Skip to main content

ప్రపోజల్

కావ్య ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టింది. సగటు టీనేజ్ ఊహలు, ఐడెంటిటీ క్రైసిస్ ఆమెకీ ఉన్నాయి.
కానీ తనని అబ్బాయిలు చూడడం లేదని ఆమెకి లోలోపల చాలా బాధగా ఉండేది. చూడడం అంటే
అందమైన అమ్మాయి కనపడగానే అబ్బాయిలు ఒకరకమైన మైమరుపుతో అలా చూస్తుండిపోతారే..
అలాంటి చూపులు తనకి కావాలి. "తన వక్షోజాలు చిన్నవి.. అందుకే అబ్బాయిలు తనని చూడడం
లేదు.." అన్న ఫీలింగ్ ఆమెలో గాఢంగా నాటుకుపోయింది. ఎవరో అబ్బాయి "ఫ్లాట్ స్క్రీన్" అని తన
గురించి మాట్లాడుకోవడం ఆమెకి గట్టిగా తగిలింది. అప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ ఇదే ఆలోచన.
అద్దంలో తనని తాను చూసుకుంటుంటే కోపం. టైట్ డ్రెస్ వేసుకుంటే తన లోపం తెలిసిపోతుందని..
లూజ్ డ్రెస్ వేసుకుంటే ముసలమ్మ అంటారని.. ఇలా రోజూ డ్రెస్ వేసుకోవడమన్నది కావ్యకి ఒక
సమస్య. సెల్ఫీ దిగడమొక సమస్య. ఫ్రెండ్స్‌తో బీచ్‌కి వెళ్లాలంటే సమస్య. అప్పటి వరకూ సరదాగా
ఉండే తను సడెన్‌గా ఎందుకు మూడీగా ఐపోతుందో తనకే తెలియదు. కావ్య పేరెంట్స్‌కి ఇవేమీ పట్టవు.
వాళ్లకి కావల్సిందల్లా ఆమె వీక్లీ టెస్టుల్లో తెచ్చుకుంటున్న ర్యాంకులే.

ఇన్ఫిరియారిటీ, పేరెంటల్ ప్రెజర్‌తో సతమతమవుతున్న కావ్య జీవితంలోకి ఒక అందమైన కలలా
ప్రవేశించాడు రిషి. సీనియర్ అబ్బాయిల్లోని అందగాళ్లలో రిషి కూడా ఒకడు. అతను తన అందాన్ని
మెచ్చుకోవడం ఆమెకి ఊపిరాడని అనుభూతి. కొద్దిరోజుల్లోనే కావ్య ప్రపంచం అందంగా మారిపోయింది..
రిషి తన ప్రపంచమయ్యాడు. రిషి తన వెంటపడడం చందనకేమీ నచ్చలేదు. చందన కావ్య క్లాస్‌మేట్,
క్లోజ్ ఫ్రెండ్ కూడా. క్లాస్‌లో అందరికన్నా అందగత్తె ఐన చందన తనని చూసి ఈర్ష్య పడడం కావ్యకి
మరింత కిక్ ఇచ్చింది.

రిషి ఒకసారి ముద్దుని దాటి ఇంకేదో చెయ్యబోతుంటే కావ్య వారించింది. రిషి దానికి చాలా సీరియస్‌గా
రియాక్ట్ అయ్యి, వారం రోజులుగా సరిగ్గా మాట్లాడడం లేదు. కావ్యకి తాను సాధించిన అతి గొప్ప
విజయాన్ని పోగొట్టుకున్నట్టుగా అనిపించింది. 

ఆ రోజు ఫ్రైడే. రిషికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ‘ఇంట్లో అంతా పెళ్ళికి వెళ్తారు.. తానొక్కడినే ఇంట్లో ఉంటాన’ని
రిషి ముందే చెప్పాడు కావ్యకి. కావ్య అది గుర్తుంచుకొని మధ్యాహ్నం క్లాస్ బంక్ కొట్టి రిషి ఇంటికి వెళ్లాలని
డిసైడ్ అయ్యింది. రిషి తన సర్వస్వం అని.. తనని ఎలాగైనా ప్లీజ్ చెయ్యాలని నిశ్చయించుకుంది. ఒక
రోజా పువ్వు పట్టుకొని, "I am sorry, Rishi. I love you." అని చెబ్దామనుకుంది. రిషి తలుపు తెరవగానే
కౌగిలించుకోవాలని ముందుకొచ్చిన కావ్య అతని  పక్కనే చందనని చూసి స్థాణువయ్యింది. చందన
బట్టలు చిందరవందరగా ఉండడం చూసి.. ఉక్రోషాన్ని ఆపుకోలేక చందనని చాచికొట్టింది. అది చూసి
రిషి కావ్యని చాచికొట్టాడు. "నీలాంటి ఫ్లాట్ బాడీకి ఎలా పడతాననుకున్నావే.. చందన అనే బల్బ్
వెలిగించడానికి నువ్వొక స్విచ్‌వి." అని రిషి చెప్పేసరికి మౌనంగా కావ్య తన ఇంటికెళ్ళింది. తన
బెడ్‌రూంలో సూసైడ్ చేసుకుంది. ఇది జరిగిన కాసేపటికి రిషి బెడ్రూంలో తమకంతో
పెనువేసుకుంటున్న ప్రేమికుల శరీరాల్లో అకస్మాత్తుగా మార్పులొచ్చాయి. చందన వక్షోజాలు అమాంతం
తగ్గిపోయి వట్టిపోయాయి. రిషి ఛాతి భాగం రెండువైపులా ఉబ్బి అమ్మాయి వక్షోజాల్లా మారిపోయాయి.

అప్పటినుంచి కావ్య ఆత్మ కాలేజిలో తిరగడం మొదలుపెట్టింది. ప్రతీ ఫ్రైడే కాలేజీలో ఒకబ్బాయికి
ప్రపోజ్ చేసేది. అతను ఒప్పుకుంటే ఎవ్వరికీ కనపడకుండా మాయమైపోయేవాడు. ఒప్పుకోకపోతే వాడి
ఛాతి భాగం అమ్మాయిలా మారిపోయేది. 

ఇలా చాలామంది అబ్బాయిలకి జరగడంతో కాలేజి మూసేసారు. అటువైపు ఎవ్వరూ వెళ్ళక భవనం
శిధిలమయ్యింది. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం విశాలమైన ఆ కాలేజి ఆవరణలో శిధిల గోడల మధ్య రోజా
పువ్వు పట్టుకొని కావ్య తిరుగుతూ ఉంటుంది - ప్రపోజ్ చెయ్యడానికి.

Comments