Skip to main content

Posts

Showing posts from November, 2019

యమున

ఆమెకి బాల్యంలో కోపిష్టి ఐన తండ్రంటే భయం. ఏడేళ్ళకే పక్కింటి అన్నయ్య ఎవరూ లేనప్పుడు ఆబగా తడిమేస్తుంటే.. ఆ నిస్సహాయత.. ఆమెకి పరిస్థితులపై పోరాడే స్ఫూర్తిని చంపేసింది. 17 ఏళ్లకి ఇంటిలో దొరకని ప్రేమని, ప్రేమపై అందమైన భాష్యాలు చెప్పే కాలేజి లెక్చరర్‌లో వెతుక్కుంది. ఆమె ఇచ్చిన తొలిముద్దుని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసేసరికి హతాశురాలైంది. ఆమె ఊహించుకున్న అందమైన ప్రపంచం ముక్కలైపోయింది. చనిపోదామనుకున్నా చావుకన్నా భయంకరమైన మానసికవేదనే తనకి సరైన శిక్ష అనుకుంది. అసలు తన జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యమూ ఆమెలో లేదు.. అది ఆత్మహత్యైనా సరే. 21 ఏళ్లకి ఇంట్లో వాళ్లు పెళ్ళిచేసేసారు. అప్పట్నించి రాత్రైతే నరకం. మనసుని తాకని భర్త తనువుని తాకుతుంటే ఏ స్పందనా కలిగేది కాదు. విసిగిపోయిన భర్త ఒకరోజు తన లవర్‌ని తన బెడ్‌రూమ్‌కి తెప్పించుకొని 'ఈమెని చూసి నేర్చుకో.. మగాడ్ని ఎలా సుఖపెట్టాలో' అంటూ రెచ్చిపోయాడు. 'వీడియో తీసుకొని మరీ చూసి తెలుసుకో' అన్నాడు. ఆమె వీడియో తీసింది. తరువాతిరోజు నుంచీ ప్రతీ రాత్రి ఒకటే పోరు - 'ఆ వీడియోలోని అమ్మాయిలా స్పంది...

ప్రపోజల్

కావ్య ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టింది. సగటు టీనేజ్ ఊహలు, ఐడెంటిటీ క్రైసిస్ ఆమెకీ ఉన్నాయి. కానీ తనని అబ్బాయిలు చూడడం లేదని ఆమెకి లోలోపల చాలా బాధగా ఉండేది. చూడడం అంటే అందమైన అమ్మాయి కనపడగానే అబ్బాయిలు ఒకరకమైన మైమరుపుతో అలా చూస్తుండిపోతారే.. అలాంటి చూపులు తనకి కావాలి. "తన వక్షోజాలు చిన్నవి.. అందుకే అబ్బాయిలు తనని చూడడం లేదు.." అన్న ఫీలింగ్ ఆమెలో గాఢంగా నాటుకుపోయింది. ఎవరో అబ్బాయి "ఫ్లాట్ స్క్రీన్" అని తన గురించి మాట్లాడుకోవడం ఆమెకి గట్టిగా తగిలింది. అప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ ఇదే ఆలోచన. అద్దంలో తనని తాను చూసుకుంటుంటే కోపం. టైట్ డ్రెస్ వేసుకుంటే తన లోపం తెలిసిపోతుందని.. లూజ్ డ్రెస్ వేసుకుంటే ముసలమ్మ అంటారని.. ఇలా రోజూ డ్రెస్ వేసుకోవడమన్నది కావ్యకి ఒక సమస్య. సెల్ఫీ దిగడమొక సమస్య. ఫ్రెండ్స్‌తో బీచ్‌కి వెళ్లాలంటే సమస్య. అప్పటి వరకూ సరదాగా ఉండే తను సడెన్‌గా ఎందుకు మూడీగా ఐపోతుందో తనకే తెలియదు. కావ్య పేరెంట్స్‌కి ఇవేమీ పట్టవు. వాళ్లకి కావల్సిందల్లా ఆమె వీక్లీ టెస్టుల్లో తెచ్చుకుంటున్న ర్యాంకులే. ఇన్ఫిరియారిటీ, పేరెంటల్ ప్రెజర్‌తో సతమతమవుతున్న కావ్...

ఆ కాంక్ష!..

శశాంక్ ఇప్పటివరకు పోర్న్ చూడలేదు. చాలా సున్నితమనస్కుడు తను. నల్లగా, సన్నగా.. అందవికారంగా ఉండడు కానీ అందగాడు కాదు. ఇళయరాజా పాటలు, సిరివెన్నెల సాహిత్యం, వెన్నెల, పెయింటింగ్.. ఇలా అతని కాలేజి జీవితం హాయిగా గడిచిపోయింది. ఏ అమ్మాయీ అతనితో ఫ్రెండ్షిప్ చేసింది లేదు. అతను పనిగట్టుకొని అమ్మాయిల కోసం ట్రై చేసే టైపూ కాదు. తనని అర్థం చేసుకునే ఒకరిద్దరి ఫ్రెండ్స్‌తో ఏ అద్భుతమూ లేకుండా సాధారణంగా సాగిపోతుండగా తెలియకుండానే ఒక అద్భుతం అతని జీవితంలోకి చొరబడింది. ఆ అద్భుతం పేరు - ఆకాంక్ష. పెద్ద అందగత్తె కాదు కానీ ముఖంలో కళ ఉంటుంది. ఇంజనీరింగ్ అయ్యాక ఓ కాలేజిలో ఫాకల్టీగా చేరిన శశాంక్‌కి ఈమె కొలీగ్. తొలిరోజుల్లో పొడి, పొడి పలకరింపులే క్రమంగా ఊసుల చిరుజల్లులయ్యాయి. ఇద్దరికీ ఇళయరాజా పాటలన్నా, వర్షమన్నా, వెన్నెలన్నా ఇష్టం. తన చిన్న చిన్న ఫీలింగ్స్‌ని కూడా ఆమె అర్ధం చేసుకుంటుంటే.. శశాంక్ మనసు ఉప్పొంగేది. గుండెలు పట్టని భావమేదో ఉక్కిరిబిక్కిరి చేసేది. రోజూ నిద్ర లేచేది ఆకాంక్ష కోసమే అన్నట్టుగా ఉండేది శశాంక్‌కి.  శశాంక్ డిపార్ట్‌మెంట్‌లో కొలీగ్స్ అందరూ ఇంచుమించుగా యంగ్‌స్టర్సే....

కొడుకిచ్చిన బహుమతి

ఆమె రోజూ హైదరాబాద్ సంతల్లో చేపలు శుభ్రం చేస్తూ పొట్ట పోషించుకుంటుంది. ముఖ్యంగా ఆదివారం మంచి గిరాకీ ఉంటుంది. కస్టమర్లు తెచ్చే రొయ్యలు, పీతలు, మెత్తళ్లు, కొరమీను వంటి చేపల తొక్క/పొలుసులు తీసి, కడుపుని కోసి, శుభ్రం చేసి అందిస్తుంది. అందుకు కేజీ చేపలకి 40 రూపాయిలు వసూలు చేస్తుంది. పొద్దున్నే ఊరి నుంచి బయలుదేరి ఎక్కడ సంత ఉంటే అక్కడకి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నానికల్లా ఇంటికి చేరుకుంటుంది. ఆదివారాల్లో కాస్త లేటవుతుంది. ఆదివారం రోజు తోడుగా ఏడేళ్ళ కొడుకు కూడా వస్తాడు. భర్త లేడు.. వదిలేసి పోయాడు. ఏ గుర్తింపూ లేని జీవితాన్ని ఆమె నిస్సారంగా గడుపుతోంది.  ఒకరోజు మధ్యాహ్నం ఇంటికొచ్చాక "అమ్మా, హ్యాపీ బర్త్‌డే!" అంటూ కొడుకు ఆమెని కౌగిలించుకుంటాడు. సిద్ధంగా ఉంచుకున్న ఒక కేకు ముక్కని ఆమెకి తినిపిస్తాడు. ఊహించని ఈ ఘటనకి ఆనందపడుతుంది. నిజానికి తన పుట్టినరోజెప్పుడో ఆమెకి తెలియదు. ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు మాత్రం ఉన్నంతలో బాగా చేస్తుంది. ఒకసారి కొడుకు తను పుట్టిన తేదీ గురించి పదేపదే అడిగేసరికి.. అప్పుడు నోటికొచ్చిన తేదీని చెబుతుంది. కానీ కొడుకు ఆ తేదీని ఇంతలా గుర్తుంచుకొన...

ఉక్రోషం weds దైన్యం

ఆమెకి నవ్వాలంటే భయం. అతను బయటకే నవ్వుతూ కనిపిస్తాడు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె తల్లిదండ్రులు పురుగులమందు తాగి చనిపోతే, తను మామయ్య వాళ్లింట్లో పెరిగింది. అత్త పెద్ద ఆశపోతు. మామయ్య ఎంత తెచ్చినా సరిపోదు. దానికి తోడు గుదిబండలా ఈమె. తోటిపిల్లలు ఆడుకుంటుంటే తాను వెట్టిచాకిరీ చేసుకుంటూ సెల్ఫ్‌పిటీ కి కేరాఫ్ అడ్రస్‌లా మారింది. 15 ఏళ్లకి అత్తకొడుకు లైంగికంగా వేధిస్తుంటే అత్త కంటపడి, కొడుకుని పాడు చేస్తోందన్న అపవాదుతో ఇంటినుంచి బయటకు గెంటివేయబడింది. సిటీలోని ఒక అనాధ ఆశ్రమంలో చేరిన ఆమె చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో డొమస్టిక్ హెల్పర్‌గా సెటిలయ్యింది. చూడడానికి అందంగా లేని ఒక యోగినిలా కనిపించే ఆమెకి లోలోపల సినీతారలు, సెలబ్రిటీలంటే పిచ్చ క్రేజ్. వాళ్లకి సంబంధించిన అన్ని వార్తలూ చదివేస్తుంది. ‘వచ్చే జన్మలో నేను ఏ సెలబ్రిటీగా పుడతాను’ అని ఊహించుకోవడమే ఆమె దైనందిన జీవితంలోని ఆటవిడుపు. అతనొక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పెద్ద కుటుంబం. ఒకర్నొకరు అంతగా పట్టించుకోలేని వాతావరణంలో చందమామ కథలే అతని నేస్తాలు. రాక్షసుడిని గెలిచే రాజునేనే అని ఊహించుకునేవాడు. ...