కాలేజీ రోజులు... యవ్వనమనే కోతి మన లోకి ప్రవేశించిన రోజులు. స్నేహ మాధుర్యాన్ని తెలిపిన రోజులు. అతివ ఆకర్షణ అనే మధువు రుచి మరిగిన రోజులు. నూనూగు మీసాలు, లేలేత కాంక్షలు, friends గ్యాంగులూ, byke సవారీలు, ప్రేమ వ్యవహారాలు.. అబ్బో!! ఆ రోజులే వేరు లెండి. మాది పల్లెటూర్లో ఒక engg college. మొత్తం ఆరుగురం roommates. ఆరుగురవి విభిన్న మనస్తత్వాలు. అయినా స్నేహం అనే పూమాల లో అందం గా ఒదిగిపోయాము. పల్లెటూరు కనుక చాలా సార్లు సాయంత్రం అయితే power పోయేది. happy గా మేడ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకొనే వాళ్ళము. అక్కడ hot hot topics- అమ్మాయిలే మరి. రాత్రి 12 గం..ల కి birth day parties అప్పుడే అలవడ్డాయి. cake cut చేసి పూసు కొన్నాక ఒకళ్ళ మీద ఒకరు నీరు పోసుకొని స్నానాలు చెయ్యటం భలే గా ఉండేది. serious Indoor cricket matchలు, ప్రపంచం లో అతి ముఖ్యమైన పని ఇదే అన్నట్లుగా 'పేకాటలు' అర్థరాత్రి దాటాక కూడా సాగేవి. పరీక్షలొస్తే, చదివింది తక్కువ... హడావుడి ఎక్కువ. ప్రతీ exam అయ్యాక అందరం వచ్చి, అరుగు మీద కూర్చొని, 'నడిపించు నా నావ నడి సంద్రమున దేవ!', ' పాపులము మేము.. ఓ తండ్రీ!' ... ఇలా ఏసుక్రీస్తు పాటలు పాడుకొనేవాళ్ళము. రాత్రి పడుకొనేముందు వీధి చివర పొలం గట్టు దగ్గరికి వెళ్ళి, piss కొట్టే వాళ్ళము. ఆ ప్రోగ్రామ్ పేరు - 'సామూహిక బుల్లి'. second yr 1st sem అనుకుంటాను... మొదటిసారి ఆ టైప్ సినిమా ను చూసింది. రాత్రి ఇంటికి వచ్చాక మానసంతా పాడయిపోయినట్టు, ధర్మభ్రష్టుడను అయిపోయినట్టు నా మీద నాకే అసహ్యం వేసింది. వెంటనే, తలస్నానం చేసుకొని, అంత రాత్రిలో దగ్గర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంకెప్పుడూ ఇలాంటివి చూడనని నిర్ణయించుకొన్నాను. సీన్ cut చేస్తే, ఇంకొక నెల తర్వాత అదే రూమ్ లో వేరే ఆ టైపు సినిమా ని కళ్లింతలు చేసుకొని చూస్తున్నాను. రూమ్ లోకి ఎవరన్నా ఇంటి నుంచి కొత్త బట్టలు పట్టుకొని వస్తే, మిగిలిన వాళ్ళందరి కళ్ళూ మెరిశేవి - 'వీడు first week వాడాక, అవి ఇంక మనవే అని'. ఒకసారి meals parcel తెప్పించుకొని ఒకే ప్లేట్ లో ముగ్గురం తిన్నాము. ఆ అన్నం ముద్ద మాధుర్యం ఇంక ఎప్పటికీ మరిచిపోలేను. ఇలా చెప్పుకొంటూ పోతే, చాంతాడు అవుతుంది. కాలేజ్ వదిలి నాలుగేళ్ళు అయిపోయాయి. కానీ ఇప్పటికీ మనసుకి అతి దగ్గరైన స్నేహితులంటే వాళ్లే... అందమైన రోజులంటే అవే!.
Comments