Skip to main content

Posts

Showing posts with the label stories

అమ్మకి పూలు పూచాయి

సాక్షి దినపత్రిక వారి ఆదివారం అనుబంధం- 'ఫన్ డే' లో ప్రచురించబడిన నా కధ 'అమ్మకు పూలు పూచాయి ' పూర్తి భాగాన్ని దిగువున చదువగలరు.. అమ్మకి పూలు పూచాయి అలా ఉండకూడదనుకున్నా నాలో ఎందుకో అసహనం, కోపం వచ్చేస్తున్నాయి. నేను గొప్పగా భావించుకున్న నా ఆదర్శం నన్నిపుడు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. 'బాలు' ని ఇంటికి తీసుకువచ్చి మూడు రోజులవుతుంది. మేం వాడిని దత్తత తీసుకున్నాం. ఒక బిడ్డని కని, దేశజనాభాని ఒకటి హెచ్చించి, వాడిని పెంచడం కన్నా ఏ ప్రేమకూ నోచుకోని ఒక అనాధకి తల్లిదండ్రులవ్వడం మంచి ఆదర్శమని మా అభిప్రాయం. మా ఇద్దరి అభిప్రాయం అని చెప్పడం కన్నా నా అభిప్రాయమని చెప్పడమే కరెక్టేమో. ఎందుకంటే ఈ విషయమై నా భార్య ప్రణవికి సంవత్సరకాలంగా నచ్చజెప్పుతూ చివరికి ఒప్పించాను. తనకి ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ నా మీదున్న గౌరవం దానిని కప్పేసిందనుకుంటా. అనాధాశ్రమానికి వెళ్లి, బాలు ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాం గానీ వాడు అప్పటినుంచి మాతో సరిగా కలవట్లేదు. ముభావంగా ఉంటున్నాడు. ప్రణవి తన వంతుగా మంచి వంటలు, బొమ్మలతో వాడిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం కనపడట్లేదు. మ...

సుప్రజ..5 ..The End

ఇటు మా వ్యాపారం కూడా పుంజుకుంది. మా కంపెనీ ప్రారంభించి అప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది. రాజు, రంగమ్మ ఇద్దరూ అద్భుతంగా పని చేస్తున్నారు. రాజు బయట నుంచి ఆర్డర్‌లు బాగా తీసుకొచ్చేవాడు.అంతకుముందు ఆటపట్టించిన అమ్మాయిలే ఇప్పుడు రాజు పట్ల అభిమానం, గౌరవం చూపిస్తున్నారు. మా ఉత్పత్తులకి ఆదరణ పెరిగి, మంచి పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఇంకా చాలా మంది మహిళలు మాతో కలిసారు. కొందరైతే పొరుగూరు నుంచి కూడా ఇక్కడకి వచ్చి పని చేస్తున్నారు. చిన్నగా ప్రారంభించిన మా కంపెనీ ఎనిమిది నెలలలోనే పదిహేను లక్షల టర్నోవర్‌ని చేరుకుంది. ఒక ప్రముఖ దినపత్రిక మా కంపెనీ గురించి ఆర్టికల్ వేసింది. నా ఫోటో, రంగమ్మ, రాజుల ఫోటోలు కూడా వేసారు. మా ఊరి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసారు. మమల్ని అభినందించటానికి రామ్మూర్తి మామయ్య, అత్తయ్య వచ్చారు. సభలో రాజు ఎందుకో కొంచం నీరసంగా, ఎక్కడో కోల్పోయినట్లుగా అనిపించాడు. నేను, రంగమ్మ మాట్లాడాక రాజుని ప్రసంగించమని అడిగారు. రాజు తడబడుతూ మైకు అందుకున్నాడు. ఒక రెండు నిమిషాలు నోరు పెగల్లేదు. అప్పుడు అర్థమయ్యింది-రాజు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడని. "ఒకప్...

సుప్రజ..4

రాజు వసతి మా చిన్నాన్న గారి దగ్గర పెట్టించాను. మా చిన్నాన్న వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లు. మనుషులే కాకుండా, చెట్లు, పక్షులు, కుందేళ్లు అన్నీ ఆనందంగా సహజీవనం చేస్తాయి అక్కడ. చిన్నాన్న మా ఊరి ప్రాధమిక పాఠశాల హెడ్‌మాస్టరు. అప్పుడప్పుడు ఊరి ప్రజలకోసం ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తుంటారు. రాజు గురించి చిన్నాన్న వాళ్లకి చూచాయగా చెప్పాను. ఇంక మా ఆఫీషులో అందరూ ఆడవాళ్లే ఒక్క రాజు తప్పించి. అందులోనూ యువత శాతం సగానికి పైగానే. ఎప్పుడూ అమ్మాయిలతో పెద్దగా మాట్లాడని రాజు ఇప్పుడు ఈ పల్లెటూర్లో.. మా మహిళల మధ్య ఉద్యోగిగా ..ఎలా వుంటాడో, అది తనకి మంచి చేస్తుందో లేదో అని నాకు సందేహాలు ఉన్నా రెండు కారణాలు నాలో విశ్వాసాన్ని నింపేవి. ఒకటి మా లిల్లీస్ గ్రూపు లీడర్ రంగమ్మ. మరొకటి స్వచ్ఛమైన మా పల్లెటూరి వాతావరణం. రంగమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తనని చూస్తే పరిచయం లేకపోయినవారికైనా ఆత్మీయరాలుగా కనపడుతుంది. మన బాధలన్నీ తనతో పంచుకోవాలనిపిస్తుంది. నాకైతే తను ఒక మనిషిని చూస్తే ఆ వ్యక్తి యొక్క అలోచనలు, భయాలు, అభద్రతా భావాలు ఇవన్నీ మరుక్షణం తనకి తెలిసిపోతాయెమో అనిపిస్తుంది. ఎప్పుడూ చాలా సంతృప్తిగా కనపడుతుంది. ఒకే సమ...

సుప్రజ..3

నేను రాజు ఎందుకిలా తయారయ్యాడు అని ఆలోచించసాగాను. వంశీ, నేను కలిసి మా అత్తా, మామయ్యలతోనూ, తన ఫ్రెండ్స్‌ తోనూ తనని గురించి విచారించాము. మా అత్తా, మామయ్యలకు తను ఒక్కడే కొడుకు. రాజు వాళ్ల నాన్న అంటే మా రామ్మూర్తి మామయ్య పెళ్లైన కొత్తలోనే బంధువులందరూ ఉన్నమా ఊరు వదిలి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మేమందరమూ మా ఊర్లో కలుపుగోలుగా చాలావరకూ సత్సంబంధాలతో ఉంటాము . రామ్మూర్తి మామయ్యకీ మిగిలిన బంధువులకీ మధ్య రాకపోకలు కూడా తక్కువే. అవసరమయితేనే కనపడతాడు అని చెబుతూ ఉంటారు. ఇక రాజు పెరిగిన తీరు విషయానికి వస్తే, మా అత్తా, మామయ్యలు ఎప్పుడూ ‘చదువు, చదువు’ అని బలవంతపెట్టటమే కానీ ‘పిల్లలు వ్యక్తిత్వపరంగా ఎలా ఎదుగుతున్నారు? వాళ్ల భావోద్వేగాలు ఏంటి?’ అని పట్టించుకొనే వాళ్లుగా నాకు అనిపించలేదు. రాజు క్లాస్‌మేట్స్‌నీ, కొలీగ్స్‌నీ విచారిస్తే వాళ్లు తను చాలా రిజర్వ్‌గా ఉంటాడనీ, తన ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు ఎవ్వరూ లేరని చెప్పారు.దానికి తోడు రాజు ఇంటర్‌మీడియట్ వరకూ కో‌ఎడ్యుకేషన్ విధానంలో చదువుకోలేదు. తనకి కొంచం దగ్గరయిన ఒక ఫ్రెండ్‌ని అడిగితే రాజు తనతో అమ్మాయిలు ఎవ్వరూ మాట్లాడరని బాధపడుతుంటాడని చెప్పాడు. రాజు భవిష్యత్త...

సుప్రజ...2

"ఏంటి వంశీ కోసం వెయిటింగా?" అనడిగాడు. అవునన్నట్టు నవ్వాను. "నువ్వేంటి ఇక్కడ .. ఇలా?" అనడిగాను. "నీకోసమే" అన్నాడు. రాజు ఎప్పుడూ అలా మాట్లాడడు. అప్పుడు గమనించాను రాజు కళ్లు చాలా అశాంతిగా కనిపించాయి. చూపులు అటూ, ఇటూ కదులుతున్నాయి. "ఊ.. చెప్పు బావ.. ఏంటి సంగతులు?" అనడిగాను. కాసేపాగి "సుప్రజా!!, హాపీ వాలెంటైన్స్ డే." అన్నాడు. ఆశ్చర్యంగా, రాజు గొంతు వణుకుతోంది. అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నా వంతు అయ్యింది. కొంచం నవ్వడానికి ప్రయత్నిస్తూ థాంక్స్ చెప్పి, "ఏంటి బావా.. అలా ఉన్నావు?" అని అనునయంగా భుజం మీద చెయ్యి వేసి అడిగాను. "వద్దూ!!" అంటూ ఒక్కసారిగా నా చెయ్యి విదిల్చేసాడు. "ఇలా మాట్లాడే నువ్వు నన్ను మోసం చేసావు." రాజు ఊగిపోతూ ‘నన్ను మోసం చేసావు’ అన్న అదే మాట మళ్లీ మాట్లాడుతున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. మెదడు పనిచెయ్యటం ఆగిపోయినట్లుగా ఉంది. కొంచం సంభాళించుకొని, "ఏంటి బావా.. నేను మోసం చెయ్యడమేంటి.. ఏమి మాట్లాడుతున్నావు నువ్వు?" అన్నాను. "ఆపు!!" అంటూ చేతుల్ని గాలిలోకి బలంగా కొట్టాడు. "ఏమీ త...

సుప్రజ...1

మనోహరంగా నిద్రలేచాను.. ఈ రోజు వంశీ వస్తున్నాడు. తన ఆలోచనలతోనే పడుకున్నాను. వాటితోనే నిద్ర లేచాను. వాకిలి తలుపులు తెరచి బయటకు వచ్చాను. జనవరి మాసపు ఉదయం ఐదు కావస్తూంది. చల్లగాలి చెలికత్తెలా సంబరంగా చుట్టుముట్టింది. నక్షత్రాలు అందమైన స్మృతులను గుర్తుతెచ్చుకొని తమలో తాము నవ్వుకుంటునట్లుగా ఉన్నాయి. కళ్లాపు చల్లి ముగ్గువెయ్యటం మొదలుపెట్టాను. ముగ్గు వేసానో లేక నా మనసే గీసానో, వేసాక చూసుకొని గారాలు పోయాను. ఎందుకో ప్రతీ పనీ ఎంతో అపురూపంగా మురిసిపోతూ చేస్తున్నాను. పూలు కోసాను. ఆ వంశీకృష్ణునికో ... నా వంశీ కృష్ణునికో.. స్పష్టంగా చెప్పలేను. ఇంక తలంటు స్నానం ... నీ ప్రేమ నన్ను ఏంచేసిందో గానీ నన్ను నేను మరింతగా ఇష్టపడుతున్నాను. ఎంత గొప్ప అనుభవమో ఇది!!. స్నానం చేసాక లంగా, వోణీ వేసుకొని, తడిచిన జుత్తుని తువాలులో చుట్టి, ముడివేసి, కాళ్ల పట్టీల మువ్వలు సవ్వడి చేస్తుండగా వాకిలి తెరచి తులసి చెట్టు ముందు దీపం వెలిగించాను. కొంచం దూరం వెళ్లిచూస్తే, తూరుపు తెలతెలవారుతుండగా చిరు దీపపు కాంతిలో తులసి మా తల్లి ఎంత శోభగా ఉందో. తర్వాత అమ్మతో కలసి దేవుడి గదిలో పూజ. ఆ తర్వాత జుత్తు ఆరబోసుకోడానికి అమ్మ సాంబ్రాణి ధూపం...

dark corner..7..The End.

నాకు ప్రపంచంలో నా అంత అద్రుష్టవంతుడూ, అలాగే నా అంత దురదృష్టవంతుడూ ఉండరనిపించింది. అద్రుష్టవంతుడని ఎందుకంటే కోరుకున్న అమ్మాయి దగ్గరవ్వబోతోంది. దురదృష్టవంతుడని ఎందుకంటే ఈ రోజే చనిపోబోతున్నాను కాబట్టి. ఒక్క క్షణం ఈ దెయ్యం ఎపిసోడ్ అంతా కల అయ్యుంటే ఎంత బాగుండో అనిపించింది. కానీ అలా కాదుగా. ఈ రోజంతా కూడా ఆ దెయ్యం అమ్మాయి నా చుట్టూ తిరుగుతూ కనపడింది. నేనే పట్టించుకోలేదు. కానీ దీనివలన నా జీవితమే మారిపోయినట్టు అనిపించింది. ఈ దెయ్యమే నా జీవితంలోకి రాకుంటే ఈ రోజు ఇంత అద్భుతంగా గడిచేది కాదు. అసలు నేను తనకి ఎప్పుడూ propose చేసేవాడినే కాదేమో. తను హాపీగా ఇంకొకడిని పెళ్లి చేసుకొనేది. అసలు ఎప్పుడూ నేను ఈ రోజంతలా ధైర్యంగా, నేను నేనుగా, నన్ను నేను ఇష్టపడుతూ జీవితాంతం కూడా గడిపేవాడిని కాదేమో. అలాంటి బ్రతుకు బ్రతికీ ఏమి ప్రయోజనం? అర్థవంతమైన ఈ ఒక్కరోజు చాలు. ఇకనైనా బ్రతికితే ఇలాగే బ్రతకాలి. ఈ రోజు ఉదయం వరకూ వ్యర్ధమనుకున్న బ్రతుకు చీకటి పడేసరికి ఎంత అందంగా తయారయ్యిందో. ఇలాంటి అనుభూతినిచ్చిన ఆ దెయ్యానికి థాంక్స్ చెప్పాలనిపించింది. చుట్టూ చూస్తే తను కనపడింది. ఎందుకో భయమనిపించలా. తన వైపు చూసి థాంక్స్ థాంక్స్ అన...

dark corner..6

సీటులో కూర్చొని ఏమి చేద్దామా అని అటూ, ఇటూ చూసాను. బద్దకంగా పరిశీలించి నా మొబైల్ తీసుకొని, ఫ్రెండ్స్ అందరికీ కాల్ చెయ్యడం మొదలుపెట్టాను. ఇదయ్యేసరికి మళ్లీ టీ బ్రేకు. టీమ్ మేట్సు అందరమూ కూర్చున్నాము. సుమన, శ్రీకాంత్ కూడా. ఈ రోజు శ్రీకాంత్ గాడి షర్ట్ కలర్, సుమన డ్రెస్సు కలర్ కొద్దిగా మ్యాచ్ అయ్యాయి. దానికి మిగిలిన వాళ్లు వాళ్లిద్దరినీ టీజ్ చెయ్యటం మొదలుపెట్టారు. నాకు ఎప్పటిలాగే మండిపోతోంది. ఈ ముసుగులో గుద్దులాట అనవసరం అనిపించింది. నేను సుమనని ఒక ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలని పిలిచాను. తనని కొంచం దూరంగా తీసుకెళ్లాను. “ఏంటి మాట్లాడాలన్నావు” అని అడిగింది. కాసేపు మౌనం. తర్వాత సూటిగా చూస్తూ చెప్పాను- " నువ్వంటే నాకు చాలా ఇష్టం సుమనా!."అని. “ప్రొపోజ్ చెయ్యడానికి ఈ ambience బాగోదు అని తెలుసు. కానీ ఆ శ్రీకాంత్ గాడితో నిన్ను జత కట్టి టీజ్ చేస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది.” అని చెప్పాను. తను ఏమీ మాట్లాడలేదు. బాగా ఎమోషనల్ అయ్యానేమో- నా శ్వాస వణుకుతోంది. కొంచం కంట్రోల్ లోకి వచ్చి “ఇప్పుడే నీ అభిప్రాయం కనుక్కోవాలని కాదు. కొంచం టైమ్ తీసుకొని నీకు నచ్చినప్పుడు నిర్మొహమాటంగా చ...

dark corner..5

చదివాక నేను ఉన్న స్థలంలోనే నెమ్మదిగా పట్టు కోల్పోతున్నట్లుగా కూర్చుండిపోయాను. చాలాసేపు అలానే ఉండిపోయాను. నేనేమీ ఏడ్వలా. లేచి ఆఫీషుకి బయలుదేరాను. మెల్లగా నేను ఈ మెంటల్ సఫరింగ్ నుంచి రిలీవ్ అవుతున్నట్లు అనిపించింది. అంతిమ గమ్యము తెలిసిన బాటసారి, ఆ బాటలో ఎలా కంఫర్టబుల్ గా నడుచుకుంటూ పోతాడో అలా నేనూ నడుస్తున్నాను. రేపు నా ప్రాణం పోతుందన్నవిషయం తెలిసిపోయాక ఎందుకో నాకు పెద్దగా బాధ కలిగించట్లేదు. భయం కూడా వెయ్యట్లేదు. బహుశా చనిపోవడం వలన నేనేమీ కోల్పోవడం లేదేమో. అసలు నా లైఫ్ లో గర్వించదగిన క్షణాలు అంటూ ఏమీ లేవేమో. చిన్నప్పటి నుంచీమా అమ్మ ఎప్పుడూ దేనికీ గర్వపడకూడదని నూరిపోసేది. చిన్నప్పుడు మాది దిగువ మద్యతరగతి కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలు, తర్వాత నేను. మా నాన్న ఏ బాధ్యతలూ పట్టని మనిషి, తాగుడు అలవాటు ఉంది. అమ్మ మమ్మల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచేది. అమ్మ తను కోల్పోయినవన్నీ మమ్మల్నీ మంచి స్థితిలో పెట్టడం ద్వారా సాధిద్దామనుకుందేమో. నాకు ఇప్పటికీ గుర్తు- 4వ తరగతిలో నాకు లెక్కల్లో యాభైకి నలభై నాలుగు వచ్చాయి. నేనే ఫస్టు. స్కూల్ అయ్యాక పరిగెత్తుకొంటూ ఇంటికెళ్లి అమ్మకి చెప్పాను. ఇంకా ఎక్కువ తెచ్చుకొవాలి ...

dark corner..4

తను అందంగా ఉంది కానీ పాలిపోయిన తెలుపు. కళ్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. కనుపాపలు గాఢనీలం రంగులో ఉండి, కళ్లు ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా చాలా మిస్టీరియస్‌గా ఉన్నాయి. నేను అలా చూస్తూండగా ఎప్పుడు మాయమైపోయిందోగానీ ఇంక కనపడలేదు. దమ్ము చివరికి వచ్చేసింది. ఏదో సినిమాలో చూపించినట్టు ఈ ఆత్మలు మనుషులని తాకలేవు కాబోలు.. అందుకే నన్ను ఏమీ చెయ్యలేదు అని అనుకుంటుండగానే వెనక నుంచి నా భుజం మీద ఎవరిదో చెయ్య పడింది. పరిగెడదామనిపించింది. కాళ్లు కదలలేకపోతున్నాయి. విజ్జుగాడిని లేపడానికి అరవాలనిపించింది. నోరుపెగలట్లేదు. ఎవరో గొంతుని గట్టిగా పట్టేసినట్లనిపించింది. ఊపిరి ఆడట్లేదు. ఇంకొక పదినిమిషాలు అలాగేఉంటే చచ్చిపోతానేమో అనిపించింది. "ఏరా!! నిద్ర పట్టట్లేదా? " అన్న విజ్జుగాడి గొంతు వెనక నుంచి విని అర్థమయ్యింది చెయ్యి వేసింది వాడేనని. మళ్లీ బ్రతికినట్టనిపించింది. అప్పటికీ ఇంకా గొంతు పూర్తిగా రావట్లేదు. అవునన్నట్టు వాడివైపు చూసాను. నా ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. నన్ను చూసి, "హే!!, ఆర్ యు ఆల్‌రైట్?" అని దగ్గరికి వచ్చి అడిగాడు. "యా.. ఐ యామ్ ఫైన్" అని జరిగింది వాడికి చెబుదామని వాడి...

dark corner..3

సాయంత్రం ఏడయ్యేసరికి ఆఫీషు నుంచి బయటపడ్డాను. రూము కి వెళ్లాలనిపించలేదు. విజ్జు గాడికి కాల్ చేసాను- రూముకి రమ్మని. ఫష్ట్ఎక్కడన్నా కలిసి తిందాము అన్నాడు. "సరే" అన్నాను. తినడము అయ్యాక "సినిమా" అన్నాడు. షారూఖ్ ఖాన్ కొత్త సినిమా. అందులో హీరోయిన్ చనిపోయాక ఆత్మగా మారి విలన్ మీద పగ తీర్చుకొంటుంది. సినిమా నుంచి తిరిగివస్తూంటే ఈ ఆత్మల టాపిక్ మా మధ్య వచ్చింది. వాడు చదివిన కాష్మొరా నవల లోని కొన్ని సన్నివేశాలు చెబుతున్నాడు. ఆత్మలు మన చుట్టూ ఉంటాయనీ, అప్పుడప్పుడు అవి మనల్ని ఆవహించి వాటి కోరికలు తీర్చుకుంటాయనీ ఏవేవో చెబుతున్నాడు. ఇంతలో రూము వచ్చేసింది. అప్పటికే రాత్రి ఒంటిగంట కావస్తుండటంతో ఇద్దరమూ పడకలు వేసాము. ఒక పదినిమిషాలు మాట్లాడుకొని సైలెంట్ అయిపొయాము. అలామాట్లాడుకుంటున్నప్పుడు నాకేదో పట్టీల చప్పుడు వినిపించినట్టయ్యింది. నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు. మా కింద రూము లో ఫేమిలీస్ ఉంటారు. అందులో లేడీస్ ఎవరన్నా లేచారేమో అనుకున్నా. ఒక పావుగంట నిశ్శబ్దంగా గడిచింది. విజ్జుగాడు పడుకున్నట్లు ఉన్నాడు. నిద్రలోకి జారుకోబోతుండగా మళ్లీ ఘల్లు మంది. ఈసారి కొంచం దగ్గరగా… గతుక్కుమన్నాను. పక...

dark corner...2

హైమా నన్ను వాళ్ల ఇల్లు చూపిస్తూ ఉంది. నేను వాళ్ల ఇల్లు చూడటం కన్న తననే ఎక్కువ చూస్తున్నాను. టైట్ టీషర్ట్ లో సెక్సీగా ఉంది. తన బెడ్‌రూమ్ కి తీసుకువచ్చింది. అంతవరకూ మామూలుగా వున్న హైమ బెడ్‌రూమ్ లోకి వచ్చేసరికి తన బాడీలాంగ్వేజ్ మారిపోయింది. మోహంతో రగులుతున్నట్లుగా నగ్నమైన కోరికలా అనిపించింది నాకు. తను బెడ్ మీద పడుకొని నన్ను రమ్మన్నట్లుగా కైపుగా చూసింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. దగ్గరికి వచ్చాను. నాకు పిచ్చి ఎక్కిస్తున్న తన బ్రెస్ట్స్ వైపే చూస్తూ, చేతులు వాటి మీద వేసాను. చేతులు వేసేసరికి అవి చిన్నవైపోయాయి. ఏమిటిది?!! అని చూస్తే అక్కడ హైమ స్థానంలో నా ఫిగరు సుమన ముఖం ఉంది. చాలా భయంకరంగా ఉంది…ముఖమంతా డార్క్ గ్రీన్ కలర్‌లో, కళ్లు రెడ్ గా నన్ను కోపంగా చూస్తున్నాయి. నేను అదిరిపడి దూరం జరిగాను. చూడబోతె, ఆ బెడ్ చుట్టూ మా ఆఫీషు వచ్చేసింది. మా ప్రొగ్రామ్ మనేజర్, ఇంకా కొందరు కొలీగ్స్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. అందరికీ హైమ మీద నాకున్న దురాలోచనలు తెలిసిపోయినట్లుగా ఉంది. “అబ్బా!!.. ఏమిటీ ఘోర అవమానం!!.” అనుకున్నాను. ఈ పరిణామాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దిగ్గున లేచాను. కల చెదిరింది. " ఏమ...

Dark Corner..1

తలుపు శబ్దం చెయ్యకుండా తెరుచుకుంది. తలుపు తెరిచాక రూమ్ ఎందుకో ఎప్పటిలా నిర్జీవముగా అనిపించలేదు నాకు. చీకటి రూము, మనసు మూలల్లోని చీకటి పొరలా ఉంది. నా ఆలొచనకి నాకే నవ్వు వచ్చింది. రూమ్మేట్ ఆన్ సైట్ కి వెళ్లాడు. ఇప్పుడు నేనొక్కడినే రూంలో. బెడ్ మీద వాలి, టి.వి ఆన్ చేసాను. నిరాసక్తంగా ఛానెల్లు మార్చుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ కాల్స్. రాత్రి 1.30 కావస్తూంది. ఇంక పడుకుందామని టి.వి, లైటు ఆఫ్ చెసాను. రూం నిండా చీకటి పరచుకొంది. పక్క వీధి స్ట్రీట్ లైటు వెలుగు కిటికీ గ్లాసు ద్వారా ఎదురుగా గోడ మీద గాఢ నీలపు కాంతిలో పడుతున్నది. అప్రయత్నంగా నా ద్రుష్టి ఆ వెలుగు మీద పడింది. అక్కడ ఏవో నీడలు కదులుతున్నాయి. ఒక్కసారిగా గుండెలు అదిరాయి. ఇంత రాత్రి వేళ ఏంటి కదులుతూంది అని!. కొంచం పరిశీలనగా చూస్తే నీడలు మనిషివి లా అనిపించలేదు. కొంచం ధైర్యం వచ్చింది. ‘ఏంటి ఈ రోజు ఇలా భయపడుతున్నాను’ అనుకున్నాను. ‘కమాన్ శీనూ!!, నువ్వు భయపడటం ఏంటి?’ అని కొంచం మోటివేట్ చేసుకొని పడుకున్నాను. కిటికీని ఆనుకొని వుంది పరుపు. మెల్లగా నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోబోతూండగా ఎదో శబ్దం వినిపించింది. ఎవరో కిటికీ అద్దాన్ని వేలితో చిన్నగా ర...