొచ్చి కూర్చున్నాను. కుర్రాళ్లు ఆ తర్వాత మరి కామెంట్ చెయ్యలేదు. స్త్రీని కాస్తైనా తెలుసుకోనంతవరకే అవహేళనగా చూడగలరు. కొంచం అర్ధం చేసుకున్నా జీవితాంతం ఆ సంభ్రమాశ్చర్యాలతో బతికెయ్యొచ్చు.
అతను నావైపు అభినందనగా చూసాడు. నేను కళ్ళతోనే స్వీకరించినట్టుగా తెలిపాను. సాయంత్రమౌతోందనగా బ్యాగ్ లోంచి కేమెరా తీసి అతను ఖాళీగా ఉన్న సైడ్ లోయర్ బర్త్ దగ్గరకి వెళ్లాడు (అంతకుముందు స్టేషన్లోనే కుర్రాళ్లు దిగిపోయారు). కిటికీ నుండి చూస్తే సాయంత్రం అందంగా ముస్తాబవుతోంది. భానుడితో విరహం తప్పదని తెలిసినా ఆ ఉన్న కాసిన్ని క్షణాలలో అతన్ని మురిపించడానికి ఆరాటపడుతోంది గగనకాంత. ఓ కొసన నల్లని దుఖం ఉబుకుతున్నా గడిపిన క్షణాల గుబాళింపుని తలచుకొని వర్ణాలీనుతుందేమో!.. మెల్లగా చీకటి అలుముకుంది.
'మీకొకటి చూపించాలి..' నా ఎదురుగా కూర్చుంటూ అడిగాడతను. తన కేమెరాని ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేసి చూపించాడు. కిటికీ నుండి సంధ్యని చూస్తున్న నా ఫోటో అది. సైడ్ ప్రొఫైల్.. క్లోజ్ షాట్. కొంచం మసకచీకటిలో లైట్ అక్కడక్కడ తచ్చాడుతూ ఆర్టిస్టిక్ గా ఉంది. ఫోటోలో నన్ను ఆకట్టుకున్న అంశమేంటంటే ముఖం పూర్తిగా కనపడకపోయినా expression స్పష్టంగా కనపడటం.. కళ్ళల్లో ఒకరకమైన తాదాత్మ్యత.. కిటికీ ఊచలని సున్నితంగా చుట్టిన చేతివేళ్లు.. అరపావు విచ్చుకున్న పెదవులు.. కిటికీ ఆవల పొలాల మీదుగా నారింజవర్ణపు పశ్చిమ ఆకాశంలోకి కృంగుతున్న సూరీడు.. ఎవరో మనిషిని కాకుండా ఒక భావనని అందంగా ఒడిసిపట్టినట్టనిపించింది. అభినందనగా చూసాను. అతను మోచేతికి గడ్డాన్ని ఆనించి నా స్పందన కోసమే ఆసక్తిగా చూస్తున్నట్టున్నాడు. చూపులు ఎదురుపడ్డాయి. నేనేంటో అతనికి ఆ క్షణంలోనే తెలిసిపోయినట్టుగా అనిపించింది. లేదు!.. నేను నేనుగా ఉండగలిగే తేలికైన స్థితికి అతని సాహచర్యమేదో ప్రోత్సహించిందేమో. యధాలాపంగా మా మధ్య మాటలు ముచ్చటించాయి. ఆ పరిచయం అలవోకగా మరిన్ని కలయికలని అల్లుకుంది.
శిశిరం నుండి ప్రకృతి వసంతంలోకి సడిలేకుండా జారిపోయినట్టు మా మధ్య దూరం తెలియకుండానే ఎప్పుడు కరిగిపోయిందో.. చనువు లేలేత వాలుకిరణాల్లా ఎప్పుడు చొరబడిందో..
నేనిలా ఉంటాను.. ఇలాంటి మనిషిని.. ఈరోజు ఇలా అనిపించింది.. ఆ రోజు అలా జరిగింది.. అని చెప్పడానికి; నా జీవితానికి, నేను జీవించే ఉన్నానని తెలియడానికి సాక్ష్యంలా ఒకరు కావాలన్న అవసరం నాలో ఎప్పుడో మూగబోయిందనుకున్నా.. అదిప్పుడు పచ్చగా చిగురించింది.. బండరాయి చీలిక నుండి వేళ్లూనుకున్న లేతమొక్కలా.
నేను ప్రవాహమైతే.. అతను గాఢత. మేమిరువురం భావాలని ఒళ్లబోసుకునే శైలి వేరు. ఒక్కోసారి అతను ప్రవాహమైతే నేను పల్లం.
సముద్రమంత ప్రేమని నాకివ్వట్లేదు కానీ.. నా సముద్రమంత మనసుని అతను భరించగలడు.
నేను స్వయంగా అతన్ని కలవాలని ప్రయత్నించను. అతనే చొరవచేసి నన్ను కలుసుకోవాలి. మళ్లీ ఎప్పుడు కలవాలని కూడా అనుకోము. ఇలా మా మధ్య రూలేమీ లేదు. ఓసారి నన్ను కలవడానికి అతనికి సంవత్సరాలే పట్టింది. నాకు అతను ఉన్నాడన్న ఊహ చాలు ఒంటరితనంలో ఎన్నిసార్లైనా ఆహుతవ్వడానికి. మరీ గుబులుని ఆపుకోలేకపోతే దూరం నుండి అతన్ని చూసి నిశ్శబ్దంగా వెనుదిరుగుతాను.
ఇంత స్వార్ధపరురాలిని నేను సోషల్ వర్కర్ గా ఈ అనాధపిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నానని మొదట్లో అనిపించింది. కానీ ఈ స్వార్ధమే.. ఈ బంధమే.. నన్ను ప్రపంచాన్ని మరింతగా ప్రేమించేలా చేస్తుందని గ్రహించాక మరెప్పుడూ ఆ ఘర్షణ కలగలేదు.
మా బంధాన్ని సమాజం నుండి భయపడి దాచుకోవట్లేదు. చెప్పాలనిపించేంత స్వేచ్చ, గౌరవం దానిపట్ల మాకు లేవు.

Comments
ఒక్కో వాక్యం చదివాక మనసు అచేతనమౌతోంది.. ముఖ్యంగా ఇది!
"నేను ప్రవాహమైతే.. అతను గాఢత. మేమిరువురం భావాలని ఒళ్లబోసుకునే శైలి వేరు. ఒక్కోసారి అతను ప్రవాహమైతే నేను పల్లం."
చివర్లో తను అన్న మాటలు 'సమాజానికి భయపడి కాదు ', కొంచెం ఊహించినట్టే ఉన్నాయి.. ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది అలానే చెప్తారు!!
ఇది ఒక్కసారి చదవగానే అనిపించిన సంగతి..
Will be back with more...
btw, బాగా రాశారు అనేది చాలా చిన్నపదం అయిపోతుంది ఇక్కడ!!
ఏదో అభిమానం కొద్దీ అలా పొగిడేసారు గానీ మీ పదాల భావుకత్వం, అందం మాకెక్కడిదీ?..
మీ కవితలకి, రచనలకి నేను పెద్ద అభిమానినండి. అవి చదివి, ఆ సమ్మోహనంలో మునిగి, నా స్పందనని వర్ణించే శక్తి లేక, అశక్తతో వెనుదిరుగుతుంటాను.
నిజానికి రాయడానికి పెద్దగా టైమేమీ తీసుకోనండీ. ఆ కారెక్టర్ కనెక్ట్ కావడానికే టైం పడుతుంది. ఆ కనెక్ట్ అయ్యేది కూడా సడన్ గా, స్పాంటేనియస్ గా అయిపోతుంది. business man వెర్షన్ రాసిన సంవత్సర కాలానికి అతని భార్య పాత్ర ఇలా ఉంటుందేమో అన్న ఆలోచన అనుకోకుండా కలిగి రెండో వెర్షన్ తయారయ్యింది. అప్పుడే మూడవ పాత్రతో కూడా మాటాడిస్తే బావుంటుందేమో అనుకున్నా కానీ తనెలా ఉంటుందో అన్న అవగాహన లేదు. మామూలుగా అయితే ఎప్పుడో తోచినప్పుడు రాద్దామని వదిలేసే వాడినేమో కానీ, మీరు అడిగారని త్వరగా రాద్దామనుకున్నాను. అందుకే దీనిని కొంచం బలవంతంగానే పూర్తిచెయ్యడం జరిగింది.
మీకు నచ్చినందుకు చాలా ఆనందమేసింది. థాంక్యూ.
"సమాజం నాకు నచ్చదు.. కానీ తేలికగా భరించగలను."
"స్త్రీని కాస్తైనా తెలుసుకోనంతవరకే అవహేళనగా చూడగలరు. కొంచం అర్ధం చేసుకున్నా జీవితాంతం ఆ సంభ్రమాశ్చర్యాలతో బతికెయ్యొచ్చు."
"సముద్రమంత ప్రేమని నాకివ్వట్లేదు కానీ.. నా సముద్రమంత మనసుని అతను భరించగలడు."
"మా బంధాన్ని సమాజం నుండి భయపడి దాచుకోవట్లేదు. చెప్పాలనిపించేంత స్వేచ్చ, గౌరవం దానిపట్ల మాకు లేవు."
....మీ బ్లాగుని చాలా ఆలస్యంగా చూసినందుకు బాధ కలిగింది ఒక్క క్షణం.. ఆలస్యంగానే అయినా చూసినందుకు సంతోషంగా అనిపించింది మరుక్షణం... నిజమే..టపా 'చాలా బాగుంది' అన్నది కూడా చాలా చిన్న మాటే అవుతుందండీ..
Fight your own battle అన్నట్టు ఎలాంటి కధానాయక లక్షణాలూ రుద్దకుండా అతన్నలాగే ఉంచడం బావుంది!
నేను అడగకుండా కాస్త ఓపిగ్గా వెయిట్ చేసుంటే ఇంకెంత మంచి కోణం వచ్చి ఉండేదో అనిపిస్తోంది! sorry, for putting pressure on you!
ఇంత బాగా రాసే మీ బ్లాగు నేను రెగ్యులర్ గా చూడకపోవడం నేరం. ఇప్పుడు చూస్తే తెలుస్తోంది, నేను మీ బ్లాగు చివరి సారి డిసంబర్ 2008 లో చదివా. 2009 అంతా బిజీ గా ఉండి బ్లాగు లోకానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు అర్జంటుగా మీ టపాలన్ని చదివేయాలి.
థాంక్యూ!.
@నిషిగంధ,
>>ఎలాంటి కధానాయక లక్షణాలూ రుద్దకుండా అతన్నలాగే ఉంచడం బావుంది!
అవును.. నిజమే!
>>నేను అడగకుండా కాస్త ఓపిగ్గా వెయిట్ చేసుంటే ఇంకెంత మంచి కోణం వచ్చి ఉండేదో అనిపిస్తోంది!
ఇది చదివాక నాకు సడన్ గా సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువచ్చాడు. 'సాక్షి' సినిమా తీసిన చాలా ఏళ్ల తర్వాత బాపు కృష్ణ తో మరో సినిమా చేస్తున్నాడట. ఓ సీన్ కి ఇంకో టేక్ చేద్దామా అని అడిగితే.. 'ఎన్ని టేకులు చేసినా.. ఇంతకంటే బాగా రాదు. సాక్షి తర్వాత ఇన్నేళ్ళలో నేను డెవలప్ అయ్యానని అనుకుంటున్నారేమో. అలా పొరబడకండి.' అని కృష్ణ చెప్పాట్ట.
ఇంకెలా వచ్చేదో అని అనుకోనవసరం లేదండి. మీ పుణ్యమాని త్వరగా పోస్ట్ చెయ్యగలిగాను. లేకుంటే అసలు రాయగలిగే వాడినో.. లేదో.
@independent,
>>కేవలం నాకంటే నాకే ఈ సమయం కావాలి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా అని.
నేనూ చాలాసార్లు ఇలానే ఇష్టపడుతుంటాను.
రాండమ్ గా కొన్ని టపాలు బాగుండడాన్ని చూసి పొరబడకండి. మీ స్పందనకి థాంకులు.
థాంక్యూ!..
మురళి గారి బాధే నాదీ.. ఇంత ఆలస్యం గా చూసానేంటా అని.
@ మురళి - థాంక్స్. మీ వల్ల ఒక మంచి టపా తెలిసింది
స్పందనకి థాంకులు.
మీకు నచ్చినందుకు సంతోషం. ఏదో రాయాలని బలంగా అనిపించినప్పుడే రాస్తుంటాను. అందుకే రెగ్యులర్ గా టపాలు కనపడవు.
బాగా రాయడానికి నాకైతే మంచి ప్రేరణ కావాలి.. బేసిగ్గా నేను కధలు, సన్నివేశాలు వంటివి రాయడానికే ఇష్టపడతాను. కవితలు లాంటివి రాయలేను. మంచి కధావస్తువు దొరికితే ఆటోమేటిగ్గా రచన బావుంటుంది. మొదట్లో విషయం చెప్పాలన్న ఆతృతలో పదాలని పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత సహబ్లాగర్ల చురకలతో కాస్త రాసే పదాల మీద శ్రద్ద పెడుతున్నాను.
మీ స్పందనని పొరపాటున గమనించలేదు.
>>ఈమె మాట్లాడుతున్నా ఎదో ప్రశాంతత, నిశ్శబ్దం అలముకున్నట్టుగా ఉంది. బాగుంది.
అవును.. మీరు చెప్పాక నిజమే అనిపించింది. స్పందనకి ధన్యవాదాలు.
మీరు ముందే చెప్పుండాల్సింది కదా!..బ్లాగ్ పేరుని ఇంగ్లీష్‌లో పెట్టొద్దని.. :)
సర్లేండి.. ఇప్పటికైనా చూసారు కదా!..
స్పందనకి ధన్యవాదాలు.
మీ స్పందన కి థన్యవాదాలు. కధలకి జీవితమే కదండీ inspiration. నా టపా మీకు నచ్చినందుకు సంతోషం.