Skip to main content

సుప్రజ..3

నేను రాజు ఎందుకిలా తయారయ్యాడు అని ఆలోచించసాగాను.

వంశీ, నేను కలిసి మా అత్తా, మామయ్యలతోనూ, తన ఫ్రెండ్స్‌

తోనూ తనని గురించి విచారించాము. మా అత్తా, మామయ్యలకు

తను ఒక్కడే కొడుకు. రాజు వాళ్ల నాన్న అంటే మా రామ్మూర్తి

మామయ్య పెళ్లైన కొత్తలోనే బంధువులందరూ ఉన్నమా ఊరు

వదిలి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మేమందరమూ మా

ఊర్లో కలుపుగోలుగా చాలావరకూ సత్సంబంధాలతో ఉంటాము .

రామ్మూర్తి మామయ్యకీ మిగిలిన బంధువులకీ మధ్య రాకపోకలు

కూడా తక్కువే. అవసరమయితేనే కనపడతాడు అని చెబుతూ
ఉంటారు. ఇక రాజు పెరిగిన తీరు విషయానికి వస్తే, మా అత్తా,

మామయ్యలు ఎప్పుడూ ‘చదువు, చదువు’ అని బలవంతపెట్టటమే

కానీ ‘పిల్లలు వ్యక్తిత్వపరంగా ఎలా ఎదుగుతున్నారు? వాళ్ల

భావోద్వేగాలు ఏంటి?’ అని పట్టించుకొనే వాళ్లుగా నాకు

అనిపించలేదు. రాజు క్లాస్‌మేట్స్‌నీ, కొలీగ్స్‌నీ విచారిస్తే వాళ్లు

తను చాలా రిజర్వ్‌గా ఉంటాడనీ, తన ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు

ఎవ్వరూ లేరని చెప్పారు.దానికి తోడు రాజు ఇంటర్‌మీడియట్

వరకూ కో‌ఎడ్యుకేషన్ విధానంలో చదువుకోలేదు. తనకి

కొంచం దగ్గరయిన ఒక ఫ్రెండ్‌ని అడిగితే రాజు తనతో

అమ్మాయిలు ఎవ్వరూ మాట్లాడరని బాధపడుతుంటాడని చెప్పాడు. రాజు
భవిష్యత్తు ఏంటని అప్పుడు ఆలోచిస్తే, తను హైదరాబాద్‌లో ఇంక
కొన్నాళ్లవరకూ ఉద్యోగం చెయ్యలేడని అనిపించింది. పొనీ వేరే
సిటీలో ఉద్యోగం చూసుకున్నా, ఆ రోజు జరిగిన సంఘటనలు,
వాటి పరిణామాలు (తను జైలుకెళ్లడం, ఉద్యోగం పోవడం)
వీటన్నింటివలన తను అమ్మాయిలని మరింత ద్వేషించుకుంటాడు.
అమ్మాయిల పట్ల తనకున్న అపోహలు, ఆత్మన్యూనతా భావము
అలానే ఉండిపోతాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయం
తీసుకున్నాను. వంశీకి చెప్పాను. అది చాలా రిస్క్ అని తను
మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పించగలిగాను. తర్వాత ఈ
విషయం గురించి మా అత్తా, మామయ్యలతో మాట్లాడాము. వారు
నిర్లప్తంగా ‘సరే’ అన్నారు. నేను రాజు దగ్గరికి వెళ్లి "నీకు మా
ఊర్లో ఉద్యోగం ఇప్పిస్తాను. నాతో వస్తావా?" అనడిగాను. కాసేపు
మౌనంగా ఉండి, ‘సరే, వస్తాన’న్నాడు. ‘ఏ ఉద్యోగం?
ఎలాంటి పని?..’ లాంటి కనీస వివరాలు కూడా అడగలేదు.

ఇంక మా ఊరు వచ్చి నేను ఒక చిన్న కంపెనీ ప్రారంభించాను.
నాకు ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉన్నా అంత త్వరగా
చేస్తాననుకోలేదు. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలలోని
నాకు తెలిసిన ఒక ఇరవై మంది సభ్యులుగా చేరారు. రంగమ్మ
వీళ్ల గ్రూపు లీడరు. మొదట ఉన్ని ఉపయోగించి శాలువాలు
తయారుచెయ్యడం, వాటి మీద ఆర్ట్ వర్క్ వెయ్యటం, కర్ర మరియు
గ్లాసు ఉపయోగించి గృహాలంకరణ వస్తువులు, అందమైన
హాండ్‌బ్యాగులు తయారుచెయ్యటం తదితర అంశాలపై శిక్షణ
ప్రారంభించాము. మా కంపెనీకి ‘లిల్లీస్’ అని పేరు పెట్టాము. రాజు
మా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముభావంగానే
బాధ్యతలు చేపట్టాడు. వంశీ ఉద్యోగనిమిత్తము యూరప్ వెళ్లవలసి
వచ్చింది. మా ప్రేమ విషయం తను అటునుంచి వచ్చాక ఇరువర్గాల
పెద్దలకీ చెబుదామనుకున్నాము.

Comments

Dileep.M said…
మీ బ్లాగు పేరే విచిత్రం గా ఉంది.
---
ఈ సుప్రజ కధ అయితే దీనిలో అన్ని పేరా లు ఒకరు రాసినవేనా అనిపించింది. కధలో క్యారెక్టర్లు కూడా చిత్రంగా బిహేవ్ చేసాయి.
ఎలా అంటే
సుప్రజ-1 లోని మొదటి పేరా కు రెండో పేరాకు ఒక్కసారిగా అంతరం కనిపించింది.
ఈ వాక్యం తో ఆహ్లాదమైన పల్లెటూరి వాతావరణం లో ఉన్న అచ్చతెలుగు అమ్మాయి తన గతం
లోకి వెళ్ళిపోవడం తో
మొత్తం మారిపోయింది.
--
ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ లో అనుకోకుండా(ఆమె దూరంగా జరిగే ప్రయత్నాన్ని అపడం కోసం ) చున్నీ
చేతులోకి వచ్చిందనీ అర్ధమవుతోంది . బావ వక్కసారిగా మృగం గామారిపోయాడు. ఇది
పేపర్ల లో పేయడం ,
జైలు శిక్ష వేయడం వరకూ అయితే మామూలు కధకు ok కానీ తరువాత ఆమె సేవలు చెయ్యడం. తరువాత ఆమె ఉద్యోగం మానెయ్యడం, అతనికి ఉద్యోగం ఇవ్వడం, కాళ్ళ మీద పడడం ఇవి కొంచం అసహజం గా వున్నా యి .
ఇవన్నీ అమె కు హీరోయిజం(అనచ్చా)
ఆపాదించే ప్రయత్నాల లా
కనిపించాయి.

మధ్య లో ఎందుకు అలా చేసాడో అనీ వ్యాఖ్యానం లో justification అనిపించలేదు .
----


మీరు వర్ణనలు బాగా చేస్తారు. మొదటి పార్టు లో రెండు పేరాలు చదివిన నాకు తరువాతవి నిరాశ కలిగించాయి.
-------
క్లుప్తం గా ఒక స్త్రీవాద కధ ను పురుష.. (ఏమనాలో) లో వున్నట్టుంది.
---
@Dileep.m,
నా ఆలోచనలనూ, ఆవేశాలను మాటల కౌగిలింతలుగా ఇస్తున్నాను కాబట్టి 'Free Hugs' అని పేరు పెట్టాను.

ఇక స్టోరీ విషయానికొస్తే , నేనంతలా ఆలోచించలేదండీ. I just felt like telling this story the way i imagined. కధప్రారంభంలో సుప్రజ యొక్క అందమైన మనసుని ఆవిష్కరించాలని అలా రాసాను. మధ్యలో తనకీ, వంశీ కి మధ్యలో Love track పెట్టి ఆ బ్యూటీ ని కంటిన్యూ చేద్దామనుకున్నా. కానీ పెద్దదవుతుందని ఆపేసా. I have continuities in my imagination. But I might have failed a bit while putting in words.
Dileep.M said…
ఎందుకు ఆపేసారండీ అలా.. ఎలాగూ ఐదు పార్టు లలో రాసారు కదా. పెద్దది అనే ప్రశ్న ఏమివుంది. ok . nExt time అలాంటి చిత్రీకరణ తో కొనసాగించండి.
--
మీ ఆ గది లో (రూము లో) మొదటిసారి చదివినప్పుడే మనసు లోని వివిధ కోణాలు అని అర్ధం అయ్యింది కానీ
కొన్ని ప్రశ్నలు raise అయ్యాయి. (అవి ఇప్పుడు కూడా అడగడం లేదు . ) అందువల్ల confuse అయ్యినట్టుఅనిపించింది అంతే.
--
మరిన్ని పోస్టులు రాయండి.
--
peddadi ani kaakapoyinaa, frank ga cheppalante baddakam vesindi. thanks for the comments. veelunte naa paata posts lo 'Dark corner' ane story chadivi mee abhipraayaalu cheppandi.