Monday, September 15, 2008

నెచ్చెలీ!.. నువ్వొస్తావని..

జీవితపు దారిలో నడుస్తూ ఈ చోట నీకోసమని ఆగిపోయాను. నేను వచ్చిన దారిలో విరిసిన ప్రతి పువ్వునీ కోసి అపురూపంగా పట్టుకువచ్చాను. మరి నీకు నచ్చుతాయో.. లేదో. అందుకున్నప్పుడు వాటి ముళ్ళు నిన్ను గాయపరుస్తాయేమోనన్న భయం కూడా ఉంది.

నా కాంప్లెక్సుల ఒంటరి వసారాని ఇంపుగా సంపంగెవై అల్లుకుంటావని...
ఉబుసుపోని ఉక్కబోతలోకి బిగిసిపోయే బంధాల గంధమై వస్తావని ... నీకోసం ఆగిపోయాను.

నాదొక ఒంటరి క్షణం.. నీదొక ఒంటరి క్షణం.. కలిసిన క్షణమది కమనీయమవుతుందని...
నాదొక మాట.. నీదొక మాట.. మురిపాల మూటలై మనసుల్ని వడకాస్తాయని...

నాలోని దాగుండిపోయిన పసివాడు నీ సమక్షంలో బయటకి వచ్చినప్పుడు వాడి మారాన్ని, కేరింతలని కాకిఎంగిలి చేసి పంచుకుంటావని...
నా అనురాగాన్నంతటినీ ముద్దులు చేసి ముద్దలుగా నీకు కొసరి, కొసరి తినిపించాలని...
నీకోసం ఆగిపోయాను.


అలసిపోయి ఇంటికొచ్చిన సూరీడు పశ్చిమప్రౌఢ గుండెల్లో తలదాచుకున్నాడు.
గూటికి చేరుకున్న గువ్వలు జంటగా సేదతీరుతున్నాయి.
ఆరుబయలు ఏటిలో వెన్నెల నగ్నంగా ఆరబోసుకుంది.
నేను ఒంటరిగా నీ తలపులతో తపించాను. ఎదోనాడు ఈ క్షణం మనదవుతుందని...
కాగిన దేహాలు కరిగిన సాక్షిగా మన జీవితలక్ష్యాలకి ఒకరికొకరం ఆజ్యమవుతామని...

20 comments:

మోహన said...

>>బాల్యాన్ని దాటివచ్చాక కూడా ఒకింత మిగిలిపోయింది.
artham kaaledu. ee vaakyamlO edaina padam miss ayyinda ? lEkapote vivarimchagalru.

mee blog koodali.org lo unda ? lekapote.. add cheyyandi.

మురారి said...

@mohana gaaru,
'బాల్యాన్ని దాటివచ్చాక కూడా ఒకింత మిగిలిపోయింది'ante baalyam gadichipoyinaa naalo inkaa 'chinnapillaadu' migilipoyaadu ani. naa blog koodaliki add chestanu. thanks.

Purnima said...

నాకు మొత్తం టపాలో చాలా నచ్చింది ఆ ప్రయోగమే..
’బాల్యాన్ని దాటివచ్చాక కూడా ఒకింత మిగిలిపోయింది'

ఏమనుకోనంటే ఒక్క విషయం చెప్పేదా? ఒక్కింత కాదు, చాలానే బాల్యం ఉంటుంది, మనం దాన్ని గుర్తించలేమంతే! లేదా గమనించలేము. కాకి ఎంగిలి, అని బాగానే చెప్పారు. చిన్నపిల్లాడు అని పై వ్యాఖ్యలో చెప్పారు కనుక ఒకె. కానీ పసివాడని, వాడిని లాలించే తోడు కావాలనీ అంటే ఇంకా బాగుండేదేమో! ఆలోచించండి.

తోచింది చెప్పాను. మీరు అన్యధా భావించరనీ, అస్సలంటే అస్సలు ఏమీ అనుకోరని చిన్ని నమ్మకం. నా నమ్మకం నిజమేనా?

బాగా రాస్తున్నారు. కొనసాగించండి.

రాధిక said...

wow....

రాధిక said...

plz add ur blog in koodali.org

మురారి said...

@purnima garu,
మీ నమ్మకం నిజమే.
కాకిఎంగిలిని మనం తోటి చిన్నపిల్లలతోనే పంచుకుంటాము కదా. నేను పిల్లాడిని అయినప్పుడు తను కూడా పిల్లదైపోయి నన్ను అర్థం చేసుకోవాలని నా భావం. నా రచనలు మీకు నచ్చినందుకు ఆనందమేసింది.

మురారి said...

@Radhika garu,
నా బ్లాగ్ ని కూడలికి కలిపాను. Thanks

మోహన said...

ఈ రచనలో భావం, పదాల ఎంపిక, ప్రతి పదం.. అందులోని గాఢత, ఇంకా పద ప్రయోగాలూ.. ఉదాహరణకి.. 'నా కాంప్లెక్సుల ఒంటరి వసారాని...' ఇలా అన్నీ చాలా నచ్చేసాయి నాకు. "ఊరికే చదివి వదిలేద్దామనుకున్నావా..?" అని ఏదో నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. సరే... పోనీ ఏది బాగా నచ్చిందో చెప్పి అక్కడితో ఆ ఫీలింగ్ నుంచి బయటపడదాం అని.. మళ్ళీ చదివాను. నేనంటే నేను అని ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.... నాకు ముక్తి లేదా..? :( సో... మరోలా అనుకోనని పైన హామీ ఇచ్చారు కావున, కనీసం..ఒక ప్రశ్న ఐనా అడిగెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను... కాబట్టి, నాలో నాతోపాటు పెరిగిన పైత్యానికి పదునుపెట్టి మీ మీద రువ్వుతున్నాను...కాసుకోండి..;-)

మీ హీరోలాగే.. అతడి హీరోయిన్ కూడా.. అక్కడ.. అలాగే.. సేం టు సేం ఆలోచిస్తూ ఎదురు చూస్తుందనుకోండి... ఆమెలోని చిన్నపిల్లని మీ హీరో లాలించగలడా..? ఏంటిది చిన్నపిల్లలా అని విసుక్కోకుండా.... ఇలాగే ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటే..మరి వారు కలిసేదెలా..??

మురారి said...

@మోహన గారు,
నా పోస్టు మిమ్మల్ని అలరిస్తే అంతకన్నా కావల్సినదేముంది? చాలా సంతోషం.

ఇకపోతే ఆమెని లాలించగాలడా.. అంటే అది వాళ్ల మధ్య కుదిరే ట్యూనింగ్ బట్టి ఉంటుంది. ఒకరు మరొకరిని ఇష్టపడటానికి కారణాలు చెప్పలేమేమో.. సేం టు సేం.. ఆలోచిస్తే.. కెమిస్ట్రీ కుదరడానికి చాన్సులు ఎక్కువ. ఇక వారు కలిసేదేలా.. అంటే దానిని విధికే వదిలెయ్యాలి. ఎప్పుడో ఒకసారి తారసపడకపోరు.

బొల్లోజు బాబా said...

ఎంతో ఆర్ధ్రంగా అందంగా ఉంది.

బొల్లోజు బాబా

మోహన said...

మీ అభిప్రాయం పై నా అభిప్రాయం...
ఒక రచన, రచయిత తాలూకు స్వంత అనుభవం కావచ్చు, చుట్టూ ఉన్నవారి ప్రభావం కావచ్చు లేకపోతే అది పూర్తిగా అతడి కల్పన కావచ్చు. ఏదైనా... తన రచనల్లోని పాత్రల కూర్పు, వాటి తలరాతలు నిర్ణయించే శక్తి,హక్కు రచయిత సొంతం. అలాంటిదానిని మీరు విధికి వదిలేస్తారని నే ఊహించలేదు.

"అమెను లాలించగలడా.." అని ఇక్కడ సందర్భాన్ని బట్టి అడిగాను. కానీ అసలు నా ఆలోచన ఇది....
నాకు వచ్చే అబ్బా(మ్మా)యి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా మంది ఆలోచిస్తారు.. in fact, అందరూనేమో...! కానీ "అవే లక్షణాలు అవతలి వ్యక్తి కూడా ఆశిస్తే.. అప్పుడు నేను ఎలా ప్రతిస్పందిస్తాను?" అనే ఆలోచన చాలా ముఖ్యం ఎమో... [ఒక ఇంపైన బంధానికి] ఇది ఇద్దరి మధ్య ఉండే ట్యునింగ్ మీద కంటే.. ఒక వ్యక్తి తాలూకు మనస్తత్వం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని అనిపించింది నాకు.

అంత బాగా ఆలోచించే అబ్బాయి పాత్ర గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనే కుతూహలమే తప్ప రెట్టించి, ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నా అభిప్రాయాలు తెలిపే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ మురారి గారు...

మురారి said...

@బాల్లోజ బాబా గారు,

థాంక్సండీ. కాబోయే సహచరి కోసం అబ్బాయికి ఎంతో అందమైన ఊహలుంటాయి. వాటిని పదాల్లో కొంత వ్యక్తపరిచాను.

@మోహన గారు,
>>.. వాటి తలరాతలు నిర్ణయించే శక్తి,హక్కు రచయిత సొంతం. అలాంటిదానిని మీరు విధికి వదిలేస్తారని నే ఊహించలేదు.

లాలిస్తాడా అన్న ప్రశ్న మీరు ప్రాక్టికల్ గా అడిగారనుకొని అలా చెప్పాను. ఒక రచయితగా అయితే ఒకటి రెండు ట్విస్టులు పెట్టి తర్వాత వారిని కలిపేస్తాను. ఇలా అందమైన జంటని కలపడం అదృష్టంగా భావిస్తాను.

>>..నాకు వచ్చే అబ్బా(మ్మా)యి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా మంది ఆలోచిస్తారు.. in fact, అందరూనేమో...! కానీ "అవే లక్షణాలు అవతలి వ్యక్తి కూడా ఆశిస్తే.. అప్పుడు నేను ఎలా ప్రతిస్పందిస్తాను?" అనే ఆలోచన చాలా ముఖ్యం ఎమో... [ఒక ఇంపైన బంధానికి] ఇది ఇద్దరి మధ్య ఉండే ట్యునింగ్ మీద కంటే.. ఒక వ్యక్తి తాలూకు మనస్తత్వం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని అనిపించింది నాకు.

చాలా బాగా చెప్పారు. ట్యూనింగ్ అంటే నా ఉద్దేశ్యంలో ఇద్దరిమధ్యా ఒకవిధమైన పొందిక కుదరడం. అది మానసికంగా, శారీరకంగానూ. మన చుట్టూ ఉండే చాలా మంది బేసిగ్గా మంచోల్లే. కానీ అందులో ఒకలిద్దరే మనకి క్లోజ్ అవుతారు. దీనికి మన మనస్తత్వం, మన చేష్టలు, మన ఎపియరెన్స్ .. ఇవన్నీ ఆ ఒకలిద్దరితో బాగా కుదరడం వలన..

మీ కామెంట్లు నాకు హాయిగొల్పుతున్నాయి. అస్సలు ఇబ్బంది లేదు.

sujji said...

chaala baagundi..

మురారి said...

@sujji garu,
థాంక్సండీ.

@మోహన గారు,

ఒకమారు పరిమళం జల్లి, మరుమారు పరుషాన్ని విస విసా దించి మరి తరువాత మౌనమేనా.. ఇంతకీ నేను మీకు అర్థమయ్యానా?..

మోహన said...

మురారి గారు...

అడగంగానే... మాటల్లో పెట్టి మూట కట్టి ముట్టచెబుతారా??
అమ్మా.... ఆశ-దోస-అప్పడం...

మిఠాయి పొట్లం చేతిలో పెట్టి, పిల్లా... నాకో ముద్దిస్తావా అని చిన్నప్పుడు ఆటపట్టించిన తాతయ్య గుర్తొచ్చాడు... :)

I am impressed!

మురారి said...

@మోహన గారు,
>>..నాకు వచ్చే అబ్బా(మ్మా)యి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా మంది ఆలోచిస్తారు.. in fact, అందరూనేమో...! కానీ "అవే లక్షణాలు అవతలి వ్యక్తి కూడా ఆశిస్తే.. అప్పుడు నేను ఎలా ప్రతిస్పందిస్తాను?"
mee comment oka saradaa kadhaki oopiriloodutondi.kadha ganuka raaste ( time padutundi) meeku pamputaa.

మోహన said...

చాలా సంతోషం..
All the Best.

మురారి said...

@mohana
Thanks

ఫణీంద్ర said...

బాగుంది.

మురారి said...

@Phaneendra,
thank you.