మనోహరంగా నిద్రలేచాను.. ఈ రోజు వంశీ వస్తున్నాడు. తన
ఆలోచనలతోనే పడుకున్నాను. వాటితోనే నిద్ర లేచాను. వాకిలి
తలుపులు తెరచి బయటకు వచ్చాను. జనవరి మాసపు
ఉదయం ఐదు కావస్తూంది. చల్లగాలి చెలికత్తెలా సంబరంగా
చుట్టుముట్టింది. నక్షత్రాలు అందమైన స్మృతులను
గుర్తుతెచ్చుకొని తమలో తాము నవ్వుకుంటునట్లుగా ఉన్నాయి.
కళ్లాపు చల్లి ముగ్గువెయ్యటం మొదలుపెట్టాను. ముగ్గు వేసానో
లేక నా మనసే గీసానో, వేసాక చూసుకొని గారాలు పోయాను.
ఎందుకో ప్రతీ పనీ ఎంతో అపురూపంగా మురిసిపోతూ చేస్తున్నాను.
పూలు కోసాను. ఆ వంశీకృష్ణునికో ... నా వంశీ కృష్ణునికో..
స్పష్టంగా చెప్పలేను. ఇంక తలంటు స్నానం ... నీ ప్రేమ నన్ను
ఏంచేసిందో గానీ నన్ను నేను మరింతగా ఇష్టపడుతున్నాను.
ఎంత గొప్ప అనుభవమో ఇది!!. స్నానం చేసాక లంగా, వోణీ
వేసుకొని, తడిచిన జుత్తుని తువాలులో చుట్టి, ముడివేసి,
కాళ్ల పట్టీల మువ్వలు సవ్వడి చేస్తుండగా వాకిలి తెరచి
తులసి చెట్టు ముందు దీపం వెలిగించాను. కొంచం దూరం
వెళ్లిచూస్తే, తూరుపు తెలతెలవారుతుండగా చిరు దీపపు
కాంతిలో తులసి మా తల్లి ఎంత శోభగా ఉందో. తర్వాత
అమ్మతో కలసి దేవుడి గదిలో పూజ. ఆ తర్వాత జుత్తు
ఆరబోసుకోడానికి అమ్మ సాంబ్రాణి ధూపం వేసింది.
నా ఊహలో నువ్వున్నప్పుడు ఈ దేహం సుగంధంతో
తొణుకుతుంటుంది కదా.. మరి ఈ ధూపాలెందుకు అనిపించింది.
పిచ్చి అమ్మ .. తనకు తెలియదు కదా!. అప్పటికే ఇంట్లో మిగిలిన
పిల్లలూ, పెద్దలూ అందరూ ఒక్కొకరుగా లేవటం మొదలుపెట్టారు.
ఇంక గమ్మున తెళ్లారింది.
నేను కనకాంబ ఆలయం పక్కన రావి చెట్టు దగ్గర నిల్చొని
చూస్తున్నాను. మా ఊరికొచ్చే బస్సులు అక్కడే ఆగుతాయి. రత్నం
మామయ్య, శిరీష అప్పటికే వచ్చేసారు. అన్నట్టు చెప్పడం మరిచాను
కదా..వంశీ నాకు బావ అవుతాడు.. రత్నం మామయ్య కి కొడుకూ
.. శిరీషకి అన్నయ్యానూ. బయట ఆడుకుంటున్న పిల్లలు నా
చుట్టూ మూగారు. ఇంతలో నాగరాజు బావ వచ్చాడు. తనని నేను
రాజు అని పిలుస్తుంటాను. "వంశీ గురించి వెయిటింగా?"
అనడిగాడు. అవునన్నట్టుగా నవ్వాను. తను కవర్‌లోంచి ఒక
ప్యాకెట్ తీసి నా చేతికిచ్చి, “నేను వెళ్లిపోయాక ఓపెన్ చెయ్యు” అని
చెప్పి వెనక్కి మళ్లాడు. నేను వెళ్లిపోతున్న రాజునే చూస్తున్నాను...
గత సంవత్సరపు మాట. నాకు స్పస్టంగా గుర్తుంది-ఆ రోజు
ప్రేమికుల రోజు. నేను వంశీ గురించి ఈరోజులాగే హైదరాబాద్‌లో
నిరీక్షిస్తున్నాను. వంశీ ముంబాయిలో ఒక ప్రముఖ న్యూస్ చానెల్ కి
పనిచేస్తున్నాడు. నేను సైకాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి
ఇక్కడ హైదరాబాద్‌లో ఒక పర్సనల్ కౌన్సిలింగ్ కన్సల్టెన్సీలో
పనిచేస్తున్నాను. కొన్ని నెలల తర్వాత కలవబోతున్నాము. తను
అక్కడ నుంచి బయలుదేరిన ప్రతీ గంటకీ మొబైల్‌కి మెసేజ్
పంపిస్తున్నాడు. ఇంతలో రాజు వచ్చాడు.

Comments
EMti mIru ammayi svaraM thO raastunnaru anni pOsTulu.
prati vaarilonoo konta ammaayitanam, konta abbaayitanam untundani nenu bhaavistaa.