ఆమెకి నవ్వాలంటే భయం.
అతను బయటకే నవ్వుతూ కనిపిస్తాడు.
రైతు కుటుంబంలో పుట్టిన ఆమె తల్లిదండ్రులు పురుగులమందు తాగి చనిపోతే, తను మామయ్య వాళ్లింట్లో
పెరిగింది. అత్త పెద్ద ఆశపోతు. మామయ్య ఎంత తెచ్చినా సరిపోదు. దానికి తోడు గుదిబండలా ఈమె.
తోటిపిల్లలు ఆడుకుంటుంటే తాను వెట్టిచాకిరీ చేసుకుంటూ సెల్ఫ్‌పిటీ కి కేరాఫ్ అడ్రస్‌లా మారింది. 15
ఏళ్లకి అత్తకొడుకు లైంగికంగా వేధిస్తుంటే అత్త కంటపడి, కొడుకుని పాడు చేస్తోందన్న అపవాదుతో
ఇంటినుంచి బయటకు గెంటివేయబడింది. సిటీలోని ఒక అనాధ ఆశ్రమంలో చేరిన ఆమె చిన్నా చితకా
పనులు చేసుకుంటూ ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో డొమస్టిక్ హెల్పర్‌గా సెటిలయ్యింది. చూడడానికి
అందంగా లేని ఒక యోగినిలా కనిపించే ఆమెకి లోలోపల సినీతారలు, సెలబ్రిటీలంటే పిచ్చ క్రేజ్. వాళ్లకి
సంబంధించిన అన్ని వార్తలూ చదివేస్తుంది. ‘వచ్చే జన్మలో నేను ఏ సెలబ్రిటీగా పుడతాను’ అని
ఊహించుకోవడమే ఆమె దైనందిన జీవితంలోని ఆటవిడుపు.

అతనొక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పెద్ద కుటుంబం. ఒకర్నొకరు అంతగా పట్టించుకోలేని
వాతావరణంలో చందమామ కథలే అతని నేస్తాలు. రాక్షసుడిని గెలిచే రాజునేనే అని ఊహించుకునేవాడు.
ఇంట్లో అందరికన్నా తాను చదువులో కాస్త రాణించడంతో, తెలియకుండానే తాను స్పెషల్ అన్న ఫీలింగ్
కలిగేది. దానికితోడు ఊహావిహారం. తన ఈడువాళ్లతో కాకుండా తనకన్నా వయసులో చిన్నవాళ్లతో
జట్టుకట్టేవాడు. ఎందుకంటే వాళ్ల గుంపులో తాను స్పెషల్‌గా కనపడతానని. చందమామ కథల్ని తన
సొంత కధలుగా పిల్లలకి ఎంతో ఆసక్తికరంగా చెప్పేవాడు. చుట్టుపక్కలవాళ్ళు తన గురించి అప్పుడప్పుడు
గొప్పగా చెప్పిన మాటలు మనసులో గాఢంగా నాటుకుపోయేసరికి "పెద్దైతే నేను చేసే అద్భుతాలకి
ప్రపంచం నాకు జేజేలు పలుకుతుంది.. నేను చాలా స్పెషల్." అన్న ఊహలు బలపడ్డాయి.
ఇంటర్మీడియట్‌లో డిసైడయ్యాడు తన లక్ష్యం - సినిమా డైరక్టర్ అవ్వడం అని. తన లక్ష్యాన్ని ఇంట్లో
వాళ్ళు ఒప్పుకోకపోవడంతో డిగ్రీ తర్వాత బయటకి వచ్చి సినిమా ప్రయత్నాలు చేస్తుంటే తెలిసొచ్చింది
సినిమా కష్టాలంటే ఏమిటోనని. ఏ కథ రాసినా "మామూలుగా ఉంది" అనేవారు. తన మనసులో ఏదో
మూల అది నిజమేనని తనకీ తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి తనమీద తను పెంచుకున్న ఇమేజ్‌ని
కూలగొట్టుకోలేని పరిస్థితి. అప్పుడు దొరికింది అతనికి ఒక డైరీ. అద్భుతమైన కథలున్న డైరీ అది.
కృష్ణానగర్‌లో తాను దిగిన కొత్త రూమ్‌లోని అటక మీద దొరికింది అతనికి. ఆ డైరీలోని ఒక కథతో తీసిన
సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో.. ఒక్క రాత్రిలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా సక్సెస్‌మీట్‌లో
అందరూ చప్పట్లు కొడుతుంటే.. నిండుగా ఆ ప్రశంసలని తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న
సమయంలో అతను ఆమెని చూసాడు. సెలబ్రిటీలని చూస్తున్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు. అదే
సమయంలో తన బతుకు మీద తనకి చెప్పలేనంత దైన్యం. అతనికి ఆమె ఇంట్రస్టింగ్‌గా అనిపించింది.

ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చాక కూడా అతను తన సొంత కథ చెప్తే.. ప్రాజెక్ట్ పట్టాలెక్కేది కాదు.. చివరికి
డైరీలోని వేరొక కథే ఓకే అయ్యేది. డైరీలోని కథకి స్వంతంగా ఏమన్నా చిన్న మార్పులు చేసినా ఫ్లాపయ్యేది.
అతనికి అత్యంత ఆప్తుడూ, అతిపెద్ద శత్రువూ ఆ డైరీనే.

ఆమెతో ఒకట్రెండు సార్లు మాట్లాడాక అతను ఆమెకి ప్రపోజ్ చేసాడు - "నేను నిన్ను పెళ్లి
చేసుకుందామనుకుంటున్నాను. కాకపోతే ఈ రిలేషన్ లో నా నుంచి నీకు చాలా physical abuse
ఉంటుంది ." అని. ఆమె సరే అంది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఆమె రోజూ సెలబ్రిటీ సంగతుల్ని ఇతని ద్వారా తెలుసుకునేది. ప్రపంచం మీద కసిని ఈమెని రోజూ
బెడ్రూంలో హింసించడం ద్వారా అతను తీర్చుకునేవాడు.

Comments