శశాంక్ ఇప్పటివరకు పోర్న్ చూడలేదు.
చాలా సున్నితమనస్కుడు తను. నల్లగా, సన్నగా.. అందవికారంగా ఉండడు కానీ అందగాడు కాదు.
ఇళయరాజా పాటలు, సిరివెన్నెల సాహిత్యం, వెన్నెల, పెయింటింగ్.. ఇలా అతని కాలేజి జీవితం
హాయిగా గడిచిపోయింది. ఏ అమ్మాయీ అతనితో ఫ్రెండ్షిప్ చేసింది లేదు. అతను పనిగట్టుకొని
అమ్మాయిల కోసం ట్రై చేసే టైపూ కాదు. తనని అర్థం చేసుకునే ఒకరిద్దరి ఫ్రెండ్స్‌తో ఏ అద్భుతమూ
లేకుండా సాధారణంగా సాగిపోతుండగా తెలియకుండానే ఒక అద్భుతం అతని జీవితంలోకి
చొరబడింది.
ఆ అద్భుతం పేరు - ఆకాంక్ష. పెద్ద అందగత్తె కాదు కానీ ముఖంలో కళ ఉంటుంది. ఇంజనీరింగ్
అయ్యాక ఓ కాలేజిలో ఫాకల్టీగా చేరిన శశాంక్‌కి ఈమె కొలీగ్. తొలిరోజుల్లో పొడి, పొడి పలకరింపులే
క్రమంగా ఊసుల చిరుజల్లులయ్యాయి. ఇద్దరికీ ఇళయరాజా పాటలన్నా, వర్షమన్నా, వెన్నెలన్నా ఇష్టం.
తన చిన్న చిన్న ఫీలింగ్స్‌ని కూడా ఆమె అర్ధం చేసుకుంటుంటే.. శశాంక్ మనసు ఉప్పొంగేది. గుండెలు
పట్టని భావమేదో ఉక్కిరిబిక్కిరి చేసేది. రోజూ నిద్ర లేచేది ఆకాంక్ష కోసమే అన్నట్టుగా ఉండేది శశాంక్‌కి.
శశాంక్ డిపార్ట్‌మెంట్‌లో కొలీగ్స్ అందరూ ఇంచుమించుగా యంగ్‌స్టర్సే. తనతో పాటే పాస్ ఐన వాళ్లు,
లేదా తనకంటే ఒకట్రెండు సంవత్సరాల సీనియర్లు. వారందరిలోకి వంశీ అనే కుర్రాడు పాపులర్.
అందంగా, హుషారుగా ఉండి తోటి లేడీ కొలీగ్స్ అందరినీ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ, పెళ్ళి వంటి
అటాచ్‌మెంట్స్ లేకుండా ఎంజాయ్ చెయ్యడమే తన ఫిలాసఫీ అంటూ అమ్మాయిలతో ఓపెన్‌గా
మాట్లాడతాడు. శశాంక్ కి వంశీ అంతగా నచ్చడు. వంశీ పట్ల ఉన్న కొద్దిపాటి ఈర్ష్యని అయిష్టం అని
భావిస్తుంటాడు. కానీ శశాంక్‌కి బాగా నచ్చే విషయమేంటంటే తను ఆరాధించే ఆకాంక్ష వంశీని అస్సలు
పట్టించుకోకుండా.. అంటీ ముట్టనట్టు వ్యవహరించడం. ఇదనే కాదు, ఆకాంక్షకి సంబంధించిన ప్రతీ
విషయమూ శశాంక్‌కి అపురూపమే - ఆమె పాదాలకి పెట్టుకునే నెయిల్‌పాలిష్ కలర్ నుంచి.. ఆమె
కనుబొమ్మల వంపు ఎంత కోణం ఉంటుందన్నది కూడా. MTech లో సీట్ కొట్టాక తన మనసులోని
మాటను ఆమెకి చెప్పాలనుకున్నాడు. అందుకే GATE పరీక్ష కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నాడు.
ముందు ఆకాంక్ష చెప్పులు చూసి షాక్ అయ్యాడు. ఆకాంక్ష లాంటివే చెప్పులు ఇంకెవరో అమ్మాయి
వేసుకొని ఉంటుందని ఊహించాడు. ఇలాంటి టైమ్‌లో తలుపు తట్టడం భావ్యం కాదని భావించాడు.
అలాగని వెనక్కి వెళ్లలేకపోయాడు. బయటకు వచ్చేంతవరకూ అక్కడే వెయిట్ చేసాడు. ఒక అరగంట
తర్వాత తలుపు తెరుచుకుంటూ బయటకు వచ్చింది ఆకాంక్ష. ఆమె చాలా క్యాజువల్‌గా ఉంది. తనని
చూసి కూడా ఎలాంటి త్రొటుపాటు లేకుండా "హాయ్ శశాంక్, నువ్వేంటి ఇక్కడ?.." అని అడగడంతో
శశాంక్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఐతే వంశీ ముఖంలో సన్నని అదోరకమైన గర్వం
శశాంక్‌లో అనుమానం రేకెత్తింది. మరుక్షణం శశాంక్ ఆకాంక్షని చూస్తూ అలానే నిల్చుండిపోయాడు.
అతని కళ్ళు పెద్దవిగా మారి, ఎరుపెక్కాయి. ముక్కుపుటాలు అదిరాయి. పెదవులు వణికాయి. ఆకాంక్ష
ఏమీ మాట్లాడకుండా బయలుదేరింది. రెండు నిమిషాలు అక్కడే నిలుచున్న శశాంక్ ఆకాంక్షని వీధి
చివరన ఒక్క అంగలో అందుకున్నాడు.
"ఆకాంక్ష.. నీ ముఖం మీద బొట్టు మిస్సయ్యింది." అన్నాడు. ఆమె బొట్టుని తడుముకుంది. "అది వంశీ
ఛాతిమీద అందంగా మెరుస్తోంది." అన్నాడు. ఆకాంక్ష ఒక్క క్షణం కన్నులు మూసి తెరిచింది. "మనసుకి
ఆహ్లాదం కోసం నీతో కబుర్లు.. దేహం దాహం కోసం వంశీ.. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటాను." అని
చెప్పి వెళ్లిపోయింది.
ఇది జరిగిన కొన్నాళ్ళకి శశాంక్ పోర్న్ చూడడం మొదలుపెట్టాడు.
Comments